గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3
12 0- భూకైలాస నాటక కర్త -సాంబ దీక్షిత్ (19 34 )
19 34 ఫిబ్రవరి 14 న సాంబ దీక్షితులు కర్నాటక లోని గోకర్ణ క్షేత్రం లో జన్మించాడు .తండ్రి దామోదర దీక్షితులు .ఋగ్వేద ఘనాపాటి ,వ్యాకరణ విద్వాన్ .భాష్య కావ్య తీర్ధ ,హిందీ సాహిత్య విశారద .గోకర్ణ మేధా దక్షిణామూర్తి సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ గా మహర్షివేద యూని వర్సిటి వైస్ చాన్సలర్ గా ఉద్యోగం .బెంగుళూరు వేద ధర్మ పరిపాలన సభ ‘విద్యా వారిది’’,,గోకర్ణం విద్వత్ సభ ‘’వేద విద్వాన్ ‘’ బెంగుళూరు భారతీయ విద్యాభవన్ ‘’వేద రత్న ‘’పురస్కారాలు ఇచ్చాయి .
దీక్షితులు సంస్కృతం లో ‘’నిత్యానంద చరితం ‘’లఘు కావ్యం తోపాటు మూడు నాటకాలు -మహాగణపతి ప్రాదుర్భావం ,భూకైలాస శతకం ,వర దక్షిణనాటకం రాశాడు చివరిది సాంఘిక నాటకం ,అగ్ని సహస్రనామాలు అగ్ని రాజసూయం ,గృహ్యాగ్ని జార ,వాయుజ సహస్ర నామ స్తోత్రాలను తన సంపాదకత్వం లో ప్రచురించాడు .మహారాష్ట్రలోని స్వామి నిత్యానంద ఆశ్రమమహిమలను వివరించినదే ‘’నిత్యానంద చరితం ‘’.గోకర్ణ క్షేత్ర పురాణగాధ ఆధారంగా ‘’భూకైలాసం రాశాడు .సాంబ దీక్షితులు నిత్యాగ్ని హోత్రి .మహా వేద విద్వాంసుడు .
121-బసవ భాస్కరోదయ మహా కావ్య కర్త –పరాడ్డి మల్లికార్జున (19 40 )
పరాడ్డి మల్లికార్జున 19 40 లో కర్ణాటకలో సావడి లో పుట్టి ,సంస్కృతం లో ఏం ఏ పి హెచ్ డి చేసి దార్వార్ సంస్కృత యూని వర్సిటి ప్రొఫెసర్ అయ్యాడు .బసవ భాస్కరోదయం అనే మహా కావ్యం,గంగాధర ,చెన్న విలసదమొదలైన శతకాలు ,సంస్కృత కావ్యమాలిక ,సంస్కృత కావ్య మందాకినీ కావ్యాలు రాశాడు .కబీర్ కవితల్ని కబీర్ దా శతక గా అనువదించాడు .దీనికి సాహిత్య అకాడెమి అవార్డ్ పొందాడు .అక్కమహాదేవి ,బసవేశ్వర శతకాలు కన్నడం నుంచి సంస్కృతంలోకి మార్చినవి .మల్హనా స్తోత్రం చిత్రగ్రీవ విజయం ,జగద్గురు సిద్దేశ్వర చంపు లకు సంపాదకత్వం వహించాడు .విశ్వారాధ్య విశ్వ భారతీ పురస్కార గ్రహీత మల్లికార్జున .
బసవ భాస్కరోదయం 16 కాండల బసవని చరిత్ర కావ్యం.వైవిధ్య ఛందస్సులతో రాసీభూత రసానందం కలిగించాడు .గంగాధర శతక నాయకులు గంగాధర రాజ యోగీంద్రులు . 16 వ జనం దినం నాడు రాశాడు .స్వామీజీ బహుభాషా పాండిత్యాన్ని తెలియ జేశాడు .స్వామి నిర్మించిన సత్రాలు లైబ్రరీలు హాస్పిటల్స్ హాస్టల్స్ వివరాలన్నీ పేర్కొన్నాడు .మతసామరస్యానికి సంస్కృత వ్యాప్తికి స్వామీజీ చేసిన కృషి వివరించాడు .సంస్కృత కావ్య మందాకినీవివిధ అంశాలపై రాసిన 32 శ్లోకాల సమాహారం .’’విరలో మనీషా ‘’అనేది డా సర్వే పల్లి రాదా కృష్ణన్ మహోన్నత వ్యక్తిత్వాన్ని తెలియ బరచే ఘన నివాళి .శైవు డైన మల్లికార్జున పరాడ్డి గొప్ప కవి అనువాదకుడు ,పరిశోధకుడు ..ఆధునిక సంస్కృత మహా విద్వాంసుడు కవి’’ అభి రాజేంద్ర మిశ్ర ‘’మచ్చ రాదేయం సుకవి సుహ్రుదయం చ పి సౌమ్యం పరాడ్డిం’’అని ఘనంగా మల్లికార్జునుని కీర్తించాడు .
12 2 -ధర్మ శాస్త్ర విద్వాన్ -గణపతి పాథక్(19 41)
శంకర గణపతి పాధక్ 19 40 లో కర్ణాటకలో జన్మించాడు సాహిత్యం లో శిరోమణి ,ధర్మ శాస్త్రం లో విద్వాన్ .,సంస్కృతం లో ఏం ఏ .సంస్కృతం లో శ్రీ హరి హరేశ్వర సుప్రభాతం హర నర్తన ,వసంత తిలక ఛందస్సులో 38శ్లోకాలతో పాటు దండకం తో కావ్యం రాశాడు .కర్ణాటకలోని కారకాలలో ఉన్న హరిహర నాద దైవం పై రాసిన కావ్యమిది .మహా రాష్ట్ర నుంచి వచ్చి స్తిరపడిన చిత్పావన బ్రాహ్మాణుల గ్రామం ఇది వేదాధ్యయనానికి బాగా ప్రసిద్ధి .చిత్పావనుల ముఖ్యఆరాధ్య దైవం హరిహరనాధుడు .సుప్రభాతం లో స్వామి మహిమ ఈ క్షేత్ర మహిమ అంతా కళ్ళకు కట్టినట్లు ఉంటుంది .కవి దీనిని కన్నడం లోకి కూడా అనువదించాడు .
12 3 -తేజస్సంక్రమం కర్త -గురుపాద హెగ్డే (19 41)
గురుపాద హెగ్డే 19 41 లో మే 18 నజన్మించి ,సాగర్ లోని లాల్ బహదూర్ శాస్త్రి కాలేజిలో విద్యాబోధన చేశాడు .-సంస్కృతం లో ‘’తేజస్సంక్రమః ‘’అనే నాటకం ,ఆధ్యాత్మ సోత్ర మంత్రం భావ గీతం రాశాడు సంస్కృత సాహిత్య విమర్శగా ‘’శ్లేష సిద్దాన్తః ;;మరియు కన్నడ వాజ్మయ వికాసే సంస్క్రుతస్య ప్రభావః ‘’రచించాడు .కొన్ని గీతికావ్యాలు రాశాడు .కన్నడ రచనలూ చేశాడు .సంస్కృతం లో ‘’పన్ అండ్ శ్లేష ఇన్ సాంస్క్రిట్ ‘’రాశాడు .కర్నాటకరాస్త్ర పురస్కారం పొందాడు .తేజస్సంక్రమః ఏకాంకిక .రామ పరశురామ సంవాదం రేడియోలో ప్రసారమైంది అనేక చోట్ల ప్రదర్శింప బడింది భావగీతాలు హెగ్డే రాసిన భక్తీ గీతాలు .
సశేషం
మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -25-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

