మధ్య పశ్చిమం లో వేదాంతం -2
స్వామీజీ అడుగు జాడలలో
వివేకానందస్వామి యువ శిష్యుడు స్వామి పరమానంద ,గురు అడుగుజాడలలో మధ్య పశ్చిమం లో వేదాంత భావ వ్యాప్తి చేశారు .లభించిన ఆధారాలను బట్టి ఆయన మధ్య పశ్చిమం లో చాలాసిటీలు సందర్శి౦చారు.20వ శతాబ్ది మొదటి దశకాలలో లూస్ విల్ ,సిన్సినాటి ,సెయింట్ లూయిస్ లు ముఖ్య సంస్కృతీ కేంద్రాలు .భావ వినిమయ౦,సంస్కృతీ అవగాహనలు జరిగాయి .ఈ మూడు సిటీలు ఈస్ట్ కోస్ట్ లోని లాస్ ఏంజెల్స్ ,సాన్ ఫ్రాన్సిస్కో లు తూర్పు తీరం లోని బోస్టన్ ,న్యు యార్క్ లతో సంబంధం కలిగి ఉన్నాయి .మధ్య పశ్చిమ సిటీలలో వేదాంత భావ అన్వేషణ ,ప్రభావాలు హెచ్చు .వీటి వలన అమెరికా అంతా వేదాంత భావ పరిమళం వ్యాపించింది .
మిడ్వెస్ట్ లో స్వామీజీ లెక్చర్ టూర్ చేసి నట్లు ఉంది .ఈ లెక్చర్ టూర్ లో స్వామీజీకి ,శ్రోతలకు మధ్య జరిగిన ఇంటరాక్షన్ అంటే పరస్పరచర్యల గురించి సమాచారం లభించలేదు .వివేకానంద భావ వ్యాప్తి ని స్వామి పరమానంద నిరంతర కృషి తో ఎక్కువ మందికి చేరేట్లు చేశారు. స్వామీజీ కృషి కి పరమానంద అంకురార్పణ చేశారన్నమాట .కనుక వేదాంతం ఏవో కొన్ని ముఖ్యనగారాలకు సిటీలకే పరిమితం కాలేదని అర్ధమౌతోంది.మిడ్ వెస్ట్ లో పరమానంద ప్రసంగాలను పత్రికలూ విస్తృతంగానే ప్రచారం చేశాయి .ధనాత్మకంగానే స్పందించాయి .సుమారు వందేళ్ళ నాటి ఆ స్పందనలు ఇవాళ చదువుతూ ఉంటె సంతోషం కలిగిస్తాయి .లూస్ విల్ ఆలోచనలకు ప్రతిబి౦బమైన’’ కొరియర్ జర్నల్ ‘’పత్రిక ‘’పరమానంద రాగి శరీర కాంతి ,కళ్ళు బాదం కాయ ఆకారం ఆకర్షణీయం .మధ్య వయస్కుడు అని అందరు అంటున్నా ,ఆయన వయసు 22కు మించి ఉండదు ‘’అని 14-11-1920 పత్రికలో రాసింది .ప్రజలు తమ ఆరోగ్య ,సంతోషాలకు ఆధ్యాత్మిక అనుసరణలు ముఖ్యం అని గ్రహించారు .యోగ ,వేదాంత విషయాలు ప్రకటనలుగా పత్రికలలో ప్రచురించేవారు .వయసు మీరుతున్నవారికి వేదాంతం గొప్పపరిష్కారం అన్నస్వామి పరమానంద భావానికి అడ్వర్ టైజ్ మెంట్ కనిపించింది .యువ పరామానంద’’ చారిస్మా’’(కరిష్మా) లూస్ విల్ మొదలైనసిటీలలో విపరీతమైన ప్రభావం చూపించింది .ప్రజలలో వివేకానంద ఆయన యువ శిష్యుడు స్వామి పరమానంద గార్ల ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది .
మధ్య పశ్చిమం లోవేదాంత వ్యాప్తి
పరమానంద లెక్చర్ టూర్ లలో విరామం లేని బిజీ షెడ్యూల్ ఉండేది .అక్కడ ఉన్న కాలం లో ఆయన అనేక సార్లు మిడ్ వెస్ట్ సిటీలు సందర్శించి వేదాంత బోధ ,ప్రచారం ,అనుసరణీయమైన క్రియా విధానం తో రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభ సమయం 1939వరకు ఉత్తేజితులను చేశారు.1932 నాటికి ఆయన కార్యం సువ్యవస్థితమైంది .కారణంగా అనేక మధ్య పశ్చిమ సిటీలలో వేదాంత కేంద్రాలు వెలిశాయి .ఇవన్నీ స్వామి పరమానంద కృషి ,స్వామి వివేకానంద పై ఉన్న అచంచల విశ్వాసం వలన ఏర్పడినవే .స్థానిక లైబ్రరీలలో ,ముఖ్య ప్రదేశాలలో,దేవాలయాలలో ,విద్యాసంస్థలలో ,స్త్రీ ,పురుషుల క్లబ్ లలో పరమానందస్వామిని ఆహ్వానించి ప్రసంగాలు చేయించేవి ఈ వేదాంత కేంద్రాలు .ఈ క్లబ్బులు, సొసైటీలు సాంఘిక సమావేశాలకు ,భావ వినిమయానికి ,సమాజ బంధాలకు నూతన దృక్పధాలకు గొప్ప అవకాశాలను కల్పించాయి. ఈ సంస్థలలోపరమానంద విస్తృతమైన విషయాలతో పాటు వేదాంత ప్రసంగాలు చేసేవారు .ఈ సభలలో కనీసం 100 నుంచి 250వరకు శ్రోతలు ఉండేవారు .అమెరికా పరిస్థితులపైనా ,ప్రాచ్య భావాలపైనా ,మిడ్ వెస్ట్ లోని ప్రత్యెక విషయాలపైన ఉపన్యాస విషయాలు తప్పని సరిగా ఉండేవి .
ఈ మీటింగ్ లు ఏర్పాటుచేయటం లో ముఖ్య ఉద్దేశ్యాలు ప్రజలలో సామాజిక స్పృహతో పాటు ఆధ్యాత్మిక వివేచన కల్గించటమే .వివేకాన౦దస్వామివేదాంత భావనలకు పునాదులు వేసి అనేకులను ప్రభావితం చేసిన ఆకాలం లో అంటే 1994లో జాక్సన్ లో హిందూయిజం పై ,ఆసక్తి ఉండటం చిన్న నగరాలలో అసాధారణమే . పరమానంద వారిలో విస్తృతమైన మానవ విలువలను ,జాతీయ సమైక్యతను పాదుకొల్పారు.వేదాంతం లోని ముఖ్య విషయాలను ,వివేకాన౦దుని ప్రవచన అమృతభావాలతో మేళవించి స్వామి పరమానంద విజయవంతంగా తన ధర్మాన్ని నెరవేర్చారు .వివేకానందుని లాగానే స్వామి పరమానంద ‘’దైవం సకల మానవాళి కి చెందిన సంపద ‘’అని ఎలుగెత్తి చాటారు .ఎవరి మత ధర్మాలను వారు పాటిస్తూనే ,ఎవరికి వారు తమ మార్గాన్ని ఏర్పాటు చేసుకొవాలనిఉద్బొధి౦చారు .విభిన్నమతాలను అంగీకరిస్తూ ,పరస్పర విశ్వాసం ప్రాతిపదికపై అభివృద్ధి సాగాలని అభిలషించారు .వివేకానందునిలాగానే పరమానంద కూడా జనసామాన్యం తోపాటు కవులతో, రచయితలతో ప్రచురణ కర్తలతో, జర్నలిస్ట్ లతో, రాజకీయ నాయకులతో తరచుగా సమావేశమయ్యేవారు .ఈ గురు-శిష్య సంబంధం వారి ప్రభావం వేదాంతం ,యోగా లపై మిడ్ వెస్ట్ లో ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకోవటానికి మనం లూస్ విల్ లో జరిగిన అద్భుతాన్ని గురించి తెలుసుకోవాలి .ఆ వివరాలు రేపు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-21-ఉయ్యూరు

