కొందరు హిమాలయ యోగిపు౦గవులు -1
యువ రాజ స్వామి భావల్ సన్యాసి
ఈయన జీవితం ఒక వింతకధ .బెంగాల్ లో భావల్ ప్రాంత రాజు భావల్ సన్యాసి .పెళ్లి అయ్యాక అందమైన భార్యతో డార్జిలింగ్ లో హాయిగా గడుపుతున్నాడు .భార్య ఒక డాక్టర్ కు దగ్గరై౦ది .ఈ ఇద్దరూ కలిసి భావల్ ను చంపే ప్రయత్నం లో రోజూ రాజుకు కొద్దిమోతాదు లో నాగుపాము విషాన్ని ఇంజెక్షన్ గా ఇవ్వటం ప్రారంభించారు .రాజు ఎందుకు అని అడిగితె అది బలానికిచ్చే ఇంకేక్షన్ అని నమ్మకంగా చెప్పేవారు .క్రమంగా డాక్టర్ డోసు పెంచాడు .రెండు నెలలతర్వాత రాజు అపస్మారకం గా ఉంటె చనిపోయాడని డాక్టర్ ప్రకటించి అంత్యక్రియలకు హిమాలయ పర్వత ప్రాంత సెల యేరు దగ్గర ఏర్పాటు చేశారు .చితి అంటించారు .భూమి ఆకాశం బద్దలయ్యేట్లు విపరీతంగా ఆగకుండా వర్షం కురిసి చితి ఆరి పోయి రాజు శరీర౦ ప్రవాహం లో కొట్టుకు పోయింది .
మూడు మైళ్ళు కిందకు కొట్టుకు పోయి స్వామి రామా గురువు ఆశ్రమం దగ్గరకు కాంచన గంగ నుంచి కుమయూన్ హిమాలయాలదాకా కొట్టుకు వచ్చి చేరింది. ఆయన తాళ్ళతో బంధింపబడిన శవాన్ని చూసి ఆ వ్యక్తీ మరణించలేదని అపస్మారకం లో ఉన్నాడని ,మామూలు శ్వాస నాడి కొట్టుకోవటం లేదని గ్రహించి శిష్యులను తాళ్ళు కోసేయమని అతడు తన శిష్యుడు అని చెప్పి పంపాడు . వాళ్ళు వెళ్లి అలానే చేసి ,రాజును గుహలోకి తీసుకువచ్చారు .కొద్ది రోజులకు రాజు మామూలు స్థితి లోకి వచ్చాడుకాని గత౦ ఏమాత్రం గుర్తులేదు . గురువుగారి శిష్యుడయ్యాడు .అయన సన్యాస దీక్ష నిచ్చాడు .గురువు వద్ద ఏడేళ్ళు గడిపాడు ..తరువాత గురువు ఆయనను పుణ్య క్షేత్రాలు దర్శించమని , ,యోగులను కలుసుకోమని చెప్పి పంపాడు . ,బాస్వాల్ సన్యాసి తప్పక తన అక్కగారి ఊరు వెడతాడని అక్కడ గతం జ్ఞాపకం వస్తుందని ముందే ఊహించి తనకు ఇక్కడ తపోభంగం జరుగుతోందని ఇంకా కొంచెం పైకి వెళ్లి అక్కడ ఉంటానని చెప్పి పంపాడు .
బాస్వాల్ సన్యాసి అనేక ప్రదేశాలు తిరిగి తిరిగి గురువు ఊహించినట్లే ఒక రోజు అక్కగారి ఊరు చేరి అక్క ఇంటికి భిక్షకు వెళ్ళాడు .ఆమె తమ్ముడిని గుర్తించి ఆహ్వానించింది ఆరు గంటలు ఆయనతో అక్క మాట్లాడిన తర్వాత కాని ఆయనకు గత స్మృతులు జ్ఞాపకం రాలేదు .అక్కడి బంధు మిత్రుల ప్రోద్బలంతో తానే రాజ్యానికి వారసుడినని కోర్టులో కేసు వేశాడు సాక్ష్యాధారాలన్నీ రాజు పక్షం లో బలం గా ఉండటం చేత తనకు విషం ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్ విషాన్ని బొంబాయి లాబ రేటరి లో కొన్నట్లు రుజువు అవటం వలన ,తనను భార్య ఆమె ప్రేమికుడైన డాక్టర్ ఎలా నయ వంచన తో మోసగించిందీ హిమాలయ స్వామి ఏ విధంగా ఆదుకున్నదీ ఆయన శిష్యుడుగా ఉన్న విషయం పూస గుచ్చి నట్లు తెలియ జేయటం వలన కేసు గెలిచి సంస్థానం డబ్బు సంపదా అన్నీ దక్కాయి .గురువు కోర్టుకు రాలేదుకాని శిష్యులను పంపాడు సాక్ష్యాలకోసం .కేసు ఎన్నో ఏళ్ళు నడిచింది . కేసు గెలిచి రాజ్యం సంపదా దక్కిన ఏడాదికి భాస్వాల్ సన్యాసి మరణిం చాడు ఈ కేసుతో గురు స్వామి విషయం ప్రపంచ మంతా తెలిసిపోయింది .ఈ గురువును వెదుక్కుంటూ అనేక ప్రదేశాలనుండి సాధకులు వెళ్లి శిష్యులయ్యారు గురువు ఎందుకు జనావాసాలకు దూరం గా ఉంటున్నారో అర్ధం చేసుకున్నారు .
2-ఆప్త మంత్రోపదేశికుడు -వాలా బాబా
ఒక్క గోచీ తప్ప ఏ రకమైన ఆచ్చాదన లేకుండా కాళ్ళకు పాద రక్షణ లేకుండా యెంత దూరమైనా నడిచే జడలు విపరీతంగా పెరిగి భూమిని ఆనుకోనేట్లు ఉన్న వాలా బాబా వద్ద ఆప్త మంత్రాన్ని నేర్చుకోమని స్వామి రామ గురువు పంపాడు .రామా కొన్ని రోజులు ఆయన గుహలో ఉన్నాడు ఒక రోజు వాలాబాబా ఒక చెట్టు ఎక్కి అక్కడ ఉన్న పెద్ద తేనెటీగ తుట్టె దగ్గరకు వెడుతుంటే వద్దని స్వామి రామా ఆపాడు .వినకుండా తేనే తుట్టె దగ్గరకు చేరి తెనేటీగలతో నోటితో ఏదో మాట్లాడాడు .అంతే.అవి చెదర లేదు బెదరలేదు ఆయన్ని ఏమీ చేయలేదు .రామాను కూడా తేనెతుట్ట దగ్గరకు వెళ్ళమన్నాడు మంత్రం చెబితే వెడతానన్నాడు రామా చెట్టు ఎక్కాక చెబుతానన్నాడు వాలా .అలాగే చేయగా అప్పుడు తీనేటీగలతో ‘’నేను ఇక్కడ మీతో ఉన్నాను మీకు హాని చేయను .నాకు హాని చేయద్దు ‘’అని చెప్పమన్నాడు అది మంత్రం కాదుగా అన్నాడు రామా .వాటికీ నీ భాష అర్ధమవుతుంది చెప్పినట్లు చేయమన్నాడువాలా .కాని ఏమి చేయలేక అలానే చేశాడు .అవి రామా జోలికి రాలేదు .చెట్టు దిగగానే ‘’ఇది నీకు మాత్రమె పనికొస్తుంది ఇంకా ఎవరికీ చెప్పద్దు ‘’అని హెచ్చరించాడు వాలాబాబా .చాలా సార్లు స్వామి రామా అలానే చేసి తేనే సేకరించేవాడు .ఒక సారి పంజాబ్ లో ఉండగా ఒక కంసాలి మంత్రం చెప్పమని ప్రాధేయపడితే వాలా బాబా చెప్పింది మరిచి వాడికి చెప్పాడు .వాడు తేనే తుట్టె దగ్గర ఈయన చెప్పినట్లే చెబితే ఆ మంత్రం పారక వందలాది తేనెటీగలు కుట్టి బాధిస్తే హాస్పిటల్ లో చేరిస్తే కోమాలో మూడు రోజులు ఉండిపోయాడు విశ్వ బ్రాహ్మణుడు
..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

