గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
339-పూర్ణ మీమా౦సా దర్శనకర్త –శ్రీ విరూపాక్ష పీఠశ్రీ శ్రీ కళ్యాణాన౦ద మహాస్వామి (1889)
పూర్వాశ్రమం లో శ్రీ గంటి బాలకామేశ్వర శర్మగా చిత్రభాను సంవత్సర వైశాఖ శుద్ధ అష్టమి నాడు శ్రీ గంటి చినకామేశ్వరుడు ,శ్రీమతి పార్వతీ దేవి దంపతులకు జన్మించిన శ్రీ కళ్యాణానంద స్వామి బి ఏ .చదివారు .వ్యాకరణము ,శాస్త్రాలు శ్రీ తాతాసుబ్బారాయ శాస్త్రిగారి వద్ద నేర్చారు .మంత్రోపదేశం శ్రీ రాణి చయనులుగారి వద్ద జరిగింది .శ్రీమతి సోమిదేమ్మతో వివాహమైంది .వీరి సన్యాస గురువులు జగద్గురువులు శ్రీ బోధానంద భారతీ మహాస్వామి .సన్యాస నామం’’ శ్రీ కళ్యాణానంద భారతి’’ .జగద్గురు పట్టాభిషేకం 23-12-1923-రుధిరోద్గారి మార్గశిర పూర్ణిమ .
బిరుదనామములు –శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్య పదవాక్య ప్రమాణ పారావార పారీణ,షడ్ దర్శన స్థాపనా కార్య వ్యాఖ్యాన సి౦హాసనాదీశ్వర ,సకల వేదార్ధ ప్రకాశిక ,.
స్వామీజీ పూర్ణ మీమాంసా దర్శనం (సవృత్తికం )తోపాటు బ్రహ్మ సూత్ర సంజీవిని ,శారీరక మీమాంసా సంగ్రహః ,కళ్యాణ సంహితా ,కళ్యాణ స్మృతిః,,ప్రాయశ్చిత్త పశు నిర్ణయం ,ఆపస్తంభీయ గృహ్య సూత్రం, అహంకార ద్వంసినీ ,తంత్ర జ్యోత్స్నా ,శ్రీ కలా దర్శనం ,శ్రీ చక్ర దర్శనం ,శ్రీ యాగ సూత్రం ,మహారుద్ర యాగత్రయం ,సర్వ దేవ ప్రతిస్టావిది ,శ్రీ రామతారకోపాసన విధి ,గణపత్యుపాసన విధి ,శ్రీ యాగాను క్రమణిక,ఆపస్తంభీయ దర్శపూర్ణ మాస వ్యాఖ్యాన టీకా సంజీవిని ,శ్రీ గుణ నీకా దీధితిః వంటి 50అపురూప సంస్కృత గ్రంథాలు రచించారు .దీన్నిబట్టి స్వామివారి సంస్కృత పాండిత్యం అపారం అని తెలుస్తుంది .ఈ గ్రంధాలన్నీ శ్రీ పరిమి నారాయణ శర్మ –తెనాలి ప్రచురించారు
స్వామివారు ఆంగ్లం లో- Theosophy unveilled ,Modern ignorance ,Mnava rahasyam ,Untouchability ,kamakalaand magic sequences ,constitution of Aryavarta ,Manu smruti saarah ,Sovereign Democratic Republic of Bharta varsha వంటి 21అమూల్య గ్రంథాలు రాశారు.
విరూపాక్షపీఠం గుంటూరులో ఉన్నది .స్వామివారు అపర శంకరులే అని నమ్మకం .వీరు సంస్కృతం లో రచించిన ‘’పూర్ణ మీమాసాగ్రంథం’’వేద వ్యాసులవారి బ్రహ్మ సూత్రాలతో వ పోల్చదగినదిగా భావిస్తారు .బృహదారణ్య కోపనిషత్ లోని-
‘’పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదత్యచే –పూర్ణస్యపూర్ణ మాదాయ పూర్ణ మేవావశిష్యతే అగాహన చేసుకోనేట్లు ‘’‘’మంత్రాన్ని ఆధునికుల అవగాహన కోసం క్షేత్ర గణితం తో వివరించారు .సంస్కృత సూత్రాలతో రచించిన ఈ గ్రంథంను సంస్కృత వృత్తితో వివరించి ,ఉపోద్ఘాతంగా ఇంగ్లిష్ లో సూత్రార్ధాన్ని కూడా వివరించటం విశేషం .కనుక ఆధునిక వైజ్ఞానికులకు తత్వ సాధనలో బాగా ఉపయోగపడుతుంది –
‘’వృత్త మీశ్వర మీశ్వరః ‘’ఏకమేవ ద్వితీయం ‘’,’’పద బీజ సంఖ్యా రేఖా ణాముత్తరోత్తరం బలీయం ‘’మొదలైన వారి సూత్రాలు భారతీయ వేదవేదాంత శాస్త్ర పరిజ్ఞానాన్నేకాక ,దాన్ని ఆధునికులకు క్షేత్ర గణిత ప్రామాణ్య౦ గా వివరించిన తీరు స్వామివారి గణిత శాస్త్ర ప్రావీణ్యత కు నిదర్శనం .దీనిని డా.కొల్లూరు అవతార శర్మగారు సులభ బోధకంగా తెలుగులోకి అనువదించి గొప్పమేలు చేశారు .ఇదంతా శ్రీ విద్యా ప్రతిపాదికం .ఆది ,అంతాల ఐక్యతే చక్రం అని ఇందులోని భావం .’’యచ్చక్రాణా౦ అధిష్టానం ‘’అనే విశేష లక్షణం పూర్వ మీమాంసా దర్శనం లో ఉన్నదని,సమన్వయ ఆవశ్యకత లేని రూపమే వృత్తం అనీ ,అంటే వృత్తం ‘’సర్వాదిస్టానం ‘’అని భావమని , .’’వ్రుత్త త్రికోణం హిరణ్యగర్భః ‘’అనీ ‘’వృత్తా త్సర్వ వ్యవహార వ్యన్జకం సమత్రిభుజం ‘’అనీ వివరింపబడింది .దీనివలన ‘’ఏకం సత్ విప్రా బహువదంతి’’అనే న్యాయం రుజువైందనిఈ గ్రంథాను వాదానికి ము౦దుమాటలు రాసిన –రిటైర్డ్ సైంటిఫిక్ ఆఫీసర్ శ్రీ గురజాడ సూర్యనారాయణ మూర్తిగారు తెలియజేశారు .
ఆధారం- తొలితెలుగు చారిత్రకనవలా రాచయిత శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారి కుమారులు,నోరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్దాపక అధ్యక్షులు ,శ్రీ విద్యోపాసకులు , శ్రీ కళ్యాణానంద భారతీ పురస్కార గ్రహీత ,శ్రీ విద్యా రత్నాకర , బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త ,ప్రచురణకర్త ,బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్స్త్రి ఎం .ఇ. గారు నాకు 18-11-18ఆదివారం హైదరాబాద్ లో వారిని స్వగృహం లో కలిసినప్పుడు అనేక గ్రంథాలతోపాటు అందజేసిన ‘’పూర్ణ మీమాసా దర్శనం ‘’-ఆంధ్రీకరణ గ్రంథం.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-12-18-ఉయ్యూరు

