స్త్రీ శక్తి ‘’పై
సరసభారతి 31-3-19శ్రీ వికారి ఉగాది వేడుకలలో
నిర్వహించిన కవిసమ్మేళన కవితలు -4(చివరిభాగం )
విన్నపం –వచన కవితలలో ఎక్కడైనా కవిత పలచబడిందని ,పునరుక్తమైనదని నేను భావించిన చోట్ల,విషయానికి సంబంధం లేని చోట్ల మార్పులు చేసి ,ధారకొనసాగి ,చిక్కబడేట్లు చేశాను .నా సాహసాన్ని మన్నించండి –దుర్గాప్రసాద్
26-లయన్ శ్రీ బందా వెంకటరామారావు –విజయవాడ -6281754709
ప్రమాద పధం లో స్త్రీ శక్తి
అరిషడ్వ ర్గాలున్న స్త్రీకి భవితవ్యం సున్నా
అత్తలు వదినలు కోడళ్ళు భార్యలు హద్దుమీరితే ప్రగతి శూన్యం
కుంతీ ,కైకా గర్భం అద్దెకిచ్చే అమ్మ
పేకాడే మహిళా పోగతాగుతూ మందుకొట్టే మానినీ
ప్రమాదాత్మకపధం లో స్త్రీ శక్తులు.
సరస్వతి లక్ష్మి పార్వతీ వైదేహి శిరోమాణిక్యాలు
దుస్టు డైన కన్నకొడుకునే చంపిన సాత్రాజితి ,
కౌరవా౦తాన్ని చూసి కేశ పాశం ముడేసుకొన్న ద్రౌపది
ఆదర్శప్రాయ మహిళా శక్తులు .
శ్రమలో పరిశ్రమలో మహిళ పై చేయి
ప్రియదర్శిని ఇందిర,నేటి నిర్మల ,సుష్మా ,స్మృతి
సమర్ధతకు నిలుటద్దాలు .
మెతుకులో బతుకులో ఆమెదే కష్టం
అర్ధనారీశ్వరి అమృతహాసిని ఆమెయే
ఇదే త్రికాల వేదం ఈ బందా నాదం .
27-శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ –ఉయ్యూరు -9666020842
అమ్మ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి
చరాచరాలకు మూల రూపిణి
సచ్చిదానంద స్వరూపిణి
భవభయహారిణి, విశ్వేశ్వరి అమ్మ
సమసమాజ స్థాపనకు మూలం ,ఆదిగురువు ఆమెయే
తల్లులందరూ మేల్కొని
బిడ్డలకు నీతులు బోధించి
విశ్వ చైతన్యానికి బీజాలు నాటండి
మీ శ్రమ వృధాకాదు
సత్ఫలితాలనిస్తుంది .
సమాప్తం
ఇవికాక నాలుగు కవితలున్నాయి కాని పేర్లు లేవు .పోనీ వేద్దామంటే కవిత్వమూ శూన్యమే కనుక వాటిని వదిలేశాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-4-19-ఉయ్యూరు
—

