మనకు తెలియని శ్రీ కృష్ణ సంతాన లీలలు
—
శ్రీ కృష్ణుడికి పదహారు వేల ఎనిమిది మంది భార్యలున్నారని లోకం లో ప్రచారంగా ఉంది.వీరిలో అసలు భార్యలు ఎంతమంది?వాళ్ళే అష్టభార్యలు –రుక్మిణి ,సత్యభామ ,జాంబవతి ,కాళింది ,మిత్రవింద ,నాగ్నజితి ,భద్ర ,లక్ష్మణ అని భాగవత పురాణం పేర్కొన్నది .మరి వీరి సంతానం సంగతేమిటి ?ఈ ఎనిమిది మందికి 80 మంది కొడుకులనుకన్నాడు కన్నయ్య .అందులో
1-రుక్మిణీ-కృష్ణు ల కుమారులు 10 మంది.-1-ప్రద్యుమ్న 2-చారు దేష్ణ 3-సుధేష్ణ 4-చారు దేహ 5-సుచరు 6-చారు గుప్త 7-భద్ర చారు 8-చారు చంద్ర 9-విచారు 10-చారు .
2- సత్యవతీ –కృష్ణుల కొడుకులు 10 మంది -1-భాను 2- సుభాను 3-స్వభాను 4-ప్రభాను 5-భానుమాన్ 6-చంద్రభాను 7-బృహద్భాను 8-అతిభాను 9-శ్రీభాను 10-ప్రతిభాను .
3-జాంబవతీ –కృష్ణుల పుత్రులు 10- మంది -1-సాంబ 2-సుమిత్ర 3-పురుజిత్ 4-శత్రజిత్ 5-సహస్ర జిత్ 6-విజయ 7-చిత్రకేతు 8-వసుమాన్ 9-ద్రవిణ్ 10-కృతు .
4-నాగ్నజిత్ –కృష్ణుల మగసంతానం – 10 మంది- 1- వీర 2- చంద్ర 3-అశ్వసేన 4- చిత్రగు 5-వేగవాన్ 6-వృష 7-ఆమ్ 8-శంకు 9-వాసు 10-కుంతి
5-కాళిందీ-కృష్ణుల కుమారులు 10 మంది -1-శ్రుత్ 2-కవి 3-వృష 4-వీర 5-సుబాహు 6-భద్ర 7-శాంతి 8-దర్ష 9-పూర్ణమస్10-సోమక్ .
6-లక్ష్మణ –కృష్ణుల కొడుకులు -10 మంది -1-ప్రబోధ 2-గాత్రవాన్ 3-సింహ 4- బల 5-ప్రబల 6-ఊర్ధ్వగ 7-మహా శక్తి 8-సహ 9-ఓజ 10-అపరాజిత్ .
7-మిత్రవింద –కృష్ణుల పురుష సంతానం 10 మంది -1-వృక్ 2-హర్ష 3-అనిల 4- దృఢ 5-వర్ధన 6-అన్నాద 7-మహష్ 8-పావన్ 9-వహ్ని 10-క్షుధి.
8-భద్ర –కృష్ణుల సంతానం 10 మంది-1-సంగ్రామజిత్ 2-బృహత్సేన 3-శూర 4-ప్రహరణ 5-అరిజిత్ 6-జయ 7-సుభద్ర 8-వామ 9-ఆయు 10-సాత్యకి .
అస్టభార్యలకు సమాన సంఖ్య లోనే పుత్రులను ప్రసాదించాడు పరమాత్మ శ్రీ కృష్ణుడు .
వీరిలో అందరూ తండ్రికున్న పేరు,ప్రఖ్యాతులున్న వాళ్ళు కాక పోవటం విచిత్రం .జాంబవతి కుమారుడు సాంబుడికిమాత్రం ఒక ప్రత్యేకత ఉన్నది .మహాభారతం లో చిన్నపాత్ర పోషించటమే కాక ,చివరలో యాదవ వంశ వినాశనానికీ కారకుడయ్యాడు .సాంబుడు ముమ్మూర్తులా తండ్రి శ్రీకృష్ణుని పోలి ఉంటాడని అందరూ అంటున్నా ,కృష్ణుడు మాత్రం సాంబుడు అన్ని విధాలా తన ఆరాధ్యదైవం పరమేశ్వరుడైన సాంబ శివుని పోలి ఉంటాడని భావించాడు .
ఆధారం –పల్లవీ ఠాకూర్ రచన –‘’ది అన్ నొన్ అండ్ అన్ టోల్డ్ స్టోరీస్ ఆఫ్ కృష్ణాస్ సన్స్ ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-9-18 –ఉయ్యూరు


సమాచాదం
On Sun, Sep 16, 2018 at 9:28 PM సరసభారతి ఉయ్యూరు wrote:
> gdurgaprasad posted: “మనకు తెలియని శ్రీ కృష్ణ సంతాన లీలలు — శ్రీ
> కృష్ణుడికి పదహారు వేల ఎనిమిది మంది భార్యలున్నారని లోకం లో ప్రచారంగా
> ఉంది.వీరిలో అసలు భార్యలు ఎంతమంది?వాళ్ళే అష్టభార్యలు –రుక్మిణి ,సత్యభామ
> ,జాంబవతి ,కాళింది ,మిత్రవింద ,నాగ్నజితి ,భద్ర ,లక్ష్మణ అని భాగవత ప”
>
LikeLike