గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం
531-బోధి చర్య వార్తారహ కర్త –ప్రఫుల్ గాడ్పాల్(1981)
3-6-1981 లో ఉమేరిలో పుట్టిన ప్రఫుల్ గాడ్పాల్ సంస్కృత పిహెచ్ డి .న్యు ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో ప్రొఫెసర్ . బోధి చర్య వార్తారహ,యూనివర్సల్ మెస్సేజ్ ఆఫ్ బుద్ధిష్ట్ ట్రడిషన్ ,బృహర్నీతి శతకం రాశాడు
532-వేదిక సాహిత్య పరిచయిక కర్త –భావ ప్రకాష్ గాంధి (1982)
వేదిక సాహిత్య పరిచయిక రాసిన భావ ప్రకాష్ గాంధి 6-1-1982 గుజరాత్ లో పుట్టి సంస్కృతం లో శాస్త్రి అయి , జునాగడ్ లోని శ్రీ సోమనాథ్ సంస్కృత యూనివర్సిటి ప్రొఫెసర్ .శుభాషిత పీయూషం అనే మరో పుస్తకం కూడా రాశాడు .
533-చార్వాక దర్శన కర్త –హేమంత కుమార్ గంగూలీ (1914)
1-2-1914 న బారిసాల్ లో జన్మించిన హేమంత కుమార్ గంగూలీ కావ్యతీర్ధ ,సాంఖ్య తీర్ధ.జాదవ్ పూర్ యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ . చార్వాక దర్శన,సమాజ సాహిత్య ఓదర్శన,వైదిక ధర్మ ఓమీమాంస దర్శన ,ఫిలాసఫీ ఆఫ్ లాజికల్ కన్స్ట్రక్షన్ –గాడ్-రీజన్ అండ్ రెలిజియన్ వంటి 6పుస్తకాలు రాశాడు .
534-భారత దర్శనం కర్త –గరికపాటి లక్ష్మీ కాంతం (20వ శతాబ్దం )
హైదరాబాద్ నిజాం మహావిద్యాలయ తెలుగు హెడ్ గరికపాటి లక్ష్మీకాంతం 12పుస్తకాలు రాశాడు. అందులో భారత దర్శనం,భవ్యభారతం , విశ్వకవి,కీర సందేశం ,భారతరత్నం ఉన్నాయి .
535-సంస్కృత ఆయుర్వేద సుధ కర్త –భన్వారిలాల్ గౌడ్ (1946)
ఔషధ ఆచార్య ,ఆయుర్వేద బృహస్పతి భాన్వారి లాల్ గౌడ్ 17-3-46 జైపూర్ లో పుట్టాడు .జర్మన్ భాషలో డిప్లొమా, పిహెచ్ డి.రాజస్థాన్ ఆయుర్వేద యూని వర్సిటి వైస్ చాన్సలర్ .పండిట్ వ్రజ్ మోహన్ శాస్త్రి , వైద్యారాం కృష్ణ ల శిష్యుడు .16గ్రంథాలు రాశాడు -వాటిలో ఆయుర్వేద శబ్ద బోధ ,అష్టాంగ హృదయం ,సంస్కృత ఆయుర్వేద సుధ,ఆయుర్వేద చికిత్స విజ్ఞానం ,పదార్ధ విజ్ఞాన పరిచయం ఉన్నాయి .ఇంగ్లాండ్ ఫెలోషిప్ పొందాడు. శ్రీలంక ,సౌతాఫ్రికా పర్యటన చేశాడు .ప్రజ్ఞాపురస్కారం ,ఇషేర్ పురస్కారం ,ఆదర్శ ఆయుర్వేద శిక్షా పురస్కారం పొందాడు .
536-అగ్నిజా కర్త –బిషన్ లాల్ గౌడ్ –(1936)
వ్యాకరణ ఆచార్య బిషన్ లాల్ గౌడ్3-1-1936యుపి-ముర్దాబాద్ జిల్లా లక్ష్మణ్ పూర్ లో పుట్టాడు .సాహిబాబాద్ లో లెక్చరర్ .అగ్నిజా ,అహం రాస్త్రి పుస్తకాలు రాశాడు .
537-అభినవ శరీరం కర్త –దామోదర్ శర్మ గౌడ్ (20శతాబ్దం )
20శతాబ్ది దామోదర్ శర్మ గౌడ్ శ్రీ వైద్యనాధ ఆయుర్వేద భవన్ డాక్టర్ .అభినవ శరీరం అనే ఒకే ఒక పుస్తకం రాశాడు .
538-ముక్తావళి టీకా కర్త –జ్వాలాప్రసాద్ గౌడ్ (20వ శతాబ్ది )
20వ శతాబ్దికి చెందిన జ్వాలాప్రసాద్ గౌడ్ ముక్తావళి టీకా, సత్ ప్రతిపక్ష,స్వయభిచార రచించాడు .
539-మహాకవి భాస ద్వారా ప్రణీత ప్రతిమా సాహిత్య అధ్యయనం కర్త –లలితకుమార్ గౌర్ (1962)
హిందీ ,సంస్కృత ఎం .ఏ .,సాహిత్య ఆచార్య లలితకుమార్ గౌర్ 1-1-1962 బులంద సహార్ లోపుట్టి ,కురుక్షేత్ర యూనివర్సిటిలో సంస్కృత ,పాళీ భాషలలో ప్రొఫెసర్ చేశాడు .ఆచార్య ప్రభు దత్త శర్మ ,డా.రాం కిషోర్ శర్మ ల శిష్యుడు .మూడు పుస్తకాలు రాశాడు .అందులో పై పుస్తకం ఒకటి .రాధాకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ అవార్డ్ గ్రహీత.
540- ఘుర్మే సంతు శివాలయే కర్త –నందకిషోర్ గౌతమ్ (1936)
1936జనవరి 6 న రాజస్థాన్ మధోపూర్ జిల్లా శివార్ గ్రామం లో నంద కిషోర్ గౌతమ్ జన్మించాడు . సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్ .5పుస్తకాలు రాశాడు .ఘుర్మే సంతు శివాలయే ,ఘుస్మేశ్వర పద్య కథా,ప్రతి శృతి ,యౌతుక నర్తనం ,సంస్కృత నిబంధ పారిజాతం రాశాడు .చాలా సంస్కృత కవి సమ్మేళ నాలలో పాల్గొని ప్రైజులు పొందాడు .సంస్కృత మేగజైన్ స్వర్ణమంగళ భారతి మొదలైన పత్రికలలో ఎన్నో వ్యాసాలూ రాశాడు .రేడియో టివిలలో కవితలు కథలు రాసి ప్రసారం చేశాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-3-20-ఉయ్యూరు

