గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -౩ 111- రవీంద్రుని భావ ప్రచారకుడు -కే టి.పాండురంగి (1918)

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -౩

111- రవీంద్రుని భావ ప్రచారకుడు -కే టి.పాండురంగి (1918)

పాండురంగి 1918లో ఫిబ్రవరి 1న జన్మించి వేదా౦తవిద్వాన్ అయ్యాడు .మీమామ్సశిరోమణి , సంస్కృతం లో ఏం ఏ సాధించాడు ..మహామహోపాధ్యాయ కుప్పుస్వామి శాస్త్రి గారి శిష్యుడు .దార్వార్ శంకరాచార్య పాఠశాల ,పూనా శ౦కరేశ్వర మఠ్ లో  మైసూర్ మహారాజాకాలేజి ,అన్నామలై ,బెనారస్ హిందూ యూని వర్సిటీలలో చదివాడు .కర్నాటకకాలేజి  దార్వార  కోలారు ప్రభుత్వ  కాలేజీలలో పని చేసి  బెంగుళూర్  యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాడు .’’విశ్వ మంగళ’’కలం పేరుతొ సంస్కృత రచనలు చేశాడు .దర్శన రత్న ,మీమాంస విభూషణ ,శాస్త్ర నిధి ,పండిత రత్న విద్యామాన్య ప్రశస్తి ,బిరుదులతోపాటు ఉత్తరప్రదేశ్ సంస్కృత సంస్థాన్ నుంచి విశిష్ట పురస్కారం ,తిరుపతి సంస్కృత విద్యా సంస్థాన్ నుంచి  రాష్ట్రపతి నుంచి ప్రతిభా పురస్కారాలు అందుకున్నాడు .

     తన సంస్కృత రేడియోనాటికలను  ‘’నభోవాణి రూపకాని’’గా తెచ్చాడు .రవీంద్రుని నాటికలను సంస్కృతీకరించి ‘’రవీంద్ర రూపకాని ‘’గా వెలువరించాడు .సంస్కృత పత్రికాని ఇతిహాసః ,చంద్రం గతోమానవః ,భారత భాగ్య చక్రం రాశాడు కన్నడం లో కూడా మంచి రచనలే చేశాడు తన రచనలన్నిటిలో ఉపనిషద్ భావాలను ప్రకాశి౦ప జేయటం  పాండురంగి ప్రత్యేకత .రవీంద్ర సందేశాన్ని ఆయన నాలుగు నాటికలు సన్యాసి మాలిని నృప మహిషాచ ,,

కర్నా -కుంతీ చ గా సంస్క్రుతానువాదం  చేసి వ్యాప్తి చేశాడు రంగి . .కుమార సంభవం 5 వ కాండ ను ‘’తపః ఫలః రెడియోనాటి కగా తీర్చిదిద్దాడు .సీతాత్యాగః ఏకాంకిక మూడు దృశ్యాలతో సీత పరిత్యాగ కదగ, తన 35కవితలను ‘’కావ్యాన్జలి’’గా తెచ్చాడు .ప్రాచీన ఆధునిక సంస్కృత సాహిత్య వారధి  పాండురంగి .ఆయనలో శాస్త్రీయ భావన  కవితా వేశం పుష్కలంగా ఉన్నాయి . ,

ఇన్‌లైన్ చిత్రం 1

112-స్తోత్రాల -బాలగణపతి భట్ట(1919)

  బాలగణపతి భట్ట 1919 జ్జనవరి6న శృంగేరిలో పుట్టి ,సాహిత్య విద్వాన్ కన్నడ పండిట్ రాస్త్రభాషా విశారద డిగ్రీలు పొందాడు ..చామరాజ కాలేజి లో బోధించాడు .లెక్కలేనన్ని భక్తీ రచనలు సంస్కృతం లో చేశాడు .ఇందులో గణపతి సుప్రభాతం ప్రసిద్ధి చెందింది .-

‘’దశభుజ యుత దేవం సింహవాహం క్రుతే త్వం -భజతి శిఖి సువాహనం సిద్ధిదం బాహు సత్జ్యం-యుగ కర సహితం త్వం రక్షకాయం  గజాస్యం -యుగయుగం అఖిలో వై హస్తయుగ్మం సితాంగం’’

భావం -కృతయుగం లో జనం నిన్ను 10 భుజాలవానిగా  సింహవాహనునిగా ,త్రేతాయుగం లో ఆరు చేతులు నెమలివాహన౦ ఉన్నవాడిగా ,,ద్వాపరంలో నాలుగుబుజాలు ఏనుగు ముఖం తో ఉన్న నిన్ను పూజించారు .కలియుగం లో ద్విభుజునిగా శ్వేత వర్ణం గలవానినిగా నిన్ను అర్చిస్తున్నారు .

శ్రీ సత్యనారాయణ సుప్రభాతం శ్రీ గంగా ధర సుప్రభాతంకూడా రాశాడు బాలభట్టు -గజారిహరి నాగ జాతిహారి -గజాస్య మోదో.నగజాస్తామదః

ఇన్‌లైన్ చిత్రం 2

113-ఏం జి .నంజు౦డారాధ్య (19 19 )

19 19 ఆగస్ట్ 1 న పుట్టిన నంజుండా రాధ్యతలిదండ్రులు వీరమ్మ గంగాధరయ్య .సిద్ధనగ్ర  బెంగళూర్ జయచామరాజ కాలేజీలలో సంస్కృతం నేర్చి సాహిత్యం లోనూ శక్తి విశిష్టాద్వైతం లోను మాస్టర్ డిగ్రీలు పొందాడు .కన్నడ హిందీ డిగ్రీలు సాధించాడు .సంస్కృతం లో ‘’మేదర చన్నయ్య ‘’నాటకం తో భక్తిగీతాలు చాలా రాశాడు .వీటిని సుప్రభాతాలు స్తోత్రాలుగా పేర్లు పెట్టాడు ..శ్రీకర భాష్యం రెండుభాగాలుగా రాశాడు .ముండక ,కైవల్య ఉపనిషత్తులను సదాశివ భాష్యం రేణుకా గీత భాష్యం లుగా వీర శైవ ప్రయోగ మంత్రం ,శ్రీకరభాష్య౦  చతుశ్లోకీ మొదలైనవి ప్రచురించాడు .మైసూర్ మహారాజా  ఆస్థాన విద్వాంసుని చేసి గౌరవించగా ,,కర్నాటక రాష్ట్రం అవార్డ్ ను ,ఇవ్వగా సాహిత్య రత్న ,శివ  తత్వ చింతామణి  శివాద్వైత భూషణ ,విద్యావారిది బిరుదులూ తన విద్వత్తుకుకు తగినవి గా పొందాడు .సంస్కృత కన్నడ సాహిత్యాలకు తన రచనా పతిభ వలన నంజుండా రాధ్య పరిపుష్టి కలిగించాడు .

114-దేవీ విలాస ఖండకావ్య కవి -కే.ఎస్.భాస్కర భట్ట -(19 20)

1920 లో కర్నాటకసాగర్ తాలూకా భీమన కొనే గ్రామం లో భాస్కర భట్ట జన్మించాడు .అలంకార శాస్త్రం లో విద్వాన్ ,కన్నడం లో పండిట్ అయ్యాడు .చాలా స్కూళ్ళలో పనిచేసి రెండూ బోధించాడు .అయోధ్య సంస్కృత పరిషత్ సాహిత్య భూషణ ,ఇస్తే లింగరాజు సంస్థ ప్రైజ్ మైసూర్ మహారాజు దేవీ విలాస ఖండకావ్యానికి ప్రదానం చేశాడు .దీనితోపాటు గురు క్రుపాతరంగిణి రాశాడు .రామచంద్ర మఠంలోని శ్రీరాముని వర్ణిస్తూ

‘’యన్నామ సంకీర్తన రసప్లవ చిత్త వృత్తీ -నిష్కల్మషః కులపథిహ్ ప్రధమః కవీనాం

రామాయణం నవవరాంబునిదిం వ్యతాన్తీ-తం రామ చంద్ర మనీషంప్రణమామి . శాంతరసానికి ప్రాధాన్యత నిచ్చాడు .అవసరమైన చోట్ల మంచి శుభాషితాలను కూర్చాడు

‘’కర్మాణి స్వతహా ప్రవృత్తిం  అపూర్వ న్త్యకా మానవాః -వీత రాగిణా పరార్ధ సాధకా హిసర్వవదా

వేదాంత భావన అపూర్వ పద సమ్మేళనం తో పరవశం కలిగించేశ్లోకాం –

‘’కేవలం నిరంజనం నిరాకారం నిరీహికం -జన్మ మృత్యు నాశకం భావార్నస్య తారకం -నిత్య శుద్ధ బుద్ధ ముక్తం అనుభావికం పరం -తత్ పదం నిజ స్వరూపం ఆపనుయాం అహం కదం ?కవిపై వాల్మికి కాళిదాస జయదేవుల ప్రభావం ఉన్నది .

115- లజపతి తరంగిణి కర్త -హరిశ్చంద్ర రేన పుర్కార్ (1924)

1924లో మహారాష్ట్రలో రేనాపూర్ గ్రామం లో 19 24 సెప్టెంబర్ 17 న హరిశ్చంద్ర రేన పుర్కార్ జన్మించాడు .సంస్కృతం లో ఏం ఏ డిగ్రీ పొంది కర్నాటక, ఆంధ్రా కాలేజీలలో బోధింఛి ప్రస్తుతం గుల్బర్గా లో ఉంటున్నాడు .ఎన్నో సంస్క్రుతపత్రికలలో రచనలు చేసి పేరు పొందాడు .ప్రస్తుతం సంఘ విలువలు దిగజారి పోతున్నందుకు వ్యధ చెందాడు .జాతీయ నాయకులైన దయానంద గాంధి నెహ్రు సత్వలేకర్ ఇందిరా గాంధీ మొదలైనవారిపై కవితలల్లాడు .భారతీయ స్వాతంత్ర సమరం పై లజపతి తరంగిణి అనే 89శ్లోకాల కావ్యం  రాశాడు . . .శాస్త్రి శ్లోక లహరి, ఇందిరా  హౌతమ్యం కూడా రాశాడు ..దేశం లోని దారుణ కరువుపై ‘’భీషణం దుర్భిక్షం . ‘’కవిత రాశాడు .సమకాలీన విషయాలపై పుంఖాను పుంఖంగా పారిజాతం సంస్కృత భవితవ్యం మొదలైన మేగజైన్ లలో కవితలు రాశాడు

ఇన్‌లైన్ చిత్రం 3

.116-కావ్య తరంగిణి -కర్త -సి జి పురుషోత్తం (19 25)

పురుషోత్తం 19 25లో జన్మించి ,చుంచున కట్టే గురుకులం లో చంద్ర శేఖర భట్ట ,రంగా చార్ లవద్ద సంస్కృతం నేర్చి సంస్కృతం చరిత్రలలో ఏం ఏ అయ్యాడు .మైసూర్ మహారాజా కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .రెండుభాగాలుగా కావ్య తరంగిణి ,ఆది చుంచు గిరి సుప్రభాతం ,సర్వజన వచనాని రాశాడు .కన్నడ మహాకవి ‘’కువెంపు ‘’కవితలతో పాటు అనేక కన్నడ హిందీ  కవితలను సంస్కృతం లోకి అనువదించి కావ్య తరంగిణి రాశాడు .నాలుగవ భాగం లో తన స్వంత కవితలను రాశాడు .ఆది చుంచు సుప్రభాతం లో 27శ్లోకాలున్నాయి .ఇవి 27 నక్షత్రాలకు ప్రతీక. తారావళి అనచ్చు .కర్నాటక స్టేట్ అవార్డ్ ,చుంచుగిరి మఠపురస్కారం పొందాడు .కువెంపు కవి కన్నడ నాటకాలను కూడా గీర్వాణ౦ లోకి అనువదించి సంస్కృత సేవ చేశాడు .

ఇన్‌లైన్ చిత్రం 4

117-మదిరా విలాస ప్రహసనకర్త -నారాయణ మధ్యస్థ (19 30)

19 30 జనవరి 10 న లో కేరళలోనీల్చర్లులో  పుట్టిన నారాయణ మధ్యస్త సంస్కృత సాహిత్య శిరోమణి కన్నడ పండిట్ హిందీ రాష్ట్ర భాషా విశారద .సంస్కృతం లో మదిరావిలాస ప్రహసనం ,అఖండ పురాణం ,కాలే వర్షతు పర్జన్య  .అనే మూడు నాటకాలు రాశాడు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.