కేరళ ఏకోపాధ్యాయిని –ఉషాకుమారి
ఉషాకుమారి దిన చర్య ఉదయం 7 గంటలకే కేరళ తిరువనంతపురానికి దక్షిణాణ ఉన్న.’’ అ౦బూరి ‘’గ్రామం ఇంకా నిద్ర మత్తులో ఉండగానే ప్రారంభమౌతుంది .ఆమె అగస్త్యవనం పరిధిలోని ‘’కున్న తుమల ‘’అగస్త్య ఏకోపాధ్యాయ పాఠశాల టీచర్ .రోజూ రెండుగంటలు కొండ దారిలో అరణ్యం లో నడుచుకుంటూ బడికి చేరుకోవాలి. ఇక్కడ’’ కాని జాతి సెటిల్ మెంట్ ‘’వాళ్ళకోసం ఏర్పాటు చేసిన స్కూల్ ఇది .బడి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు పని చేస్తుంది .మళ్ళీ ఆకొండా, కోనా దాటుకుంటూ నడిచి కొంపకు చేరాలి .ఇలా 16 ఏళ్ళనుంచి ఆమె ఉపాధ్యాయ జీవితం సాగిపోతోంది .
1997 లో జిల్లా ప్రాధమిక విద్యా ప్రోగ్రాం లో ఉషాకుమారి వాలంటీర్ గా ఈ సెటిల్ మెంట్ కు వచ్చింది .కేరళప్రభుత్వం 1990 లో ఇలాంటి విద్యా ఉపక్రమ (ఇనిషియేటివ్ )కార్యక్రమాన్ని ప్రారంభించింది . స్కూల్ మానేసిన విద్యార్ధుల జాబితా సేకరించి, వాళ్ళను మళ్ళీ బడిలో చేర్పించటం ఆమె బాధ్యత.వాళ్ల మనసులను ఆకర్షించి ఇపుడా టీచర్ వాళ్ళల్లో ఒకరైపోయింది .2000 సంవత్సరం లో ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఏర్పడే దాకా ఇక్కడ చదువంతా రాళ్ళమీద ,చెట్ల నీడలలోనే సాగింది .వర్షం వచ్చినా ,ఆమెకు ఒంట్లో బాగుండకపోయినా బడినుంచి మళ్ళీ నడిచి అంతదూరం వెళ్ళలేక ఆ గిరిజనాలతోనే ఉండిపోతుంది .ఆమె కృషి ఫలించి ప్రస్తుతం 40 కుటుంబాలు తమ పిల్లలను బడికి పంపిస్తున్నారు .ఆడపిల్లలు బడిలో చదువుకొంటూ వ్యవసాయ పనులూ చేసుకొంటున్నారు ..
ప్రస్తుతం కేరళ ప్రభుత్వం ఉషాకుమారిలాంటి ఒంటరి టీచర్ లను సాధారణ దిగువ ప్రైమరీ స్కూళ్ళకు మార్చే ప్రయత్నం లో ఉంది .ప్రస్తుతం అడవి అంతటినీ మెషిన్ లు చదును చేసి దారిమార్గం ఏర్పాటు చేసేపనులు చురుకుగా సాగుతున్నాయి .ఆమె కస్టాలు కొద్దిరోజుల్లో తీరిపోగలవు .అయితే ఆమె క్వాలిఫైడ్ టీచర్ కాకపోవటం వలన ఉద్యోగం ఊడే అవకాశం ఉంది .దిగువ ప్రైమరీ టీచర్ గా వేస్తే కొంత ఉపశమనం .’’ఈ మన్య ప్రాంతం లో ప్రజలు జబ్బులోస్తే సరైన అత్యవసర వైద్య సౌకర్యం అందకచనిపోతున్నారు .ఇక్కడ రోడ్ల నిర్మాణం తక్షణమే జరగాలి .నా ఉద్యోగం ఉన్నా ఊడినా ఇబ్బంది లేదు ‘’అంటుంది సిన్సియర్ టీచర్ ఉషాకుమారి .ఆమెకు మంచి జరగాలని ఆశిద్దాం .
ఆధారం -23-9-18 ది హిందులో -తులసికక్కర్ వ్యాసం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -23-9-18 -ఉయ్యూరు
—

