రసభారతి-సాహిత్య సాంస్కృతిక సంస్థ 10-2-19 సామూహిక సత్యనారాయణ వ్రతం
10-2-19 మాఘ శుద్ధ పంచమి శ్రీ పంచమి(సరస్వతీ దేవి జన్మదినోత్సవం ) నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లోసరసభారతి 137 వ కార్యక్రమంగా ఉదయం 9 గం లకు ఆవుపాలు పొంగించి పొంగలి వండటం ,ఆతర్వాత ఉదయం 10గం లకు సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహింపబడుతుంది .
వ్రతం అనంతరం శ్రీ అయ్యప్పదీక్షతో 18సార్లు సైకిల్ పై శబరిమల యాత్ర ,5సార్లు శ్రీ శివ దీక్షతో కాలినడకన శ్రీశైల యాత్ర చేసిన స్థానిక సుధీర్ టింబర్ డిపో ఉద్యోగి శ్రీ బిరుదుగడ్డ వెంకటేశ్వరరావు గారికి ఆత్మీయ సత్కారం ,వారి అనుభవ ప్రసంగం ఉంటాయి . భక్తులు ,,సాహితీ బంధువులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన –
గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు ,ఆలయ ధర్మకర్త
9-2-19 -ఉయ్యూరు
—

