వేద,శాస్త్ర విద్యార్థికి పురస్కార ప్రదానం
శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సరసభారతి 141వ కార్యక్రంగా 28-5-19 మంగళవారం సాయంత్రం 6-30గం లకు శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య (విజయవాడ )గారిచే ”హనుమ గానమహిమ ”ధార్మిక ప్రసంగం(అరగంట ) ,తర్వాత శ్రీమతి వీటూరి భాస్కరమ్మ (చెన్నై )రచించి,పంపిన” శ్రీ హనుమవైభవ0 ”పద్యాలపఠనం ,అనంతరం శ్రీమతి టేకుమళ్ళ చిద0బరి ( రేడియో టివి ఆర్టిస్ట్ విజయవాడ)మరియు శ్రీమతి గూఢమాధవి ,కుమారుడు మొదలైన స్థానిక గాయనీ గాయకులచే ”భక్తి సంగీత విభావరి ”జరుగును
తదనంతరం వేద ,శాస్త్ర విద్యార్థి చి . కూచి భొట్ల పవన్ కుమార్ (ఉయ్యూరు )కు నగదు పురస్కారం తో సత్కారం జరుగును .
అందరూపాల్గొని జయప్రదం చేయప్రార్ధన
గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-19

