గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4
412-ఆకాశవాణి సంస్కృత ప్రసంగాలు చేసిన వే.పండిత పెద్దమఠం రాచ వీర దేవర తీర్ధ
కావ్య తీర్ధ ,ధర్మనిరత ,వీర శైవ సాహిత్య సార్వభౌమ ,సాహిత్య భూషణ ,సాహిత్య విశారద ,వీర శైవ ఆగమ సాహిత్య చతుర,పుంభావ సరస్వతి వే.పండిత రాచ దేవర తీర్ధ తనజీవితాన్ని వీరశైవ మత వ్యాప్తికి అంకితం చేసిన మహానుభావుడు .సంస్కృతాంధ్రాలలో మహా పండితుడు .రెండు భాషలలలో ఎం .వో. ఎల్ .తన స్వంత డబ్బు సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేసి వీర శైవ వ్యాప్తికి తీవ్ర కృషి చేశారు .వీర శైవ ,ధార్మిక గ్రంథాలను25 వరకు రచించారు .శివయోగి శివా చార్య రచించిన కన్నడ శతక త్రయాన్ని తెలుగు లోకి అనువదించారు .వ్యాఖ్యానమూ రాశారు .’’యస్య కీర్తిః సజీవతి ‘’అంటే సాహిత్య సేవ ,శాశ్వత కార్యాలు చేసినవారు మరణించినా చిర కీర్తి నార్జిస్తారు అని పూర్తిగానమ్మి అంకితభావంతో పని చేశారు .’’వైదికం కర్మ కురీహిత-జ్ఞానైక ఫల సాధనం –న కురత్ప్రాశనీవం కర్మ –వీరశైవ కదా చన’’అని ఒకమహా కవి చెప్పినట్లు వీరశైవ మతాభిమాని వైదిక కర్మలనే ఆచరి౦చాలి కాని పశుకర్మలను ఆచరి౦చ రాదు అని ప్రచారం చేశారు .
రాచ దేవర గారు వీర శైవ ప్రచారం కోసం దేశం లో తిరగని ప్రాంతం లేనేలేదు .పుంభావ సరస్వతి అయిన ఆయన అనేక సంస్కృత ఆంద్ర ప్రసంగాలు రేడియో లో చేసి మెప్పించారు .అందులో కొన్ని 1-కవేః కాళిదాసస్య దృశ్యకావ్య రచనా కౌశలం 2-బాణ కవేః కావ్యస్య ఔచిత్యం 3-రామాయణ మహా భారతయోః అన్యోన్య సంబంధః పరిణామః 4-క్రాంతి పురుష మహాత్మా శ్రీ బసవేశ్వరః 5-సంస్కృత సాహిత్యే మన్మధ స్య స్వరూప స్వభావః 6-కల్హణ కవేః రాజ తరంగిణి 7-సుప్రభేదాగమే వంటి మనవాళ్ళు ఎవరూ రాయని సంస్కృత వ్యాసాలూ రాసి ఆకాశవాణిని సుసంపన్నం చేశారు .రెండుభాషలలో సుమారు వంద వ్యాసాలూ రాసి వినిపించిన మహా కవి ,విమర్శకులు దార్శనికులాయన
రంగారెడ్డి జిల్లా నాగార్జున కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులుగా పని చేశారు
వారి సంస్కృత రచనా పాటవం రుచి చూద్దాం
1-న వీర శైవ సదృశం –మతమస్తిజగత్రయే-సర్వభోగ ప్రదం సర్వం –శివ సాయుజ్య సాధకం
2-నమో ఉగ్ర స్వరూపాయ –నమో జిష్ణ్వాది శాత్రవే –దక్షయజ్న వినాశాయ వీర భద్రాయ తే నమః ‘’
వచన రచనామృతాన్ని ఆస్వాదిద్దాం
‘’తతః సత్యవసరే గాన్ధర్వేణ విధినా శాకుంతలా ముద్వాహ్య ,కతిపయ వాసరా పగమే సతి రుషిభిరనుజ్ఞాతః దుష్యన్తః స్వనగరం ప్రతిజిగమిషణ్ తస్యై శకున్తలాయైఆత్మనః అంగుళీయకం దత్వా ప్రియే –ఆత్రెకైకందివ సే దివసే మదీయం నామాక్షరం గణయః’’
వీర దేవర తీర్ధ గారి సాహిత్య ఆధ్యాత్మిక ప్రతిభకు తగిన పురస్కారాలెన్నో అందుకొన్నారు .వీరి అమృతోత్సవ సందర్భంగా హైదరాబాద్ బాగ్ లింగం పల్లిలో కాశీనుంచి విచ్చేసిన మహా పండితులు మహదాశీర్వచనం అందించారు .7-2-1997నశ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం లో ఆచార్య బిరుదరాజు రామరాజు గారి అధ్యక్షతన ఘన సన్మానం చేశారు .శ్రీశ్రీ శివా చార్య చంద్ర శేఖర మహాస్వామిజీ దేవరగారి స్వగృహానికి విచ్చేసి ఆశీర్వదించారు .మెదక్ జిల్లా తో పాటు అనేక శైవ మతాలవారు ఆహ్వానించి సత్కరించారు .తెలుగు విశ్వవిద్యాలయం పాల్కురికి సోమనాధుని అష్ట శతమాసోత్సవ సందర్భంగా సన్మానించింది .కాచిగూడ వీరణ్ణ గుట్టపై జరిగిన బసవన జయంతి నాడు సన్మానించి ‘’వీర శైవ సాహిత్య సార్వభౌమ ‘’బిరుదప్రదానం చేశారు .
మనవి –దేవరగారి పుట్టు పూర్వోత్తరాలు నాకు లభ్యం కాలేదు ఎవరివద్దనైనా ఉంటె నాకు పంపితే వ్యాసాన్ని పరిపూర్ణం చేస్తాను .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-5-19-ఉయ్యూరు
—

