- గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4
419-ఏక దిన ప్రబంధకర్త –ఆలూరి సూర్యనారాయణ వాజపేయ యాజీ
విజయనగర సామ్రాజ్యాన్ని రెండవ వేంకటపతి రాయలు పాలిస్తున్నకాలం (1586-1614)లో రాయవేలూరుకు సామంతరాజు లింగమనాయకుడు .తండ్రి చిన్నబొమ్మ నృపాలుడు (1549-1579)గొప్పకవి, గాయకుడు, కవిపండిత పోషకుడు .జయదేవుని గీత గోవిందం లాగా ఆరు కాండల రామాయణాన్నివివిధరాగ ,తాళాలతో, గేయాలతో, శ్లోకాలతో ‘’సంగీత రాఘవం ‘’కృతి రచించాడు .అప్పయ్యదీక్షితులవారికి చాలాకాలం పోషకరాజుకూడా.బొమ్మనాయకునికొడుకు లింగమనాయకుడు కూడా పరాక్రమశాలి, కవిపండిత పోషకుడు .విజయనగరరాజు రెండవ వేంకటపతి రాయలతో యుద్ధం చేసిన మేటి వీరుడు .రాయవేలూరుకోట రాయల వశంకాకపోతే దామెర్ల కరి చన్నమనాయకుడు అనే విజయనగర సామంత సైన్యాధికారి మోసం చేసి కోటను పట్టుకొన్నాడు .ఇంతటితో వేలూరులో ఈ నాయకులపాలన అంతమొందింది .
లింగమనాయకుని ఆస్థానం లో కవిపండిత గాయక నర్తక,విద్యా గోస్టులు , ప్రదర్శనలు , చర్చలు ఎక్కువగా జరిగేవి .విద్యా గోష్టికి ఆలూరి సూర్యనారాయణ యజ్వ మూలస్థంభం .ఒకరోజు రాజాస్థానం లో కవులమధ్య పోటీవస్తే యజ్వగారు ఒక్క రోజులో ఒక ప్రబంథం రాస్తానని సవాలు చేసి ‘’ఉలూచీ చిత్రాంగద సుభద్రాపరిణయం ‘’ రాసి మాట నిలబెట్టుకొని రాజును సంతోష పరచాడు .ఇది అముద్రితం .
మొదటిసర్గలో ఇంద్రప్రస్థ వర్ణన ,ధర్మరాజు ధర్మపాలన ,సమయభంగం చేసిన అర్జునుడు తీర్ధయాత్రలకు వెళ్ళటం ,గంగానదినుండి పాతాళానికి పోయి ఉలూచిని పెళ్ళాడి బభ్రువాహనుడికి జన్మనివ్వటం ,అక్కడినుంచి కావేరీ తీరం చేరటం ,పాండ్యరాజ వర్ణన కూతురు చిత్రంగదతో పరిణయం ,పంచహ్రద సేవనం ,ద్వారకకు చేరటం ఉన్నాయి .రెండవసర్గలో కృష్ణుని ప్రసన్నం చేసుకొని ద్వారక చేరి ,రైవతకాద్రిపై మాయా యతిగా ఉంటూ సుభద్ర సేవలు అందుకొనటం ఇద్దరి విరహవేదన ఉంటాయి .మూడులో సుభద్ర చెలికత్తె ద్వారా మాయ యతి సుభాద్రమనో వేదన అర్ధం చేసుకోవటం ,సుభద్రతో తనగుట్టు చెప్పుకొని రహస్యక్రీడలాడటం ఉన్నాయి .నాలుగవ సర్గలో బలరాముడు యతిని సేవించి సముద్ర ద్వీపం లో జరిగే శివుని ఉత్సవాలకు వెళ్ళటం ,కృష్ణుడు సుభద్రార్జునుల వివాహ ప్రయత్నం చేయటం ,బలరాముడికి కోపంవస్తే తమ్ముడు శాం౦పచేయటం,నూతనదంపతులు ఇంద్రప్రస్థం చేరటం ,ధర్మరాజు సుభద్రార్జున వివాహాన్ని ఘనంగా జరిపించటం తో ప్రబంథం ముగుస్తుంది .
ప్రార్ధన శ్లోకం –
‘’స్పురతుమే గురువరంఘ్రి నఖ ప్రభా దళిత సంతమసే హృదయా౦ తరే
ఆది కథా కరకంకణ కుండలీ క్వణిత శంకిత శంకర సంస్తుతః ‘’
ధర్మరాజు ప్రాభవం –
‘’పుమభిలాష ఫలైర్ధ్రుత మూర్తి భిశ్చతనృణా౦ చ దిశాంవిజయైరివ
సహి చతుర్భిరశోభి సహోదరైర్హరిరివో చ్చ భుజై రాతి దుస్సహై ‘’
చిత్రాంగద –
‘’ముఖ రుచి ప్రవల్లహరీ స్తన క్షితి ధర ప్రతిఘాత వివర్తితా –ఝఠయుగీ పరిత స్పురతిధృవం
భుజ యు గీతి భుజంగ శిశుభ్రువః ‘’
విజయుని విరహవేదనలోవసంతరుతు శ్లేషరామణీయకత –
‘’స్వకామ భా జ్మాధవబద్ధ సఖ్య మప్యర్జునం హంతి ముహుర్వసంతః
పలాశ వర్గస్య వికాశ హేతోః క్వజాతి హీనస్య భవేద్వివేకః ‘’
ఈశ్లోకం పండితరాజు చెప్పిన ‘’జాత్యావిహీనో నవివేక్తుమేస్టి’’శ్లోకాన్ని గుర్తుకు తెస్తు౦దన్నారు రాజుగారు
సుభద్రార్జున రహః క్రీడ –
‘’వాతాహృత నవామ్భోజ సౌరభ్యేనసహార్జునః –సుభద్రా ముఖ సౌంగంధ్య తారతమ్యం పరీక్షితే ‘’లాక్షా లక్ష్మీం దదౌ పాదే కుంతలే కుంకుమ శ్రియం –బాలతపః సుభాద్రాయాఃకర్ణే కమలపురాతం ‘’
కావ్యం చివరలో తలిదంద్రులగురించి,రాజసభలో ప్రతిజ్ఞా గురించి చెప్పుకొన్నాడు –
‘’శ్రీ యజ్ఞేశ్వర యజ్వ న స్సితకరాదాలూరి వంశాంబుధే-జ్ఞానామ్బా సుషువేయమధ్వరివరం శ్రీ సూర్య నారాయణం
తస్య శ్రీమతి లింగయ ప్రభు సభా మధ్యే ప్రతిజ్ఞా కృత –శ్రీమానేక దిన ప్రబంద సుకృతౌ సర్గశ్చ తుర్దోజని
నాడీభిర్దివసస్య నవ్యమచిరాదవ్యాహతో హాస్పదైః- శబ్డార్ధైఃప్రభు సత్య సమ్మత కదా వృత్త క్రమైర్యంత్రితం
యత్కావ్యం నిరమాయి సంప్రతి మయాతస్మిన్ హఠాత్కారతః –ప్రాప్తం దోషముపేక్ష్యకేవల గుణగ్రాహీ బుధస్తుష్యతు
స్వస్య గుణావిష్కరణ ప్రయోజనాత్స గౌరవాదపి వా-త్రింశద్ఘటిక నిబంధన సాహసతో వా సతాం ముదేస్తు మే కావ్యం ‘’
ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -2-6-19-ఉయ్యూరు
‘’
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad

