రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -1
అ నే పద్యకావ్యాన్ని బ్రాహ్మశ్రీ తాతా సుబ్బారాయుడు శాస్త్రి గారి షష్టి పూర్తిమహోత్సవం నాడు వారి శిష్యులు గురువుగారి పాదపద్మాలకు సమర్పణగా ,ముద్రించినట్లు ఆసంఘ కార్యదర్శి శ్రీ వాసా అన్నప్ప శాస్త్రి గారు 20-4-1935 న తెలిపారు .ఈ కావ్య రచనకు ప్రోత్సాహం శాస్త్రి గారి ప్రధమ శిష్యులు పిఠాపురం సంస్థాన విద్వాంసులు బ్రహ్మశ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రిగారు ,.ప్రశిష్యులు , విద్యా ప్రపితామహులు బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు కావ్య కర్త ..ఈ కావ్యాన్ని ఖర్చులన్నీ తామే భరించి మద్రాస్ లోని వావిళ్ళ ప్రెస్ అధినేత ,ఆర్ష విద్యా వ్యాప్తిదురీణ బ్రహ్మశ్రీ వావిళ్ళ వెంకటేశ్వర్లు అని కూడా తెలియ జేశారు .ఈ పుస్తకం లో మొదటినాలుగు పేజీలు మిస్ అవటం వలన ఎక్కడ ఎప్పుడు ముద్రించారో వెల ఎంతో తెలియలేదు.250పద్యాల సరస కావ్యం .
వెంపరాల వారు శార్దూల పద్య రాజం ‘’శ్రీ వాణీ లలితాంబి కాప్తు౦డు,జగచ్చ్రేణీ గురుండాత్మ వి-ద్యావారాశి త్రిమూర్తి రూపుడగుమేధా దక్షిణా మూర్తి ‘’తా
తా’’వంశాబ్ధి కళానిధికిన్ ,జయ విహర్తన్ సుబ్బరాట్ఛాస్త్త్రి,వి-ద్యావాగీశు గురు ప్రసాద జనిత ఖ్యాతిన్ సదా బ్రోచుతన్ ‘’ తో కావ్యం ప్రారంభించి ‘’ఎవ్వాని శిష్యత్వ వృత్తిసాందీపని చిరుత పాపనికి సంజీవనంబో ‘’అని గురు స్తుతి ఉదాత్తంగా చేసి ‘’శక్తి శబ్దాభి ధేయ విశ్వమున నేక రీతి నే దేవి వెలిగే ‘’ఆ త్రిపురసుందరి కరుణార్ద్ర దృష్టితో శాస్త్రి గారిని చూడాలని ప్రార్ధించి ,’’శివోత్తమాన్గమయి,తౌషారచల౦బై ,ఫణాధర లోకంబయి తేజరిల్లిన’’మునీన్ద్రశ్రేష్టులైన పాణిని .’వరరుచి పతంజలి లను సంస్తుతించి ,తనకు కవితా నైపుణ్యం కూర్చిన చావలి లక్ష్మీ నరసింహ గురు స్వామికి నమస్కరించి ,తర్క వ్యాకరణాలు బోధించిన దర్భా సర్వేశ విద్యార్కుని సంబోధించి ,తనను ప్రబంధ ప్రణతృణి చేసిన సూర్య బుధేంద్రుని పాదాలకు నమస్కరించి ,విజయరామ రాజు కొలువులో సుకవితకు సూత్రధారి గంటమంటక ఒక గడేకు నూరు పద్యాలు చెప్పగల దమ్మున్న అడిదం సూరనకు మెచ్చాడు కవి .
అత్రి మహర్షి గోత్రోద్భవులు,ద్రావిడ దేశం లో మొదటపుట్టి ద్రావిడులు అనే శాఖగా విస్తరిల్లి ‘’తాతా యితడు వేద విద్యననిఆశ్చర్య పరచి అదే ఇంటిపేరుగా మారింది .’’దాతలఖిలా వేదములకు ,ద్రాతలు దీనులకు ,శిష్యతతులకు విద్యా –దాతలు ,శుభ సంధాతలు తాతాపూతాన్వయులు శతక్రతు గాతల్ ‘’ అంటూ తాతా వారి గొప్పతనాన్ని అన్నికోణాలలోనూ ఆవిష్కరించారు .విజయనగర రాజులు పూసపాటి వారు వీరికి ‘’ఒంటి తాడి ‘’అగ్రహారం ఈనాముగా ప్రదానం చేశారు .ఆ వంశం లో తాతా కామేశ్వర శాస్త్రి మహా యశస్కుడు .వేదాలు నేర్చి బోధిస్తూ బ్రహ్మజ్ఞానం ఆర్జించి ,పెళ్లి చేసుకొని సత్సంతానం పొంది చివరికి సన్యాసం స్వీకరించాడు .ఆయనకొడుకు లక్ష్మణ శాస్త్రి వేద వేత్త .నిగమాగామాలలో మహాపండిత ప్రకా౦డునడు .పదం, క్రమం జట,ఘనలలోకొమ్ములు తిరిగినవారితో పోటీపడి విజయాలు సాధించి జయధ్వజాన్ని ఎగరేస్తూ లక్ష్మణావదానిగా ప్రసిద్ధుడయ్యాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-10-21-ఉయ్యూరు
—

