గౌతమీ మాహాత్మ్యం-5
ఎనిమిదవ అధ్యాయం –గౌతమీ మహత్వం
మునులమధ్యఉన్న గౌతముని త్ర్యంబకేశ్వరుడు ‘’తీర్ధాలు రెండు గజముల పొడవున వ్యాపించి ఉంటాయి .అన్నిట్లో నేను ఉండి కోరికలు తీరుస్తాను .గంగా ద్వారం ,ప్రయాగ ,సాగర సంగమం ల వద్ద భాగీరధి పుణ్యం, ముక్తి ఇస్తుంది .యమునానది అమర కంటకం లో సరస్వతీ నడదితోకలిసి అధిక పుణ్యం యిస్తుంది .కృష్ణా తుంగభద్రా భీమరధీ సంగమించేచోటు ముక్తిప్రదం.పయోష్ణీనది ఏనదితోకలిస్తేఅక్కడ ముక్తిలభిస్తుంది .గౌతమి ఎక్కడైనా పుణ్యప్రదమే .ఒక్కొక్కనది దేవతలువచ్చినప్పుడే పుణ్యం యిస్తాయి .కాని గౌతమి సకలకాలాలలో సకలజనాలకు పుణ్యమిస్తుంది .200యోజనాల పరిధిలో 3 కోట్ల 50వేల తీర్దాలున్నాయి .మహేశ్వరుని నుంచి ఉద్భవించిన గంగ గౌతమి అనీ ,వైష్ణవీ అని బ్రాహ్మీ ,గోదావరి నందా ,సునందా అని పిలువబడుతోంది .బ్రహ్మ తేజస్సుతో భూలోకాని తీసుకు రాబడింది కనుక కోరికలు తీర్చి పాపాలను హరిస్తుంది .స్మరిస్తే చాలు గంగ పాపాలు హరిస్తుంది .గంగ నాకు (బ్రహ్మకు ) ప్రియమైనది. పంచభూతాలలో నీరు శ్రేష్టం. తీర్ధాలలో భాగీరధి సర్వ శ్రేష్టం .భాగీరధ్యాదులకంటే గౌతమీ శ్రేష్టమైనది .శివుజి జటతోసహా నేలకు చేరింది .స్వర్గ మర్త్య పాతాలలలో గౌతమీ తీర్ధం సర్వార్ధాలను ఇస్తుంది .
తొమ్మిదవ అధ్యాయం –సగరో పాఖ్యానం
నారదుడు బ్రహ్మా ను ‘’ఒకటే గంగ రెండు ఐనట్లు చెప్పావు .గౌతముని చే భూమికి తేబడిన గంగ వృత్తాంతం చెప్పావు .శివజతాజూటం లోని గంగ క్షత్రియులచే తేబడింది అంటారు ఆ వివరాలు చెప్పు ‘’అన్నాడు .బ్రహ్మ ‘’వైవస్వత మన్వంతరంలో ఇక్ష్వాకు వంశం లో పుట్టిన సగరుడు అనే రాజు యజ్ఞయాగాదులు చేసి దాన బుద్ధితో దాతగా కీర్తి౦పబడ్డాడు .ధర్మ చి౦తనా పరుడు .కాని సంతానం లేక విచారం లో ఉన్నాడు .కుల పురోహితుడు వసిస్ట మహర్షి ని పిలిపించి తనకు సంతతికలిగే ఉపాయం చెప్పమని వేడుకొన్నాడు .మహర్షి కాసేపు సమాధి నిస్తు నిస్టుడై భార్యతో నిరంతరం రుషి పూజ చేయమన్నాడు .కొంతకాలానికి ఒక తపోధనుడు రాగా సత్కరించి మనసులోమాట చెప్పుకొన్నాడు .పుత్రులుకావాలని కోరాడు .అప్పుడు ఆయన ఒకభార్యవలన వంశ దీపకుడైన కొడుకు ,మరొక భార్య లన 60వేలమంది కొడుకులు కలుగుతారని చెప్పాడు .ముని వెళ్ళాక ఆయన చెప్పినట్లే వేలాది పుత్రులు కలిగారు .సగరుడు అనేక అశ్వమేధ యాగాలు చేయటానికి దీక్షా బద్ధుదయ్యాడు .పుత్రులను, సైన్యాన్ని అశ్వ రక్షణకు యేర్పాటు చేశాడు .ఇంద్రుడు ఊరుకుంటాడా ! యాగాశ్వాన్ని ఎత్తుకుపోయాడు .సగర పుత్రులు యెంత వెదికినా కనపడలేదు .రాక్షసులు యాగాశ్వాన్ని రసాతలం లో బంధించారు .పుత్రులు దేవాదిలోకాలు వెతికినా గుర్ర్రం జాడ కనిపించలేదు .ఒకరోజు వారికియాగాశ్వం పాతాళలోకం లో బంది౦పబడింది అన్న అశరీర వాణి వినిపించింది .రసాతలానికి వెళ్లగా, రాక్షసులు భయపడి కపిలముని దగ్గరకు వచ్చారు .ఆయన ఒకప్పుడు దేవకార్యానికి సహాయపడి అలసి పోగా దేవతలు పాతాళం లో నిద్రించమన్నారు .ఒక వేళ ఎవరైనా తనకు నిద్రాభంగం కలిగిస్తే వాళ్ళు భస్మం అవుతారు అని చెప్పి నిద్రపోయాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-11-18-ఉయ్యూరు

