శాంతి వైపు లోతైన అన్వేషణ
‘’చరిత్ర ప్రాచీనం ,మధ్యయుగం ,ఆధునికం అనే విభజన గణనీయం కాదు ‘’అని అనుకున్నతర్వాత,మనం అటామిక్ కాలంకు ముందు ,ఆ తర్వాత అనే మాట్లాడుకోవాలి .కొత్త చారిత్రాతమకమైనరేఖనుగీసుకోవాలి’’అని ‘’ఫిలాసఫీ ఆఫ్ పీస్’’అనే తన పుస్తకం లో ప్రారంభవాక్యాలుగా జాన్ సోమర్ విల్లీ రాశాడు .ఇది హీరోషీమా దురంతం తర్వాత నాలుగేళ్ళకు ప్రచురితమైంది.
ఈ నాటి మన తరం 6-8-1945 తేదీని మానవ చరిత్రలో విభజన రేఖగా భావి౦చాల్సిందే .ఇక్కడ క్రీపూ క్రీస్తు తర్వాత అనే ప్రశ్న కూడా రాదు .దీనితో మానవ దృక్పధమే పూర్తిగా మారిపోతుంది .దీనికి ముందు ఆర్ధర్ కోస్ట్లర్ ఇలాంటి కేలండర్ నే ప్రతిపాది౦చాడుకానీ ,దాన్ని ఎవరూ లెక్కలోకి తీసుకోలేదు .
1945 ఆగస్ట్ 6 విషయం ఇంకా గర్భస్తంగానే,చీకటిలోనే ఉంది.ఈ జననకాలం సాధారణమే కానీ హైటెక్ డెలివరి కాదు .హీరోషీమా లో బతికి బయటపడ్డ వారిని సర్వే చేసిన రాబర్ట్ లిఫ్టన్ చెప్పిన దాన్ని బట్టి ‘’హిబాకుశా ‘’అనేకసార్లు జరిగి దాని స్కేల్ ఎంతో ఖచ్చితంగా చెప్పలేక పోతున్నామని అన్నాడు .హిబా కుశ అంటే చావులో కూరుకు పోయినవారు అంటే ప్రేలుడు బారిన పడిన వారన్నమాట .ఇవాళ మనం మెటా ఫిజికల్ గా ,సైకలాజికల్ గా ,ఎమోషనల్ గా ఆ ప్రేలుడు బాదితులమే .అంటే తీవ్రంగా ఆలోచిస్తే,మనమంతాఒక రకం గా ‘’హిబా కుశ ‘’లమే అన్నమాట .
జూయిష్ హోలోకాస్ట్ పై 9గంటల ఎపిక్ సినిమా నిర్మించిన క్లాండి లాంజ్ మాన్ ‘’వారికి ఏదైనా న్యాయం జరిగే పని చేయాలనుకొంటే ముందుగా క్రానాలజి విచ్చిన్నం ముఖ్య విధి గా చేబట్టాలి ‘’అన్నాడు .జూఇష్ హోలోకాస్ట్ లో జరిగిన మానవ హననం పరిణామ౦ మిలియన్ హీరోషీమాకంటే ఎక్కువ అంటాడు .అంతకు ముందు ఉన్నదానికి ,అల్ట్రా డేడ్ వెస్టర్న్ సైక్ ,అంటే వెస్టర్న్ వే ఆఫ్ ఆలోచన కు ఎంతతేడా ఉందొ అర్ధమౌతుంది .
ఇతర సంస్కృతులతో పోల్చి చూస్తె ,బాగా కొట్టవచ్చి నట్లు కనిపించే మన సంస్కృతి ఎంత తీవ్రమైన జబ్బుతో వణికికపోయిందో,మనం భావించే సంప్రదాయ కాలం ఎంతగా విచ్చిన్నమైపోయిందో గమనిస్తాం .ఎంతగా కాలం చేత లొంగ దీయబడ్డామో ,ఎంతగా కిందికి కు౦గి పోబడినామో ,,అణగదొక్కబడ్డామో ,అంచులు కత్తిరింప బడ్డామో తెలిసింది .ఇదంతా మనకు ఇష్టంలేని అవసరం లేని మనపై రుద్ద బడినవే. మన ప్రమేయం లేకుండా మనల్ని బాధించినవే .వాటి నుంచి ఖచ్చితంగా బతకాలనే ,తప్పించుకొనిపారిపోవాలని భావి౦చినవే ..ఖచ్చితంగా ఏ సంస్కృతీ కూడా ఇలాగ ‘’కాల హననం ‘’అంటే ‘’ కిల్లింగ్ టైం’’గురించి ఇంతవరకు ఆలోచి౦చనే లేదు.మనకే పట్టింది ఈదుర్గతి .మన తాత్కాలిక ఆలోచనలు ,దృశ్యాలు చిత్రాలు క్షీణత ,వినాశనం ,చావు లపైనే ఉంది కానీ ,అంతకన్నాకాలం పై సృజనాత్మకం గా ,నివారణోపాయ విధానాలపై ఆలోచన లేక పోవటం దురదృష్టం .పాపిష్టి అస్తిపంజరపు ఆకార రూపమైన ‘’పాత తండ్రి’’(ఓల్డ్ ఫాదర్ టైం) కాలం పైనే ఆధారపడుతున్నాం .చంకలో పిల్లాడిని పెట్టుకొన్న ‘’యువ తల్లి కాలం’’(యంగ్ మదర్ టైం) పై ఆలోచన లేదు మనకు . తర్వాతికాలం కూడాకాలానికి చావుకు ఉన్న సంబంధం లాగా అంతే యదార్ధం .
ఆధునికకాలంలో ఉన్న సమస్యేమిటి అంటే మన౦ కొత్త మిత్ ,చిత్రాలను చిగురింప చేయలేక పోవటం .రస్సెల్ హోబాన్ అన్నట్లు మన౦ ‘’మీధో పయిక్ అవగాహన లో తప్పిపోవటమే .గతించింది వదిలి కొత్త ఆలోచన అవగహన లతో ముందుకు దూసుకు వెళ్ళక పొతే వెనుకబడి పోతాం అన్నస్పృహ అవసరం .సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి అనువైన పరిష్కారం సాధించటం మానవ నైజం .బెంబేలు పడకూడదు. ధైర్యం కూడ దీసుకోవాలి .కొత్త చరిత్ర సృష్టించాలి .ముందుగా ఆ బాంబ్ పై అవగాహన పొందాలి .అది మనందరి శత్రువు అన్న భావన గాఢంగా మనమనసులలో నాటుకోవాలి. అప్పుడే ముందుకు అడుగు వేయగలం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-9-21-ఉయ్యూరు

