గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3
119-సోమలతను గుర్తించిన ఆధునిక వైద్యుడు -వైద్య భైరవ దత్త (19 40 )
వైద్య భైరవ దత్త హిమాలయ మూలికలపై సాధికారత కలవాడు .లివింగ్ అధారిటి .ఒకసారి స్వామి రామాతో తాను సోమలత ను తెస్తానని దాని ఫలితాలు చూపిస్తానని అంటే స్వామి డబ్బు ఇచ్చి పంపాడు సోమలత హిమాలయాలలో 11 వేల అడుగుల ఎత్తుప్రదేశాలలో ఒకటి రెండు చోట్ల మాత్రమేపెరుగుతుంది .యజ్ఞాలలో సోమరసం వాడటం అందరికి తెలిసిన విషయమే .వేదం లో చాలాసార్లు దాని ప్రస్తావన వస్తుంది .అన్నట్లుగా నే దత్త ఒక పౌను బరువు గల సోమలతను శోధించి సాధించి తెచ్చాడు
సోమలత నుంచి సోమ తయారు చేసి మార్జువానా ,హషీష్ లకు అలవాటు పడిన సాదువులపై ప్రయోగించారు .అది వారిలో భయ రాహిత్యాన్ని కలిగించింది .పాశ్చాత్యులు ‘’సైకేడిలిక్ మష్రూమ్స్ ‘’ పై పరిశోధించి చెప్పినట్లే ఈ సాధువులూ ప్రవర్తించారు . అయితే హిర్బాలజిస్ట్ దత్త మాత్రం అనేక రకాల మష్రూమ్స్ ఉన్నాయని అవీ ఇలాంటి ప్రబావాన్నే కలిగిస్తాయని సోమలత ఆ కుటుంబానికి చెందిన్దికాదని ఇది ప్రత్యేకమైనదని తెలియ జేశాడు సోమలత కుంచించుకు పోయే స్వభావం ఉన్న జాతికి చెందినది అన్నాడు . .అనేక ఆయుర్వేద గ్రంధాలలో వివిధ పుట్టగొడుగుల విషయాలన్నీ ఉన్నాయి వాటిని వాడిన వారికి సైకిక్ అనుభవాలు కలుగుతాయి అని చెప్పబడింది .కాని వాటిలో సోమలత పేరు లేదు .మిగతా ముడుచుకుపోయే రకాలు ఈ ప్రభావాన్ని కలిగించవు .అగారికస్ హైషిమస్ .స్ట్రామోనియం అనేవి విష పూరితమైనవి కాని కొద్ది మోతాదులో సేవిస్తే భ్రాంతి విభ్రమ కలిగిస్తాయి .సరైన మొతాదులోనే వాడాలి లేకపోతె వీటివలన ప్రాణ హ్హాని తప్పదు .
సోమ ,పాదరసాలను ఎలా వాడాలో అనేక రకాలుగా మనవాళ్ళు వర్ణించి వివరించారు .యోగ విధానం లో ఇలాంటి బయటి ప్రేరకాల వాడుక నిషేధం .కొద్దిమంది కింది స్థాయి సాధువులు వీటిని వాడి మత్తుగా స్తబ్దుగా ఉండిపోతారు తప్ప యోగ సాధనలో వృద్ధి పొందలేరు .అలాగే హోమియోపతి వైద్యం లో ఆర్సెనిక్ 10 ఏం, గరళం అతి తక్కువ డోసు లో చనిపోయే రోగికిస్తే భయం నుంచి బయట పడతారు ..గ్రీకులు ఈజిప్ట్ వారూ దీన్ని రోగులపై ప్రయోగించారు .అలాగే సోమ రసాన్ని వాడితే మనసు అంతర్ముఖమఔతున్దని హిమాలయ హీర్బాలజిస్ట్ లు వాడుతూ ఉంటారు .వారి ఉత్సవాలలో కూడా దీన్ని పవిత్రంగా వాడి నట్లు ఆర్యుల చరిత్రలో ఉన్నది .
పతంజలి మహర్షి కూడా యోగ సూత్రాలలో నాలుగవ అధ్యాయం మొదటి శ్లోకం లో ఔషధీ వనమూలికల నుండి తయారు చేయబడిన మందు మానసిక అనుభావలనిస్తుంది అని చెప్పాడు .అయితే ఇది తాత్కాలికమే కనుక దీనిపై ఆధారపదరాదన్నది ముఖ్య విషయం. సాధనే దారి .ప్రాచీన సాహిత్యం లో సోమరసాన్ని తెలివి తక్కువ విద్యార్ధులకు అంటే కుదురుగా ఆసన బద్ధులుగా ఎక్కువ సేపు కూర్చోలేని వారికి ఇస్తే ,అది వారి నాడీ వ్యవస్తపై ప్రభావం చూపి ,అనేక విధాలుగా పరిగెత్తే మానసిక ఆలోచనలు ఏకీక్రుతమౌతాయని చెప్పబడి ఉంది .అప్పుడు శరీరం స్వాధీనమై చెప్పినట్లు విని బాధ లేకుండా కూర్చోవటానికి వీలవుతుంది .కనుక ఇలా నిష్టగా ఆసన బద్దులు కాలేని వారు సాధనకు ముందే చేసే కొన్ని కార్య క్రమాలలో సోమరసాన్ని తీసుకుంటారు .దీని వాడకం ఇష్టం వచ్చినట్లు చేయరాదు హిర్బాలజిస్ట్ సలహాపైనే వాడాలి
వైద్య భైరవ దత్త ఇలాంటి ప్రేరకాలను మంత్రాలతో జోడించి రోగులకు వాడుతాడు .ఈ మంత్రాలను ఒంటరిగా ఉండి ఉపవాసం తో చదువుతాడు .దీనికి తోడూ కొన్ని తంత్ర క్రియలూ చేస్తాడు .కొందరు సాధువులు ఈ ప్రక్రియలో చాలా అనుభవం సాధించిన వారున్నారు .ఈ విధానం అంతా లేకుండా వాటిని వాడితే పరమ ప్రమాదం .నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి .భ్రమలు పెరిగి సైకిక్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ..కొందరికి భావాతీత అనుభవాలు కలగవచ్చు కాని యోగికి అవి సహకరించవు .తరువాత వ్యతిరేక ప్రభావం కలిగిస్తాయి .
భైరవ దత్త తానూ చాలా సార్లు సోమ రసాన్ని నిర్భయంగా వాడానని మంచి ధనాత్మక ఫలితాలిచ్చాయని ఉన్నత స్తితికలిగిందని చెప్పాడు స్వామి రామ తో .కాని దాన్ని పదే పదే వాడితే వ్యతిరేక ఫలితం కలగటం ఖాయమని చెప్పాడు మానసిక రోగాలు వస్తాయన్నాడు ..
ఒక రోజు ఉదయం దత్త’’ అస్టావర్గ’’రసం తయారు చేసి దానిలో సోమరసం కలిపి స్వామితో సహా అందరికీ ఇచ్చాడుతాగమని .స్వామికి అది చేదుగా వగరుగా అనిపించింది .భైరవ దత్త మంత్రాలు చదువుతూ ఊగిపోతూ డాన్స్ చేయటం ప్రారంభించాడు .చివరికి బట్టలన్నీ విప్పి విసిరిపారేసి కరాళ నృత్యం చేశాడు .స్వామి రామ్ కు తలనొప్పి వచ్చింది కాసేపటికి .శిష్యులకు ఎందుకు వీళ్ళు అలా ప్రవర్తిస్తున్నారో తెలియలేదు .హీర్బాలజిస్ట్ భారవ దత్త డాన్స్ చేస్తూ ‘’నేను శివుడిని ఈ విశ్వానికి అధిపతిని నా పార్వతి ఎక్కడ ఆమెతో శృంగారం చేయాలి ‘’అని అరిచాడు .అయిదుగురు ఆయనను ఆపటానికి ప్రయత్నం చేసినా ఆపలేక పోయారు .వాళ్ళని ఒక్కొక్కరిని తోసిపరేశాడు .ఈ ఉదంతమంతా స్వామి రామా ఉత్తర కాశిలో ఉజాలి ఆశ్రమం లో జరిగిందని రాశాడు .ఇలాంటి అనేక అనుభావాలవలన స్వామిరాం ఈ హెర్బల్ మూలికలు కొద్దిగా మంచి చేస్తే చేయవచ్చునేమోకాని ఎక్కువగా కీడు చేస్తాయని తెలియ జేశాడు
దక్షిణ భారత దేశం లో ఆయుర్వేద ,సిద్ధ ఔషధాలలో సోమలత వాడకం ఉన్నది దీని బొటానికల్ పేరు ‘’సార్కో స్టెమ్మా అసిడం’’ .ఋగ్వేద హోమాలోనే కాక ఇరాన్ దేశ హోమాలలో కూడా సోమలతను వాడారు .మనవాళ్ళు ‘’దేవతలకోసం దేవుడు ‘’అని సోమలతను అన్నారు .ఋగ్వేదం ‘’దేవుళ్ళను సృష్టి౦ చేదిసోమలత’’అన్నది .ఇంద్రునికి సోమలతకు అవినా భావ సంబంధం ఉన్నది .రాక్షసులపై యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారీ సోమ రసం పుచ్చుకొని వెళ్ళేవాడని మంచి ప్రేరకంగా పని చేస్తుందని ఉన్నది .తపస్సుకు ముఖ్యమని చెప్పబడింది .కాంతికీ సోమలతకు సంబంధం ఉన్నదని అందుకే కాంతి అధిదేవత ఇంద్రునికి అది ఇష్టమైనది అని ఋగ్వేదం లో ఉంది ..ఇక చలించి సోమమత్తులో నుంచి బయట పడదాం
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

