సాహితీ బంధువులకు శుభకామనలు -2019 నూతన సంవత్సర శుభా కాక్షలు –
ఒంగోలుజిల్లా వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయం స్థాపించి నూరుసంవత్సరాలైంది .ఇదే మనరాష్ట్రం లో అతి ప్రాచీన లైబ్రరీ .దీనిని శ్రీ వివి శ్రేష్ఠిగారు 1918లో స్థాపించగా తర్వాత పోషణ భారాన్ని శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు పంతులు గారు చేబట్టి తీర్చి దిద్దారు ఇక్కడ తాళ పాత్ర గ్రంధాలతో పాటు అనేక అరుదైన పుస్తకాలున్నాయి .
ఈ గ్రంధాలయ శత వార్షిక వేడుకలు 30-12-18ఆదివారం జరుగుతున్నాయి .సాహిత్యాభిమానులు పుస్తక ప్రియులు అందరూ అత్యుత్సాహం గా పాల్గొని జయప్రదం చేయమని మనవి
ఆ రోజు యాత్రగా సాహితీ ప్రియులు శ్రీ చలపాక ప్రకాష్ ఆధ్వార్యం లో విజయవాడ నుండి బయలుదేరుతున్నారు .ఉదయం 8 గంటలకు విజయవాడ లోబయల్దేరే విజయవాడ -ఒంగోలు ఫాస్ట్ పాసెంజర్ లో అందరు కలిసి వెళ్లాలని ఆలోచన .కనుక ఆదివారం ఉదయం 7 -30 కు విజయవాడ రైల్వే స్టేషన్ కు అందరు చేరితే ఎవరి టికెట్ వారు పెట్టుకొని వేటపాలెం కలిసి వెళ్ళవచ్చు అక్కడ శత వార్షికోత్సవం, పుస్తకావిష్కరణ ,భోజనాలు కూడా ఉంటాయి .
మధ్యాహ్నం 3 గంటలకు వేటపాలెం లో ఫాస్ట్ పాసెంజర్ అందుకొని విజయవాడ చెర వచ్చు . ఆసక్తి ఉన్నవారు శ్రీ చలపాక ప్రకాష్ గారిని 9179346334లేక 9247475975నంబర్ లకు ఫోన్ చేసి సంప్రదించండి -దుర్గాప్రసాద్
