యెడ్డీ నడ్డి విరిచిన సుప్రీం
దారులన్నీ మూసుకు పోయాయి .అనుక్షణం ప్రపంచమంతా ప్రజలు వీక్షించే ఏర్పాటు . కొనుబడి బయట పడే టేపుల లీకులు . కమలం ఆకర్షణకులోనుకాము , ససేమిరా రాము అన్న కాంగీ ,జెడి ఎస్ ల గట్టి నిర్ణయం .ఇప్పటికే పరువు కావేరిలో కలిసిపోయింది ఇక చాప చుట్టుకుని బయటపడమని మాంత్రిక ద్వయం చివరి ఆదేశం తో గత్యంతరం లేక బల పరీక్ష కు సిద్ధంకాకుండా యెడ్డీ మూడు రోజులకే చాప చుట్టేసి రాజీనామా చేసేశాడు .హత విధీ మోడీ, షా ల పరువు అరేబియా సముద్రం లోకి నెట్టి వేయబడిన చారిత్రాత్మక సంఘటన ,దీనికి కాంగీ ,జెడి ఎస్ ల గట్టి పట్టు ను అభినందించాలి . తగిన సమయంలో సుప్రీం ను ఆశ్రయించి ప్రజాస్వామ్యాన్ని రక్షించగలిగించగలిగారు .హాట్స్ ఆఫ్ .
ఇలాంటి సంఘటన ఆనాడు ప్రధాని వాజ్ పాయికి ఎదురైతే అక్రమంగా ఒక్క సీటుకూడా కొననని చెప్పి రాజీ నామా చేశాడు .అలాంటి ఆదర్శాలతో వర్ధిల్లిన పార్టీ నేడు నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని, నైతిక విలువలను తుంగలో తొక్కి గెలుపే ధ్యేయం గా నడిచిన తీరుకు నేటి కర్ణాటక నాటకం చెంప పెట్టు …
మరో సంఘటన కూడా గుర్తుకొస్తోంది .చౌదరి చరణ్ సింగ్ ప్రధానిగా నియమింపబడి కొన్ని రోజులు మాత్రమే ఉండి మెజార్టీ లేక పార్లమెంట్ గుమ్మం తొక్కకుండానే రాజీనామా చేయాల్సి వచ్చింది ..వాపు బలుపు కాదు అని అందరూ గుర్తించాలి .
సరే ఇప్పుడు మళ్ళీ గవర్నర్ కోర్ట్ లో ప్రజాస్వామ్యం అనే బంతి ఉంది .దాన్ని ఆయన ఎలా ఆడి ,ఏం చేస్తాడో చూడాలి .. అడ్డదారులు తొక్కి దక్షిణా పదం లో చొచ్చుకు రావటానికి చేసిన ప్రయత్నం బి జెపి కి కర్ణాటక గట్టి ఎదురు దెబ్బె కొట్టింది . అయితే కాంగీ ,జె డి ఎస్ ల బంధం శాశ్వతంగా నిలుస్తుందా ,కమలాన్ని నివారించగలుగుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కాలమే తేల్చాలి .రాష్ట్రాల ఆత్మ గౌరవాలతో ఆడుకుంటే ఇలాంటి ఎదురు దెబ్బలే మున్ముందు తగుల్తాయి అని పాలకులు గ్రహించాలి సంఘటన లనుంచి గుణ పాఠం నేతలు నేర్చుకోకపోతే భవిష్యత్తుకు వారు యేమని మార్గ నిర్దేశం చేయగలుగుతారు ?కలిసి పని చేస్తే ఎంతటి బలగాన్నైనా ఎదిరించి ఓడించ వచ్చునన్న ప్రాచీన నీతి ఎవరూ మరువ రాదు -మీ చావు మీరు చావండి రాజకీయ నాయకుల్లారా ,ప్రజాస్వామ్యం తో ఆడుకోకండి. నీతి నియమాలను అపహాస్యం చేయకండి ప్లీజ్ -దుర్గా ప్రసాద్

