గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
338-మందాక్రాంత సౌందర్యలహరి కర్త –‘’శ్రీ పాదుక ‘’ఆచార్య కొల్లూరు అవతార శర్మ
ఆచార్య శ్రీ కొల్లూరు అవతార శర్మ విజయనగరం లో శ్రీ కొల్లూరు లక్ష్మణ మూర్తి శర్మ ,శ్రీమతి లక్ష్మీ సోమిదేవమ్మలకు జన్మించారు .డిగ్రీ వరకు విజయనగరం మహారాజా వారి విద్యా సంస్థలలో చదివి ,ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు సాహిత్య విద్యా ప్రవీణ ,రాష్ట్ర భాషా ప్రవీణ ,సంస్కృత భాషా కోవిద ,విద్యావారిది (పి హెచ్ డి –వ్యాకరణం ,శిక్షా శాస్త్రాలు )సంస్కృతం లో ,తెలుగులో ఎం.ఏ ల తో పాటు బి .ఎస్. సి .బిఎడ్.కూడా ‘’.సంస్కృతం –అలంకార’’ శాస్త్రం పై పరిశోధన చేసి పిహెచ్ డి అందుకున్నారు .
అవతార శర్మగారు సంస్కృతం లో ‘’మందాక్రాంత సౌందర్య లహరి ,దశ మహావిద్యాదిస్తోత్రకదంబం రచించారు .
.తెలుగులో పానణినీయ శిక్ష ,ఆంద్ర ప్రదేశీయ ద్రావిడుల చరిత్ర ,సంస్కృతీ ,శ్రీ సారంగదేశ్వరాలయ చరిత్ర ,జ్ఞానపూర్ణిమ ,శివోహం శివోహం శివ కేశవోహం ,ఐశ్వర్య విద్యా సర్వస్వం ,ఆంజనేయ ముపాస్మహే ,అయ్యప్ప దర్శనం ,శ్రీ పాదుకాకల్పం ,హనుమత్తత్వ రహస్యోపనిషత్ ,ఉపనయనం ఎందుకు ,సూర్య శతకం ,అమ్మతో ముఖాముఖి ,ఐశ్వర్య శ్రీ కల్పం ,శివాష్టకం ,శ్రీ బాలాశతకం,,శ్రీపాదుకా సత్యదేవం రచించారు .
శృంగేరి విరూపాక్ష పీఠాధిపతులుశ్రీ శ్రీ కళ్యాణానందభారతీ మా౦తాచార్య మహాస్వామి సంస్కృతం లో రచించిన ‘’పూర్ణ మీమాంసా దర్శనం ‘’ను శ్రీ అవతార శర్మగారు తెలుగులోకి అనువదించారు .గణిత శాస్త్ర నిపుణులు , ,తైత్తిరీయోపనిషత్ ను గణిత శాస్త్ర పరంగా వివరించిన మేధావి శ్రీ కళ్యాణానంద స్వామి వారి రచనను ఆంధ్రీకరించటానికి సంస్కృత భాషాపరిజ్ఞానం ,గణితం లో నిష్ణాతులయిన వారికే సాధ్యం .శర్మగారు ఈ రెండిటిలోనూ అసామాన్య పాండిత్యవారు కనుకనే బ్రహ్మనోరిచారితబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ,శ్రీ విద్యోపాసకులు ,శ్రీ విద్యారత్నాకర శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఈ బాధ్యతను శర్మగారిపై ఉంచారు .తగ్గట్టుగా గొప్పన్యాయం చేకూర్చారు శర్మగారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -8-12-18-ఉయ్యూరు

