ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు
26-ప్రోపిలిన్ గ్లైకాల్ తయారు చేసిన కెమికల్ ఇంజనీర్ –దాసరి మోహన ప్రసాద్
1980లో విశాఖలో జన్మించిన దాసరి మోహన ప్రసాద్ ఆంధ్రా యూనివర్సిటి నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రులై ,అమెరికా వెళ్లి కెమికల్ ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పిహెచ్ డి అయ్యాడు .ఆహోరాత్రాలుగా మూడున్నర ఏళ్ళు పరిశోధన చేసి నూతన ఆవిష్కరణలు చేశాడు .
అందులో ముఖ్యమైనది గ్లిజరిన్ నుంచి ప్రోపిలిన్ గ్లైకాల్ తయారు చేసే ప్రక్రియ ముఖ్యమైనది దీనితో ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్తల సరసన చేరాడు .అమెరికాలో గ్లిజరిన్ ఉత్పత్తి అత్యధికంగా ఉన్నా వాడకం బాగా తక్కువై నిల్వలు ఎక్కువైపోయాయి .ఆయన దృష్టి దీనిపై పడి,పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా గ్లిజరిన్ నుంచి ప్రోపిలిన్ గ్లైకాల్ తయారు చేసి తర్వాత భారీ గా ఉత్పత్తికి తోడ్పడ్డాడు .దీని కెమికల్ ఫార్ముల – C3H8O2 అమెరికా ప్రభుత్వం ఈ ఆవిష్కరణకు దాసరి పసాద్ గారికి పలురకాల అవార్డ్ లు రివార్డ్ లు అందించి గౌరవింఛి పేటెంట్ ను మంజూరు చేసింది .
దాసరి సాధించిన ప్రోపిలిన్ గ్లైకాల్ కు అమెరికాలోనే కాక అనేక దేశాలలో గొప్ప డిమాండ్ ఉంది .విమాన పైభాగాలపై మంచు పేరుకు పోకుండా అప్పటిదాకా ఇథలిన్ గ్లైకాల్ వాడేవారు .కాని ఇందులో పర్యావరణానికి హానికలిగించే విషపదార్దాలున్నట్లు గుర్తించారు .దాసరిప్రసాద్ తయారు చేసిన ప్రోపిలిన్ గ్లైకాల్ లో విషపదార్ధాలు లేకపోవటంతో ఇప్పడు దీనినే వాడుతూ పర్యావరణ రక్షణ కల్పిస్తున్నారు .అంతే కాక ఇది జీవ సంబంధ ఉత్పత్తి .సోయాబీన్ ఆయిల్ ను దీనికి ఉపయోగిస్తున్నారు అంటే ఆర్గానిక్ ప్రొడక్షన్ కనుక ఏ ఇబ్బందులు ఉండవు .దాసరి మేధా శక్తిని గుర్తించి ‘’ది ప్రేసి డేన్షియల్ గ్రీన్ కెమిస్ట్రి అవార్డ్ ‘’అందజేశారు.
ప్రోపిలిన్ గ్లైకాల్ ను వాహనాల బ్రేక్ ఫ్లూయిడ్ లలో ,సౌందర్య సాధనాలలో ,ఆహార ఉత్పత్తులలో ,లిక్విడ్ సోప్ తయారీలోకూడా వాడుతున్నారు .శీతలీకరణాన్ని (ఫ్రీజింగ్ )నివారించటానికి’’ యాంటి ఫ్రీజర్ ‘’గా భారీ ఎత్తున ఉపయోగిస్తున్నారు .అనేక రకాల పోలిమేర్స్ తయారీలో ,బిల్డింగ్ మెటీరియల్స్ లో ,లేజర్ ప్రింటింగ్ లో టోనర్ గా ,ఫార్మకాలజిలో ,చర్మవ్యాదులకుపయోగించే ఆయింట్ మెంట్ లలో ఎక్కువగా ప్రోపిలిన్ గ్లైకాల్ వాడకం ఉన్నది .. ఆధారం –శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-19-ఉయ్యూరు

