హిమాలయ గుహాంతర ఆశ్రమ (మఠ)జీవన విధానం
హిమాలయాలలో కొన్ని గుహలలో నాలుగైదు మంది ఉండే అవాకాశం ఉంది .అక్కడ పవిత్ర జీవనం హాయిగా నిరాటంకం గా గడపవచ్చు .ఇక్కడ సంప్రదాయం అవిచ్చిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది .కొన్ని పెద్ద గుహాంతర ఆశ్రమాలు మొనాస్టరీ లుఉంటాయి .వీటిలో సంప్రదాయం అయిదు వేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది .అందులో చేరిన మొట్టమొదటి గురువు ఎవరో ఆ తర్వాత వచ్చిన వారెవరెవ్వరో ,సంప్రదాయం ఎలా అక్కడ ప్రారంభమైందో రికార్డ్ లున్నాయి .
ఈ మఠాలనబడే గుహాశ్రమాలలో అనేక గదులు ఉంటాయి .శతాబ్దాలుగా అవి ప్రకృతి చేత స్వయం సిద్ధంగా తయారు చేయబడి చాలా మంది విద్యార్ధుల జ్ఞాన సముపార్జనకు తోడ్పడుతున్నాయి .అందులో తరతరాలుగా ఉన్నవారు సౌకర్యం ప్రశాంతత ల కొరకు వాటిని తీర్చి దిద్దుకున్నారు . అయితే ఆధునిక హ౦గు లేమీ ఉండవు ..స్నానాలగది, వంటగది వంటివి ఉండవు .కాని హాయిగా జీవనం గడపటానికి సరిపోతాయి .గుహ అంటే నే చీకటి గుయ్యారం అని అనుకొంటాం. కాని ఈ గుహలలో దూప్ అనే పేరున్న పొడవైన కర్రలు వనమూలికలతో చేయబడి ఉంటాయి ..దాన్ని వెలిగిస్తే కా౦తినిస్తుంది ఆర్పితేసువాసన వెదజల్లుతుంది నాలుగు అంగుళాల పొడవు అంగుళం మందం తో దూప్ తయారు చేస్తారు ..దానికాంతిలో కంటికి ఏ మాత్రం శ్రమ లేకుండా వేదం శాస్త్ర గ్రంధాలను అన్నీ హాయిగా చదవ వచ్చు .దాన్ని ఆర్ప్గగానే సుగంధ పరిమళం వ్యాపించి మానసిక హాయి నిస్తుంది .ఇది కాక పొతే పైన్ ,దేవదారు వృక్షాల కొమ్మలను తెచ్చి వెలిగించి కాంతిని పొందుతారు .వీటిలో ప్రకృతిసిద్ధమైన జిగురు పదార్ధం -రేజిన్ ఉండి మంట నిరనతరం గా మండటానికి దోహదం చేస్తుంది .ఇవే టార్చి లైట్లు గుహలో .గుహ నిరనతరం వెచ్చగా ఉండటానికి ‘’ధుని ‘’ఏర్పాటు చేస్తారు .అంటేలావుపాటి దుంగలను మండిస్తారన్నమాట .పెద్ద పెద్ద కొయ్య దుంగలను వేసవికాలం లోనే నరికి పోగు చేసి గుహలో లాట్లు గా పేరుస్తారు కట్టెల అడితీ లోలాగా .
కొన్ని రకాల పుట్టగొడుగులు ,లింగోరా ,ఓగల్ అనే అత్యధికంగా దొరికే కాయ గూరలను దుంపలను ,వ్రేళ్ళను వండుకొని లేక పచ్చివి తింటారు .ఇందులో తరూర్ ,గెంతి ముఖ్యమైనవి .మిగిలినవి చిలగడ దుంపలు లాగా బాగా తియ్యగా ఉంటాయి .బార్లీ బంగాళాదుంప ,గోధుమ ,పప్పు ధాన్యాలు ,మొక్కజొన్న ,లు హిమాలయాలలో 6 ,500 అడుగుల లోపు ఎత్తుప్రదేశాలలో పండుతాయి .వీటినీ వాడుతారు .ప్రతిగ్రామం లో కుటీర పరిశ్రమ ఉంటుంది .అక్కడ నాణ్యమైన ఉలెన్ దుప్పట్లు జంపఖానాలు వేడి నిచ్చే దుస్తులు లభిస్తాయి .నీటికి ఇబ్బంది ఉండదు చిన్న చిన్న నీటి ప్రవాహాలు ప్రతి గుహ దగ్గరా ,గుహలో కూడా ప్రవహిసాయి .నవంబర్ డిసెంబర్ నెలలో నీరు గడ్డ కడితే మంచు కరిగించి నీటిని వాడుతారు .మనాలి లాంటి ప్రదేశాలలో స్వచ్చమైన నీరు దొరకదు .మూడు నాలుగు మైళ్ళు నడిచి మంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తుంది . ఇప్పటికీ హిమాలయాలలోని కొన్ని గుహా౦తర ఆశ్రమాలలో గురువులు సంప్రదాయ పద్ధతిలో విద్య బోధిస్తూ కనిపిస్తారు .దేశం లోని అనేక ప్రాంతాలనుండి శిష్యులు వచ్చి విద్య నేర్చుకొంటారు .అంతఎత్తు ఎక్కి గురువుల వద్ద విద్య నేర్వటం చాలాకస్టమే. కాని దీక్షా పట్టుదల ఆసక్తి ఉన్నవారికి అది అసాధ్యం అనిపించదు .హిమాలయాలు గురుశిష్యులను జాగ్రత్తగా కనిపెడుతూ ఉంటాయి .విద్యార్ధులు ఇంటినుంచి బయల్దేరి ఉత్తమ గురువును అన్వేషిస్తూ వారిని దర్శించి విద్యను అభ్యాసం చేస్తారు. అలాంటి శిష్యులకోసం గురువు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు .హిమాలయ అంతర్భాగం లో మహా మహి మాన్విత ఋషులు తపస్సు ,ధ్యానం చేస్తూ వారికి దర్శన మిస్తారు. వారి జన్మ తరించినట్లు భావితారు .
గృహాశ్రమాలలో విద్యా బోధనప్రయోగాత్మక పద్ధతిలో -డిమాన్ స్ట్రేషన్ విధానం లో ఉంటుంది .బోధన నిర్నీతకాలాలలో జరుగుతుంది .కొంత విద్య నేర్చిన తర్వాత గురువు శిష్యులను తమ ప్రావీణ్యం ప్రదర్శించ మని కోరుతాడు .ఒక్కోసారి మౌనంగా నే బోధ ఉంటుంది .మౌన గురువు అని దత్తాత్రేయ స్వామికి పేరున్న సంగతి మనకు తెలుసు .మౌన వ్యాఖ్యానమే ఆయన ఆయన పధ్ధతి .శిష్యులు విద్య బాగా గడించాక గురువు ‘’మీ జీవిత కాలం అంతా ఇక్కడే గుహలో చదువులో గడిపితే యోగుల వద్ద మిగిలిన వారు ఎప్పుడు నేర్చు కుంటారు ?’’అని అడుగుతారు .కనుక కొన్నేళ్ళ తర్వాత వాళ్ళు గుహాశ్రమం నుండి బయటికి విశాల ప్రపంచం లోకి అడుగు పెట్టి మరింత విజ్ఞానం సాధిస్తారు ..
వ్యక్తీ సృజనతో ,పరోపకారంగా జీవించాలి .దీనికి అంతర్ దృష్టి ,మనసుపై నియంత్రణ సాధించాలి .వీటిని గుహాశ్రమాలలో క్షుణ్ణంగా నేర్చుకొంటే ,తరువాత వీటిని సాధన చేస్తే జీవిత పుష్పం నిరంతరం వికసించి ఫలితం కలిగిస్తుంది .ఇది సాధిస్తే జీవితం లో కస్టాలు సమస్యలను అవలీలగా ఎదుర్కొని ముందుకు సాగి అభివృద్ధి చెందవచ్చు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

