గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4
621-శివ ధర్మ మహా శాస్త్రం కర్త –ధనీంద్ర కుమార్ ఝా (1963)
ఆచార్య ,విద్యా వారిది ధనీంద్ర కుమార్ ఝా 1963 లో జూన్ 11న ముజఫర్పూర్ లో జన్మించాడు .లక్నో RSKS లో సంస్కృత ప్రొఫెసర్ .గురుపరంపర లో ఆచార్య పారస్ నాథ ద్వివేది ,ఆచార్య రమ్యతన శుక్ల ,పండిట్ రాం ప్రసాద్ త్రిపాఠీ ,పండిట్ రఘునాథ శర్మ ఉన్నారు .డా నరేంద్రకుమార్ ,డా ధనుంజయ శుక్లా వద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .శివ ధర్మ మహా శాస్త్రం ,పరాశర సంహిత రాశాడు
622-జ్యోతిర్విజ్ఞానస్య ప్రాసంగికత కర్త –దిలీప్ కుమార్ ఝా (1966)
ధర్మ శాస్త్ర ఘంటా ,ఫలిత జోశ్య సాహితి ఆచార్య దిలీప్ కుమార్ ఝా 26-10-1966న దర్భంగా లో పుట్టి ,దర్భంగా KSDSయూనివర్సిటి ప్రొఫెసర్ చేశాడు .లక్ష్మీ నాథ ఝా ,బ్రజ కిషోర్ ఝా ,ప్రొఫెసర్ శివ కుమార్ ఝా ప్రొఫెసర్ రామ చంద్ర ఝాల శిష్యుడు .కార్తీక్ కుమార్ ,బ్రిజేష్ కుమార్ ఝా ,గోవింద ఝా లవద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు . జ్యోతిర్విజ్ఞానస్య ప్రాసంగికత రాశాడు .
623-ఖద్యోత టీకా కర్త –గంగా నాద ఝా (1871-1941)
అలహాబాద్ యూని వర్సిటి వైస్ చాన్సలర్ గంగానాథ ఝా 1871లో పుట్టి 1941లో చనిపోయాడు. ఖద్యోత టీకా ,మండన మిశ్రుని రచనకు మీమంసాను క్రమణిక రాశాడు .సంస్కృత ఆంగ్లా లలో విశేష ఖ్యాతి పొందాడు .
624-మైధిలీ భాషా వికాస కర్త –గోవింద ఝా (1923)
వ్యాకరణ ,సాహిత్య ఆచార్యుడు 49గ్రంథాల రచయిత గోవింద ఝా 1923లో అక్టోబర్ 10 న మధుబని లో పుట్టాడు. బీహార్ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్.గురు దీనబంధు ఝా శిష్యుడు .మిధిలా –ఇంగ్లిష్ నిఘంటువు కల్యాణికోశ ,మైధిలి భాషా కా వికాస్ మొదలైనవి రచించాడు సాహిత్య అకాడెమీ అవార్డ్ ,కామిల్ బుల్కా అవార్డ్ గ్రహీత. ఈయన పై డాక్యుమెంటరి తీశారు.
625-జ్యోతిస్సౌరభం కర్త –హన్స ధర ఝా (1963)
గణిత ,ఫలిత జోస్యధర్మ శాస్త్ర ,పురాణ ఆచార్య హన్స ధర ఝా 5-10-1963న బీహార్ మధుబని లో పుట్టాడు .భోపాల్ సంస్కృత సంస్థాన్ సంస్కృత ప్రొఫెసర్ .గురుపరంపర –శ్రీ యదు వీరఝా ,పండిట్ శ్రీరామావతార్ మిశ్రా ,ప్రొఫెసర్ రామ చంద్ర ఝా ,ప్రొఫెసర్ శివకాంత్ ఝా ,ప్రొఫెసర్ రాధా కాంత ఠాకూర్,లు. ప్రత్యెక శిక్షణ ను విద్యానాథ మిశ్రా ,డా.రాం కుమార్ కౌల్ ,డా.సుమన్ కుమార్ ,డా అద్వేష్ కుమార్ శ్రోత్రియ లవద్ద పొందాడు .జ్యోతిస్సౌరభం ,గోల పరిభాష ,త్రిస్కంద జ్యోతిషం రాశాడు . ధర్మ శాస్త్రం, పురాణాలలో లో మహా విద్వాంసుడు .
626-జ్ఞాన సంహిత కర్త –హరేంద్ర కిషోర్ ఝా (1956)
1-5-1956 న హర్పూర్కల లో పుట్టిన హరేంద్ర కిషోర్ ఝా ఎం.ఏ.పిహెచ్ డి.BS రాం సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ చేశాడు జ్ఞాన సంహిత ఒకే ఒక పుస్తకం రాశాడు .
627-సంవిత్స్వ తంత్ర కర్త –కమలేశ్ ఝా (1960)
శంకర వేదాంత, శైవ ఆగమ ,నవ్య న్యాయ ,జైన దర్శన ఆచార్య కమలేశ్ ఝా 4-6-1960న బీహార్ సమస్తిపూర్ లో పుట్టాడు .బెనారస్ హిందూ యూనివర్సిటి లో ధర్మాగమ ప్రొఫెసర్ .7గ్రంథాలు రాశాడు .వీటిలో సంవిత్స్వ తంత్ర,శైవ తత్వ విమర్శ ,ఆగమ సంవిద , పూర్ణతా ప్రత్యాభిజ్న ఉన్నాయి .స్కాట్ లాండ్ సందర్శించాడు
628-ధర్మస్య మూలం అర్ధ కర్త –ఖగేష్ ఝా (1942)
1942 జనవరి 2న మధుబనిలో పుట్టిన ఖగేష్ ఝా ,వైశాలి RPSకాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యాడు .రమేష్ ఝా ,రామానంద ఝా ,పండిట్ రాం దేవ్ ఝా ,పండిట్ ఉదయకాంత్ ఝా ,పండిట్ మహేష్ ఝా ల శిష్యుడు .పండిట్ ఆత్మానంద శర్మ ,పండిట్ ప్రమణానంద ఝా,పండిట్ రాజెంద్ర ఝా ,పండిట్ భగలుఝా లవద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .రాసిన 4పుస్తకాలలో –ధర్మస్య మూలం అర్ధ ,సురభారతి ,ప్రబంధావళి ఉన్నాయి .
629-గూడార్ధ తత్వాలోక కర్త –కీర్త్యానంద ఝా (1934)
కీర్త్యానంద ఝా 1934బీహార్ దర్భా౦గా జిల్లా జరిసో లో పుట్టాడు .అసిస్టెంట్ ప్రొఫెసర్ గురుపరంపర –పండిట్ అచ్యుతానంద ఝా ,,పండిట్ హరి రాం శుక్లా ఉన్నారు. గూడార్ధ తత్వాలోక అనే ఏకైక పుస్తకం రాశాడు .
630-న్యాయ శాస్త్రాను శీలనం కర్త –కిషోర్ నాద ఝా (1940)
52ఉద్గ్రంధాలు రాస్సిన కిషోర్ నాధ ఝా వ్యాకరణ,సాహిత్య ఆచార్య .న్యాయ వైశేషిక౦లొ ఎం ఏ .10-6-1940న యుపిలో పుట్టాడు .అలహాబాద్ గంగానాథ ఝా సంస్కృత కాలేజిలో రీడర్ చేసి రిటైరయ్యాడు .డిలిట్.గురుపరంపరలో మధుసూదన మిశ్రా ,దీనబంధు ఝా ,చంద్రమాధవ ఝా ఉన్నారు .ఉత్తరరామ చరితానికి సంస్కృత హిందీ వ్యాఖ్యానం ,న్యాయ శాస్త్రీ ఈశ్వరవాద ,న్యాయ దృశ్యాత్మాను చింతనం ,న్యాయ సూత్రణం పాహ విమర్శ ,న్యాయ శాస్త్రాను శీలనం మొదలైనవి రాశాడు .ప్రెసిడెంట్ అవార్డీ.
సశేషం
మహాశివరాత్రి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-3-21-ఉయ్యూరు

