గౌతమీ మాహాత్మ్యం-2
మూడవ అధ్యాయం -శివ పార్వతీ కళ్యాణ వైభోగం
అనేకరకాలైన రాత్నాలచే వివిధ రంగులు కలిగి ,బహు పక్షి ,వృక్ష ,లతా వ్యాప్తమైన హిమవత్పర్వత౦ నదీ నద సరః ,కూప ,తటాకాదులచేత ,దేవ గ౦ధర్వ యక్ష కిన్నర సిద్ధ చారణ సమూహాలతో ,సహజ పరిశుద్ధవాయువుతో , ఆనందానికి కారణాలైన మేరు మందార,మైనాకాది పర్వతాలతో కూడి ,వసిష్ట ,అగస్త్య పౌలస్త్య ,లోమశాదిమునులచే కూడిన ఆనంద ఉత్సాహాలమధ్య పార్వతీ పరమేశ్వరుల వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది .,వజ్రమాణిక్య వైడూర్యాదులతో కూడిన స్తంభాలపైఉన్న సువర్ణ రత్నమయ వేదిక పై,జయా ,లక్ష్మీ ,శుభా ,కాంతీ కీర్తి ,పుష్టి మొదలైన దేవతలు,మేరు ,మందార ,కైలాస రైవతాది పర్వతాలు , పరివేష్టితులై ఉండగా లోకనాధుడు విష్ణువు చే పూజితుడై ,హిరణ్మయుడైనమైనాకుడనే పర్వతశ్రేస్టంప్రకాశామానంగా కనిపించింది .లోకపాలకులు మహర్షులు ,మరుద్గణాలతో ఆదిత్యుడుకళ్యాణ వేదికను సిద్ధం చేశారు .దేవ శిల్పి విశ్వకర్మ తోరణాల వేదిక తీర్చి దిద్దాడు.సముద్రాలు నదులు,పర్వతాలు ,ఓషధులు ,లోకమాతలు ,వనస్పతులతో ఉన్న బీజాలు అంటే సకల చరాచర ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తూ ఉండగా లోకమాత పార్వతీదేవి వివాహం పరమేశ్వరునితో జరిగింది .ఈవివాహ వేడుకలో ఇలాదేవి ఊడవటం అలకటం ముగ్గులు పెట్టటం చేస్తే ,ఓషధులు వంట సామాను సిద్ధం చేస్తే ,వరుణుడు నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తే ,,కుబేరుడు దక్షణ ,దానాదులు నిర్వహించాడు .అగ్నిదేవుడు ఆది దంపతులకు ఇష్టమైన ఆహార పదార్ధాలు వండాడు .విష్ణుమూర్తి వివాహోచిత పూజాదికాలు చేశాడు. వేదాలు గానం చేశాయి నవ్వాయి .అప్సరసలు నృత్యం చేశారు .గ౦ధర్వ కిన్నరులు గానం తో తన్మయుల్ని చేశారు .మైనాకుడు శుభప్రదాలైన ‘’లాజలు’’ అంటే పేలాలు చల్లాడు .లోపల పుణ్యాహవాచన కార్యంజరిగింది .విధి విధానంగా అగ్నిని ,శిలను ప్రతిష్టించి పేలాలను హవనం చేసి ,అగ్నికి ప్రదక్షిణం చేశారు .
విష్ణు మూర్తి సాయం తో శివుడు గుండ్రాయిని తొక్కటానికి పార్వతీదేవి కుడి పాద బొటన వ్రేలిని చేతితో స్పృశించాడు .శివుని దగ్గర హోమం చేస్తున్న బ్రహ్మ చూసి దుస్ట చాపల్యం తో నవ్వగా వీర్యం కారిపోయింది .సిగ్గుపడి దాన్ని చూర్ణం చేశాడు .దీనినుంచి ‘’వాలఖిల్యులు ‘’జన్మించారు .అప్పుడు దేవతలంతా హాహాకారాలు చేశారు .సిగ్గుపడి బ్రహ్మ అక్కడనుండి లేచి వెళ్ళిపోయాడు .దేవగణ౦ మౌనం వహించాయి .శివుడు నందితో ‘’బ్రహ్మను వెనక్కి పిలు .నేను ఆతనిని పాపరహితుడిని చేస్తాను .తప్పు చేసిన వారి యెడల సజ్జనులు దయ చూపించటంలోక సహజం .విషయవాంఛ విద్వా౦సులనూ మోసగిస్తుంది .దాని శక్తి అంత గొప్పది ‘’అన్నాడు .
ఉమానాధుడు బ్రహ్మపై జాలితో నారదుడితో జరిగింది చెబుతూ భూమి ,నీరు పాపుల పాపాలను తొలగించే శక్తికలవి .ఈ రెండిటి సారాన్ని గ్రహిస్తాను ‘’అని చెప్పి వాటి సారాన్ని గ్రహించి ,భూమిని కమండలంగా చేసి ,దానిలో నీరు పోసి ,పవమాన్యాది సూక్తాలతో అభి మంత్రించి దానినుండి జగత్పావనమైన శక్తి కలిగేట్లు స్మరింఛి ఆ కమండలాన్ని బ్రహ్మకిచ్చాడు .జలం మాతృదేవత .భూమికూడా తల్లి యే.ఈ రెండిటికి సృష్టి యొక్క స్థితి ,ఉత్పత్తి ,వినాశ హేతుత్వం ఉన్నది .వీటిలోనే ధర్మం ప్రతిష్టితమై ఉంటుంది .ఇక్కడే సనాతన యజ్ఞం కూడా ప్రతిష్టింప బడింది ..భుక్తి ముక్తి వీటిలోనే ఉన్నాయి సకల స్థావర జంగమాలు వీటిలోనే ఉన్నాయి .వీటిని స్మరిస్తే పాపాలు నశిస్తాయి వీటిని ఉచ్చరిస్తే వాచికమైన పాపాలు పోతాయి .స్నాన పాన అభిషేకాలవలన శరీర పాపాలు తొలగుతాయి .లోకం లో ఇదే’’ అమృతం’’.దీనికంటే పవిత్రమైనది లేదు .దీనిలోని జలాన్ని ఎవరు స్మరించినా పఠించినా కోరిన కోరికలు తీరతాయి ‘’అని చెప్పి తనచే అభిమంత్రి౦ప బడిన కమండలాన్ని శివుడు బ్రహ్మకు ఇచ్చాడు .
పంచభూతాలలో జలం గొప్పది .లం లోని సారమంతా దీనిలో గ్రహింప బడింది కనుక ఈ కమండలజలం అభీష్ట సిద్ధి నిస్తుంది ఈ నీరు శుభప్రదం పుణ్యదాయకం ,పావనం .దీన్ని తాకితే నీపాపాలన్నీ పటాపంచలౌతాయి ‘’’అని బ్రహ్మకు శివుడు కమండలాన్నిచ్చాడు. .అక్కడున్న దేవ ముని గణమంతా పరమేశ్వరుని కీర్తించి జయజయ ధ్వానాలు చేశాయి .బ్రహ్మ దేవుడు జగన్మాత పార్వతీదేవి పదాగ్రాన్ని చూసి ,దుర్బుద్ధి కలిగిన పాపంతో పతితుడయ్యాడు .జగత్పిత పరమేశ్వరుడు దయతో పుణ్య ప్రదమైన స్మరణమాత్రం చేత పవిత్ర౦ చేసే గంగా జలమున్న కమ౦డలాన్నిబ్రహ్మదేవుడికి ప్రసాదించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-11-18-ఉయ్యూరు
—

