గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3
13 4- లక్షణ శాస్త్ర కర్త -శకటాయణుడు(8 18 -8 6 7 )
కాశ్మీర్ కు చెందిన శకటాయణుడు ,నైరుక్త కర్త..వ్యాకరణ వేత్తలలో అతిప్రాచీనుడు.తరువాత వారైన యాస్కుడు ,పాణిని ఆయన రచనలను ఉదాహరించటం వలననే లోకానికి తెలియ బడ్డాడు .నామ వాచాకాలన్నీ క్రియా జన్యాలేనన్నాడు .దీనినే సంస్కృతం లో ‘’కృత్ ప్రత్యయం ‘’అన్నారు .దీనిపై ప్రముఖ వ్యాకరణ వేత్త బిమల్ కృష్ణ మాతీలాల్ ‘’నైరుక్తకారులకు అంటే ఎటిమాలజిస్ట్ లకు పాణినీయులకు అంటే వ్యాకరణ వేత్తలకు మధ్య గొప్ప చర్చ జరిగింది .ఎటిమాలజిస్ట్ లునామవచాకాలన్నీ కొన్ని క్రియల నుండి ఏర్పడ్డాయన్నారు .నిరుక్త కర్త యాస్కుడు దీనినే సమర్ధింఛి శకటాయనుణుడిని.సమర్ధించి ఉదాహరించాడు .దీనివలమ పదాలన్నీ అత్యంత సూక్ష్మ రూపంలోకి అంటే దాతు రూపం లోకి విభజించటానికి వీలు కలిగింది .దీనికే ధాతు-ప్రత్యయ వ్యవస్థ అనే పేరు కలిగింది .గార్గ్యుడు శకటాయణుడి అభిప్రాయాన్ని వ్యతిరేకిన్చాడని యాస్కుడు తెలియ జేశాడు .యాస్కుడు అన్నినామవాచకాలుధాతువులనుంచే రావాలనే నియమం లేదు అన్నాడు ‘’అని తెలియ బరచాడు .విభక్తి ప్రత్యయాలకు ప్రత్యేక అర్ధం ఉండదని , శకతాయణుడు అంటే అవి నామవాచకం లేక క్రియ లు చెప్పే దాన్ని సమర్దిస్తాయని గార్గ్యుడు అన్నాడు .ఇలా ప్రాచీనకాలం లో మీమా౦స కులకు వ్యాకరణ కారులకు సుదీర్ఘ చర్చలు జరిగాయి ..శకటాయనుని రచనను ‘’లక్షణ శాస్త్రం ‘’అంటారు .ప్రాణమున్న ,ప్రాణం లేని వాటి లింగాలను తెలుసుకోవటానికి ఇది సహకరిస్తుంది .ఇతను క్రీ శ.818 లో జన్మించి 867 లో మరణించాడు. ఈ శకటాయణుడు యాస్క ,పాణిని లకు ముందు ఇనుప యుగం లోని వాడు
క్రీ .శ 9 వ శతాబ్దం లో మరొక వ్యాకరణ కర్త శకటా యణుడు అమోఘ వర్షుని కాలం లో ఉన్నాడని తెలుస్తోంది
135- బృహద్దేశి సంస్కృత సంగీత కర్త -మతంగ ముని (6 వ శతాబ్దం )
భారతీయ సాంప్రదాయ సంగీతం పై ‘’బృహద్దేశి’’గ్రంధం రాసిన మతంగ ముని కాలం క్రీ శ 6 -8 శాతాబ్దిమధ్య .సంగీత రాగాలపై వచ్చిన మొట్టమొదటి గ్రంధం బృహద్దేశి.ఇందులో మార్గ దేశి రాగాల వివరణ ఉన్నది సర్గం నోటేషన్ ల వివరణ కూడా ఉంది .తన రచనలో భరతముని నాట్య శాస్త్రాన్ని మతంగముని చాలా సార్లు పేర్కొన్నాడు .సంగీత ప్రమాణాలు -మ్యూజికల్ స్కేల్స్ ,శృతి లపై విస్తృతంగా చర్చించాడు .బృహద్దేషి ప్రేమలతా శర్మ సంపాదకత్వం లో వెలువడింది .తెలుగులో కూడా శ్రీ ద్వారం భావనారాయణ వ్యాఖ్యానం రాసి 20 02 లో ప్రచురించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

