సాహితీ బంధువులకు శుభకామనలు -23-12-18 ఆదివారం ఉదయం 8-30 కి ఉయ్యూరు నుండి మేమిద్దరం,మా పెద్దకోడలుశ్రీమతి సమత,మనవడు చి .సంకల్ప్ కారులో బయల్దేరి గుడివాడ మీదుగాముదినే[పల్లి దగ్గర సింగరాయ కొండ లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం ,కలిదిండి లోని శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవాలయం ,భీమవరం సోమారామం ,భీమేశ్వరాలయం ,మావూళ్ళమ్మ దేవాలయాలు చూసి అంతర్వేది వెళ్లి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం ,బీచ్ చూసి ,తిరుగుప్రయాణం లో పెనుకొండ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరాలయం ,శ్రీ నగరే,శ్వర, శ్రీ మహిషా సుర మర్దిని అమ్మవార్లను దర్శించి ,రాత్రి 9-30కు ఉయ్యూరు చేరాం .
పెనుకొండలో సాహితీమూర్తి బహు గ్రంధకర్త సాహిత్య సంస్థ నిర్వాహకులు నాకు ,సరసభారతి అత్యంత ఆత్మీయులు శ్రీ ఎం ఆర్ వి ఎస్ మూర్తి గారు మేము వస్తామని ఉదయం, సాయంత్రం మాకోసం ఆలయం లో ఎదురు చూసి ,సాయంత్రం మా రాకకు ఆనందించి స్వయంగా దేవతా మూర్తుల దర్శనం చేయించి, చరిత్ర తెలియ జెసి, మా కెంతో తోడ్పడ్డారు .వారికి ఉయ్యూరు నుంచి మేము తీసుకు వెళ్లిన శ్రీ సువర్చలాన్జనేయ ప్రసాదం అంతర్వేది ప్రసాదమందజేసి కృతజ్ఞతలు తెలియ జేశాము . –దుర్గాప్రసాద్

