గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4
417-భద్రగిరి చంపు కర్త –భారద్వాజ రామా చార్య (17-18శతాబ్ది )
భద్రాచల క్షేత్రమహిమను, అక్కడ జరిగే చైత్రోత్సవాన్నీ విపులంగా ‘’భద్రగిరి చంపు ‘’కావ్యం లో వర్ణించిన కవి భారద్వాజ రామాచార్య ..ఇతని ఇంటిపేరు ఊరు కాలమూ తెలియదు .కాని బిరుదురాజు వారు ఈ కవి 17-18శతాబ్దుల కాలం వాడై ఉంటాడని ,పాల్వంచ జమీన్ దారులైన ఆశ్వారావుల ఆస్థానం లో ఉండి ఉంటాడని ఊహించారు .కావ్యం లో తండ్రి తాతలగురించి తనగురించి చెప్పుకొన్నాడు –
‘’భారద్వాజస కులార్ణవామృతకర శ్రీరామ వర్యస్య యః-పౌత్రో వెంకట దేశికస్య మహాతః పుత్రస్య తే నాదరాత్
రామాఖ్యేన మనీషిణావిరచితే చంపూ ప్రబంథే మహాన్ – భద్రాదీశ మహోత్సవా మృతయుతే భాగో ద్వితీయో భవత్ ‘’.కావ్యం లో మొదటిభాగానికి ‘’ధ్వజారోహణం ‘’అని పేరు పెట్టాడు . రెండవ భాగానికి ఏ పేరు పెట్టాడో ఆభాగం శిధిలం అవటం వలన తెలియలేదు .ప్రారంభ శ్లోకం –‘’శ్రీమద్భద్ర నగాధిరాజ విలసత్సౌధాగ్ర భాగోజ్వల –జ్జ్వాలాభీల మవక్ర విక్రమ మహం చక్రేశ్వరం నశ్వరం
ఛేత్తుం బంధ మలి౦ధనాగ్ని శమదం,దుర్వార గర్వాధిక –క్రవ్యద క్షరితా క్షతక్షత రుహైస్స్యః ప్రశస్యం స్తువే ‘’.మొదటిభాగం లో భద్రాచల మహాత్మ్యం అక్కడి ఉత్సవాలు వర్ణించబడ్డాయి .రెండవభాగంలో మర్నాడు అక్కడ జరిగే తిరునాళ్ళు వీధులు యాత్రికులు వగైరాలున్నాయి .కావ్యం లో’’ వీథీ’’ లక్షణాలు కూడా జోడించాడు .పద్మాక్షుడు అనేవాడు ప్రియురాలు బిబ్బోకవతికి వివరించి చెబుతాడు . ఈ రెండు పాత్రలగురించిన శ్లోకం –
‘’చైత్రోత్సవం దాశరధేర్విలోకితం –భద్రాద్రి నామ్నస్తరుణీ సమాగతౌ
పద్మాక్ష బిబ్బోకవతీ సమాఖ్యయా –ప్రఖ్యాం గతౌ కౌచన రంగ వాసినో ‘’
ఈ చంపు కాకతీయ కాలం నాటి’’ క్రీడాభిరామం ‘’ను గుర్తుకు తెస్తుంది .ఆలయ గోపురం దూరానికి ఎలాకనపడిందో చూడండి –
‘’కనక కలశరాజ శ్రీ పరీక్షాంవిధాతుం-విపులగగన శాణోల్లేఖనే నోన్న తేభ్యః
సతత తరతి సహానాం సాదు పారావతానాం –విహరణ శరణేభ్యో నమోస్తు ‘’
గోదావరి నది వర్ణన –
‘’పులిన జఘన రమ్యా చక్రవాక స్తనీయం-తరళతర తరంగ ప్రోచ్చలసన్మమధ్య రేఖా
సరిదిహ చపలాక్షీ స్వచ్ఛ డిండీర హాసా –విహగకుల నినారైర్నౌ శుభం పృచ్ఛతీవ ‘’
భద్రగిరి వర్ణన –
‘’శ్రీ భద్ర శైలం సుకృతైకమూలం –భజేను వేలం ,జలదౌఘనీలం
శ్రేయో విశాలం విలసద్రసాలం –శ్రితానుకూలం శ్రిత దేవజాలం ‘’
శ్రీరామభద్ర వర్ణన –
‘’నమోస్త్వసుర వైరిణీ,జనక భూ మనో హారిణే-హృద౦తర విహారిణే,మతిమతాంసుధా హారిణే శ్రితావన చారిణే ,శ్రుతి వనాంత సంచారిణే-సదా సుకృత కారిణే,దశరధాత్మజా కారిణే’’.
కల్యాణం ముందు అమ్మవారి, అయ్యవారి వర్ణన –
‘’కలశ జలధి కన్యాం,సర్వ లోకైక మాన్యాం-జనకయజన జన్యాం,వాంచఛితానాం వదాన్యం
హృతనతజనదైన్యాం,రాఘవే౦దోరనన్యా-మలమకురుత ధన్యా ,మాళివర్గౌఘ శూన్యాం’’
‘’కాంచీ గుణేన కలకి౦కిణి కేన సింధు –కాంచీనుతా కటి తటీ గ్రధితా కయాచిత్
పంచాస్త్ర కార్ముకగుణ ప్రవరేణ రామ –పంచాననన్య విజయోద్యమ శాలి నేవ ‘’
కళ్యాణ ఘట్టం లో పాల్వంచ జమీన్ దారులైన అశ్వారావు లవర్ణన ఉండటంతో ఈకవి ,వారి ఆస్థానకవి అయి ఉండాలి అని రాజుగారి నిర్ణయం –
‘’ఆశ్వినోజ్వలో హ్యశ్వరాయ ప్రభు –శ్శాశ్వతీ౦ సంపదం విశ్వతః పృస్టతః
ఆశ్వ వాప్తుం తదా విశ్వసన్ భూ సుతా –ధీశ్వరం చామరం శాశ్వదా దూనతే’’
తల౦బ్రాలఘట్టాన్నీ కమనీయంగా వర్ణించాడు –
‘’సువర్ణ శోభనాక్షతా ని మౌ నఖేల మక్షతాం-కరా౦బుజ ద్వయేన తౌ సదా శ్రితా వన్నోన్నతౌ
వధూ వరౌ ప్రవర్షత స్తదా ముదా నమర్షతః –పరస్పరస్య మూర్ధని ప్రసూన గంధ వర్దినీ ‘’
‘’ముక్తా విదేహ తనయా౦జలి శుక్తి కాంత –ర్ముక్తా రఘు క్షితి వర్స్య తదుత్తమా౦గే
నక్తా సమస్త తనుషు ప్రబభుర్వికాసో –ద్యుక్తాఃప్రసూన నికరా ఇవ పారిజాతే’’
మనం చెప్పుకొనే ‘’జానక్యాః కమలాంజలి పుటే ‘’శ్లోకాన్ని గుర్తుకు తెస్తుంది .రధోత్సవ వర్ణన లో వివిధ ఛందస్సులను పపేర్కొంటాడుకవి –
‘’సోయం రాఘవ నందనో ఖిలజనా నాన౦దయన్ స్యన్దనే –భక్తైర్భాగవతతైర్నిషేవితతనుః క్ష్మాజానుజాభ్యాం యుతః
ఆస్తే నిస్తుల నూత్నరత్న రుచిర శ్రీమాలికా౦ డోలికాం-యశ్చక్రే సమరే పురాసుర మృగాన్ శార్దూల విక్రీడితం ‘’
‘’అనుపమ మణి భూషణా౦చితా భా –న్మనుకుల నాథ వధూ రధోపరిస్దా
దనుజ రిపుసుతా ను తాప కృఛ్ర-స్తనుతర కల్ప లతేవ పుష్పితాగ్రా ‘’
ఇంతటి చక్కని కావ్యాన్ని,అందులోని కమ్మని శ్లోకాలను , భద్రాద్రి సీతారామకల్యాణం ప్రత్యక్ష ప్రసారం లోనిలయ విద్వాంసులైన ఏ విశ్లేషక కవి అయినా భద్రాద్రి రామాచార్యకవి శ్లోకాలను ఉదహరిస్తున్నారోలేదో !రామరాజుగారు శ్రమపడి వెలికి తీయకపోతే ఈ కవీ, కావ్యమూ కాలగర్భం లో కలిసి పోవటం జరిగేది .
ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-19-ఉయ్యూరు

