గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4
420-రాజేశ్వర విలాస మహాకావ్యకర్త –పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి (16వశతాబ్దం )
పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి రచించిన రాజేశ్వర విలాస మహాకావ్యం లో ఆచార్య బిరుదురాజు రామరాజుగారికి కేవలం 12తాళపత్రాలు మాత్రమె లభించాయని ,అందులో రెండువందల శ్లోకాలున్నాయని ,ఇది సాహిత్య శాస్త్ర గ్రంథంఅని ,ప్రతాపరుద్రీయం లాగా పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరికవి రాజేశ్వర భూపాలుని పేరుతొ రాసిన సాహిత్య శాస్త్ర గ్రంథంఅన్నారు .
కౌశిక గోత్రజుడైనకవి తండ్రి నాగలింగ సోమయాజి .కవికాలం నివాసం తెలీదు .కృతి భర్త మహాజని నాగమాంబా ,లక్ష్మీ నారాయణ అనే బ్రాహ్మణ దంపతులకు వేములవాడ రాజరాజేశ్వరుని అనుగ్రహంతో జన్మించాడు .భాగాపురవాసి .గొప్ప వంశం .గౌతమస గోత్రం .మూల పురుషుడు కీర్తిమన్నృపాలుడు బదరికాశ్రమం లో శ్రీ లక్ష్మీ నారాయణుని సేవించి వరప్రసాదంగా పుత్రుని పొందాడు .ఈయన మునిమనవడు’’ఆసాకేతము ఆకాశి’’వరకున్న రాజ్యాన్ని పాలించాడు .ఈ వంశంలో ఆరవతరం వారైన కాశీనాధ ,జగన్నాధ ,ఉమానాద సోదరత్రయం సాకేతం పాలిస్తూ ,నిజాముల్క్ తో యుద్ధం చేసి గెలిచారు .ఉమానాధుని మనవడు లక్ష్మీనారాయణ ధిల్లీ పాలకుని చేత బెంగాల్ సుబేదారుగా నియమింపబడ్డాడు ఈయనమనవాడు చంద్ర చూడుడు పాండురంగని వరప్రసాదం తో విఠల,కృష్ణ దోడారాములు అనే ముగ్గురుకోడుకులను కన్నాడు .వీరికి ఢిల్లీ రాజు మహాజనీ ,దేశముఖీ ఇచ్చాడు .బహుశా అప్పటినుంచి ఇంటిపేరులో మహాజని చేరి ఉంటుంది .విఠలుని మునిమనవడు గోపాలరాయుడు మత్సపురిఅంటే మచిలీపట్నం పాలకుడయ్యాడు .ఇతని 8మంది సంతానం లో రెండవాడు లక్ష్మీనారాయణ స్తంభాద్రి అంటే ఖమ్మం మెట్టు అనగా ఖమ్మం ను జయించాడు .ఇతనికి నాగాంబ వెంకమాంబ ,రాజేశ్వరుడు సంతానం .ఈ రాజేశ్వరుడే వేములవాడ రాజరాజేశ్వర స్వామి వరప్రసాది .ఈయన పేరుతోనే ‘’రాజేశ్వర విలాస కావ్యం ‘’రాశాడు కవి పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి .రాజేశ్వరుడు భాగాపురం అంటే భాగ్యనగర నివాసి .కృతి కర్త, భర్త ఇద్దరూ సమకాలికులేకనుక కాలం 16వ శతాబ్దం అయి ఉంటుంది .
వంశావళి చివరలో కవి –
‘’బాలన్యగ్రోధ వంశోత్తమ విమలయో రాశిరాకాశశాం కః-సంపూర్ణ బ్రహ్మ తేజః స్పుట ముఖ కములోల్లాస విద్యా మరందః
నాగార్యో యన్య సాక్షా త్కృత నగతనయా కాంత మూర్తిఃపితాసీ –దేనం శ్రీ వేంకటార్యం ప్రమదయతుముదా సాదు కారుణ్యవాదః ‘’
‘’ఇతి కౌశిక గోత్ర బాలన్యగ్రోధ కుల కలశాబ్ది సుధాకర శ్రీనాగలింగ సోమయాజి తనూభవ ‘’శ్రీ వేంకటపతి సూరి విరచితే రాజేశ్వర విలాసే మహాకావ్యే వంశావాళీప్రకరణం నామ ప్రధమోమ్కః ‘’నాటకం లోని అంకంలాగా మొదటి అంకం అనటం ఆశ్చర్యం .మిగత రెండిటిని నాయక ప్రకరణం అని ,అలంకార ప్రకరణం అనీ అన్నాడు .
నిజాముల్కును ఓడించిన సోదరత్రయం పై శ్లోకం –
‘’శూరాస్సాహసికా స్త్రయస్సమధిక ప్రావీణ్యవంతో ధను –ర్విద్యాయాంగజవాజి రాజి రథసంపత్తి ప్రసేనాశతాః
సాకేతే నగరే వినోదనకదాలాపై నిశాయాపనం –కుర్వంతః పరిపాలయంతి విషయానర్ధ్యా దితేయద్రుమః ‘’
‘’తదన్తరే తన్న్రుపవీర దేశానాక్రామ్య దోర్దండ జితారి వర్గాః –మ్లేచ్ఛానిజాముల్కు మఖా ప్రసైన్య యుతాబబందు ర్నగరం చ తేషాం’’
ఢిల్లీ శ్వరుడిచ్చిన ‘’దేశముఖి గురించిన శ్లోకం –
‘’నృపాస్త్రుయంతే బహుభాగ్యవంతః అనేకమాతంగ రాదాశ్వవంతః –తత్రైవ ఢిల్లీనగరాదినాదాత్ మహాజనీ ,దేశముఖత్వ మాపుః
మచిలీ బందరును పాలించిన గోపాల రాయని పై శ్లోకం –
‘’శ్రీ గోపాల మహేపతిః కులకరోదాంత స్తపస్వీ వరం –ధర్మాత్మామిత విక్రమో ద్విజకులాలంకార రూపోపి సః
శ్రీమాన్ మత్స్యపురేవారిచ నివసన్ తద్రాజ్య కార్యస్యవై –తత్రస్థాన్విషయా న్వశాద్రఘుపతీ రంయానివాలాపయత్ .
ఉపమాలంకారం –
‘’శ్రీ రాజరాజేశ్వర భూపతి కంఠీరవమంగ జోపమాత్మానన్ – సంరక్షిత భూపాలం రక్షతు లక్ష్మీపతిః పరగ్హ్నం తమ్ ‘’
అపహ్నుతి అలంకారం-
‘’శుద్దాపహ్నుతి రాన్యారపార్దో ధర్మ నిహ్నవో యత్ర –నామీ సురాజ నృపతే స్సుగుణాః కిం తర్హి రత్నజాలాని ‘’
సయుక్తికో యత్ర కా ధర్మ నిహ్నవో బుధా స్తమాహుః కిల హేత్వవహ్నవం –
అయం న చేందుఃకమలనుమోదకో హరి –ర్నసౌమ్య స్సహి చక్రపాలకః ‘’
ధీరోదాత్త నాయక లక్షణాలు చెప్పే శ్లోకాలలో చాలా శిధిలాలని ,9శ్లోకాలు ఒక దీర్ఘగద్యం మాత్రమె ఉన్నాయని రాజుగారువాచ
(బిరుదురాజువారి ఈ వ్యాసం వేములవాడ రాజరాజేశ్వర సంస్కృత కళాశాల వార్షిక సంచిక -1981-82లో ప్రచురితం )
ఆధారం –ఆచార్య బిరుదురాజు గారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు
ఇంతటితో ఆచార్య బిరుడదురాజురామరాజు వారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు ‘’లో సంస్కృత కవులు సమాప్తం .
సశేషం
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -3-6-19-ఉయ్యూరు

