వీక్లీ అమెరికా -21(14-8-17 నుండి 20-8-17 వరకు )
భజనవారం
14-8-17 -సోమవారం -”-సంసారం లో రిగమనిస”సరదా హాస్య ఆర్టికల్ రాశా .నాని నటించి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం తో వచ్చిన ”జెంటిల్మన్ ”సినిమా ”గొట్టం ”లో చూశా .మంచి సస్పెన్స్ తో నాని నటనా వైదుష్యంతో చక్కని హమ్మింగ్ పాటలతో కొడైకెనాల్ బాక్ డ్రాప్ గా సినిమా కనుల పండువుగా ఉంది ..
15-8-17 మంగళవారం -శ్రీ కృష్ణాష్టమి –
ఉదయమే మా శ్రీమతి ముగ్గుతో వాకిలి నుంచి ఇంట్లోకి బాల కృష్ణుని పాదాలు వేసి కన్నయ్యకు ఆహ్వానం పలికింది .నేను మా మూలు సంధ్యావందనం చేసి తర్వాత మంగళవారం కనుక శ్రీ సువర్చలా సహిత ఆంజనేయ స్వామి అష్టోత్తర సహస్ర నామ పూజ ,కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణా అష్టోత్తర ,విష్ణు సహస్ర నామ పూజ చేశా .కృష్ణాష్టమి సందర్భంగా వైష్ణవాలయాలలో ప్రసాదంగా పెట్టె ”కట్టెకారం ”మా ఆవిడ చేయగా దానితోపాటు అటుకులు బెల్లం పాలు పెరుగు నెయ్యి వెన్న పండ్లతో సహా నైవేద్యం పెట్టాము . తర్వాత కృష్ణలీలలు శ్రీకృష్ణ కర్ణామృతం జయదేవుని అష్టపదులు జానకి పాడిన కస్తూరిరంగా పాటలూ సుబ్బులక్ష్మి విష్ణు సహస్రనామ స్తోత్రం సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు మాడుగులచదివిన పోతన భాగవత0 వగైరా వింటూ సాయంకాలం దాకా కాలక్షేపం చేశాను
సాయం భజన
సాయంకాలం7 గంటలకు మా అమ్మాయి ఇంట్లో సాయి సెంటర్ వాళ్ళను ఆహ్వానించి భజన ఏర్పాటు చేసింది .శ్రీమతి గోసుకోండ అరుణ ఇంట్లోని పెద్ద శ్రీ కృష్ణ విగ్రహాన్ని వాళ్ళఅబ్బాయి తెచ్చాడు .దాన్నీ అలంకరించి సిద్ధం గా ఉన్నాం .దేవుళ్ళ అలంకారం మా అమ్మాయి బాగా చేసింది . ఇంట్లో ఉన్న డబుల్ స్పీఎకర్ లతో నాలుగు మైకుల ఏర్పాటు మా మనవళ్లు శ్రీకేత్ అశుతోష్ పీయూష్ లు సిద్ధం చేశారు . అకస్మాత్తుగా సాయ0కాలం 6-30 నుంచి పెద్ద వర్షం పడింది .అప్పటికే సాయి సెంటర్ హెడ్ సుబ్బు వచ్చేశారు . మిగిలినవాళ్లు వస్తారా రాగలరా అను కొంటుంటే ఉరుములు మెరుపులు వచ్చి వర్షం అంతే సడన్ గా 6-50 కి ఆగిపోయింది . హమ్మయ్య అనుకొన్నాం .సరిగ్గా 6-55 కు సాయి సెంటర్ నిర్వాహకురాలు శ్రీమతి జయ రాగా ఖచ్చితంగా 7 గంటలకు సుబ్బు జయ మా అమ్మాయి విజ్జి భజన ప్రారంభించారు .. ఆ తర్వాత అందరూ వచ్చేశారు దాదాపు 75 మంది .అందరూ ఏకకంఠంగా భజనలు చేశారు శ్రీ కృష్ణ భజనలు ఎక్కువగా చేశారు చిన్నపిల్లలూ చాలా శ్రావ్యంగా పాడారు మంచి నిండుదనం వచ్చింది .ఖచ్చితంగా రాత్రి 8 గంటలకు భజన ఆపేశారు . తర్వాత జయ రెండు నిమిషాలు మాట్లాడాక మా అమ్మాయి నన్ను మాట్లాడమంటే కృష్ణాష్టమి ,భారత స్వాతంత్య్ర దినోత్సవ ప్రాధాన్యం పై 9 నిమిషాలు మాట్లాడాను .అందరూ తెలుగు తెలియని తమిళ కన్నడిగులు కూడా బాగుందని అన్నారు . ఇంకా ఒకఅరగంట మాట్లాడితే బాగుండు నన్నారు. అది సమయం కాదు అంతా” ఫుడ్ కోర్ట్ లో చేతికీ మూతికీ బాటింగ్ హడావిడి ”లో ఉన్నారన్నాను .కాదు భోజనాలయ్యాక మాట్లాడాలి అన్నారు సరే అన్నా. భోజనం లో పూరీ ,బంగాళాదుంపకూర ,మామూలు ఇడ్లీ రాగి రవ్వ ఇడ్లీ ,సాంబారు గోంగూర పచ్చడి ,అటుకులపులిహోర ,చట్నీ జున్ను ,ఫ్రూట్ సలాడ్ ,ఫ్రూట్ జ్యుస్ ,అన్నం ,పెరుగు ,పెరుగన్నం పుచ్చకాయ ముక్కలు చక్రపొంగలి , వగైరాలతో కమ్మని భోజనం .
భోజనాలు అయ్యాక ఒక పది మంది నేను మాట్లాడాలని కోరగా హాలులో కూర్చునిరాత్రి 9-30కు మొదలుపెట్టి సుమారు 20 నిమిషాలు బ్రహ్మ వైవర్త పురాణం లోని గోలోకం విశేషాల ,మరికొన్ని విషయాలు మాట్లాడాను చాలా శ్రద్ధగా విన్నారు మా అమ్మాయి రాధ లక్ష్మి ,ఉషా ,సురేఖా నీలిమ , పవన్ ,,రాంకీ అవధాని జగదీశ్ మొదలైనవారు . అభి రుచి ఉన్నవారికి నాకు తెలిసినవి నాలుగు ముక్కలు చెప్పటం లో నాకు ఆనందం అలాగే అందరూ ఆనందాన్ని సంతృప్తిని పొందారు .రాంకీ ఉషా విజ్జి వీడియో తీసి లైవ్ గా మా వాళ్లకు పంపారు .అంతా అయ్యేసరికి రాత్రి 10 అయింది .అప్పుడు ఇళ్లకు బయల్దేరి వెళ్లారు . మంచికార్యక్రమం అనుకోకుండా జరిగింది . వర్షం హర్షం ఆనందం పంచింది .
బుధవారం -నిన్నటి విశేషాలన్నీ ”కృష్ణం వందే జగద్గురుమ్”గా రాశాను . రాజ్ తరుణ్ సినిమా ”ఉయ్యాల ;జంపాల ”యు ట్యూబ్ లో చూశా .కొత్తకుర్రాడు చాలా ఫ్రెష్ గా ఈజీగా చేశాడు అనిపించింది చక్కని గోదావరి పల్లెటూరు కూనవరం బాక్ గ్రౌండ్ గా తీసిన చిత్రం ప్రకృతి అందాలన్నీ ఒడిసిపట్టి చూపించాడు . దర్శకుడు .సంగీతం వీనులవిందు ఫోటోగ్రఫీ నయనానందకరం ..
17-8-17 గురువారం -మా అన్నయ్యగారి మనవడు చి కళ్యాణ్ ఛిసౌ మీనా ల వివాహం ఈ రోజు ఉయ్యూరులో ఉదయం 9 గంటలకు జరిగింది . మా బంధువులందరూ వచ్చారట .గ్రాండ్ గా జరిగిందని రమణ ఫోన్ చేసి చెప్పాడు . .మా మేనల్లుడు అశోక్ ,మేనకోడలు పద్మ మా అబ్బాయి శాస్త్రి ,మనవడు భువన్ తమ్ముడు మోహన్ భార్య సునీత మా అన్నయ్య మనవడు రవి ,హైదరాబాద్ నుంచి ,మా పెద్ద మేనకోడలు కళ , భర్త చంద్రశేఖర్ ,కొడుకు బాలాజీ ,మేనల్లుడు శ్రీనివాస్ ద0పతులు చెన్నై నుంచి, గరివిడినుంచి మా అన్నయ్య కూతురు వేదవల్లి భర్త రామకృష్ణ మొదలైన బంధుగణం హాజరై దగ్గరుండి వివాహం జరిపించారు .
శుక్రవారం -”ట్యూబ్ లో శాతకర్ణి హిందీ సినిమా చూసి ఆనందించా .
శనివారం -త్రిపురనేని గోపీ చ0ద్ దర్శకత్వం లో ఘంటసాల సంగీతం తో ,కృష్ణవేణీ నారాయణరావు నాయికా నాయకులుగా శోభనాచల వారి శ్రీ లక్ష్మమ్మ చూశాము గోపీచంద్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే నీట్ గా ఉన్నాయి . . తర్వాత కృష్ణవేణి గారి ఇంటర్వ్యూ కూడా చూశాను . ఎందరెందరినో చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత కృష్ణవేణీ భర్త మీర్జాపురం రాజా వారిది .నూజివీడు రైల్వే స్టేషన్ పేరు మీర్జాపురంఅని ఉండేది చాలాకాలం .
గీర్వాణం -3 లో 415 వరకు రాశా .
మా అమ్మాయి తో సహా ఇక్కడి సాయి సెంటర్ వాళ్ళు గ్రీన్స్ బరో లో నిర్వహించిన ఒక రోజు వాలంటరి టీచర్స్ ప్రోగ్రామ్ కు ఉదయం 5-30 కి బయల్దేరివెళ్లి రా త్రి 7-30 కు వచ్చారు .
మా మనవళ్ళు ఆశుతోష్ ,పీయూష్ లు నెల రోజుల టెన్నిస్ కోచింగ్ పూర్తి అయిన సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేసిన కాంప్ కు ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చారు మా పెద్దమనవడు శ్రీకేత్ శని ,ఆదివారాలలో ఉదయం మాథ్స్ ఇంటెన్సివ్ కోచింగ్ కు వెళ్లి ,ఆ తర్వాత వై ఏం సి లో ఆడుకొని వస్తున్నాడు .ఇక్కడి స్కూళ్ళు ఈ నెల 28 నుంచి ప్రారంభం మళ్ళీ హడావిడి . .
20-8-17 ఆదివారం -గీర్వాణం -3 లో 418 వరకు కవులగురించి ఇవాళరాశాను
ఈ వీక్లీ ఇంతటితో సమాప్తం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా