Monthly Archives: November 2021

5-12-21 ఆదివారం సాయంత్రం 4 గం.లకు జూమ్ లో ”మాడ భూషి సాహిత్య పరిషత్ ”లో నా ప్రసంగం

5-12-21 ఆదివారం సాయంత్రం 4 గం.లకు జూమ్ లో ”మాడ భూషి సాహిత్య పరిషత్ ”లో నా ప్రసంగం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

18-పారిభాషిక పదప్రయోగ హాస్యం

18-పారిభాషిక పదప్రయోగ హాస్యం కొన్ని పారిభాషిక పదాలు ఆ శాస్త్రంలోనే రాణిస్తాయి వాటిని తెచ్చి మామూలు మాటలలో పొదిగితే ఒక రకమైన చమత్కారం కలిగి నవ్వు  పుట్టటమే పారిభాషిక పద ప్రయోగ హాస్యం .ఉదాహరణ –‘’వితంతులకు శిరో ము౦డనం స్మార్తులలో నిత్యం ,అద్వైతులలొ వైకల్పికం .,విశిష్టాద్వైతులలో  ముండనము లేదు’’అన్నారట స్వామి శివశంకరస్వామి అని మునిమాణిక్యం ఉవాచ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హంసలదీవి శతకం

హంసలదీవి శతకం మధురకవి కాసుల పురుషోత్తమకవి హంసల దీవి శతకం రాయగా ,1925లో మచిలీ పట్నం బుట్టాయ పేటలోని నేషనల్ ప్రెస్ లో వేమూరి చిరంజీవావదానుల చేత ప్రకటితమైనది .వెల తెలుపలేదు .ఎలాంటి ఉపోద్ఘాతం , కవి పరిచయాదులు కూడా లేవు .సూటిగా శతకాన్ని ‘’’లలితా కృష్ణాబ్ది సంగమ స్థల విహార –పరమ కరుణా స్వభావ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పరిచ్ఛేదక ప్రయోగ హాస్యం

పరిచ్ఛేదక ప్రయోగ హాస్యం ఇతరపదాల సా౦గ త్యంనుంచి విడదీస్తే ,వికృతి చెంది హాస్యం పుట్టటమే పరిచ్చేదక ప్రయోగ హాస్యం .చిగురు ఆకు కలిస్తే చిగురుటాకు .చిగురు తీసేస్తే టాకును ప్రత్యేకంగా తీసుకొంటే అది పరిచ్చేద శబ్దం అవుతుంది .’’కృపారసంబు పై జల్లెడు మోము వాడు ‘’లో జల్లెడు ను జల్లించి బయటికి తెస్తే మిగిలిన దానికి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-5(చివరి భాగం )

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-5(చివరి భాగం )       అనువాద కేశవ కేశవ సుత్ రాసిన 132కవితలలో అనువాదకవితలు 25.వీటిలో నాలుగు మాత్రమె సంస్కృతం నుంచి మిగిలినవి ఆంగ్ల కవితలనుంచి అనువదించాడు .సంస్కృత కవితల్ని మక్కీకి మక్కీ అనువాదం చేశాడు .కాళిదాసు రఘు వంశం ఏడవ సర్గ లో 5నుంచి 12వ శ్లోకం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

క్లిష్ట పద ప్రయోగ హాస్యం

క్లిష్ట పద ప్రయోగ హాస్యం  యమక ,అనుప్రాస లతో వాక్యానికి శబ్ద వైచిత్రి సాధింఛి హాస్యం పుట్టించవచ్చు .చేకానుప్రాస ,లాటాను ప్రాసలను  సంధించి ,హాస్యం రాబట్ట వచ్చు .’’మిష్టర్ కిష్టాయ్ కష్టపడి చదివి ,ఎష్టాగో అష్టా మేష్ట్రిక్లేషన్ ఫష్టున పాసై ,అష్టకష్టాలు పడి ,ఆగష్టులో జష్టుపక్షం రోజులుండే మాష్టరీ పని అతి కష్టం మీద సాధించి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-4

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-4       ప్రకృతి కవి కేశవ కేశవ సుత్ కు ప్రకృతికి విషాద అనుబంధమేదో ఉంది .రమణీయ కొంకణ్ తీరాన్ని మాతృదేవి ఆరాధనతో తనివితీరా వర్ణించాడు కవితలలో .కాళిదాసు ఋతు సంహారాన్ని గుర్తు చేస్తూ ‘’పర్జన్యావ్రత్ ‘’దీర్ఘ కవిత రాశాడు .దివాళీ కవితలో శరత్ వర్ణన చేశాడు .పువ్వుల్ని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్లిష్ట పద ప్రయోగ హాస్యం

శ్లిష్ట పద ప్రయోగ హాస్యం పదాలను శ్లేషించి విశేషార్ధం   సృష్టించటం మనకావ్యాలలో పుష్కలం .శ్లిష్టపద ప్రయోగం వలన హాస్యం పుట్టించటం చాలా అరుదే .దీనినే ఇంగ్లీష్ లో ‘’పన్’’అంటారు .ఉదాహరణ –ఒకాయన చాలా అప్పులు చేసి చచ్చాడు .అప్పులవాళ్ళు వచ్చి తమకు రావల్సిన ఆస్తి  వశం చేసుకొని అతని భార్య పిల్లలమీద కొంత దయ చూపి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-3

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-3 పేదరికం వలన మెట్రిక్ తర్వాత చదవలేక పోయిన కేశవ సుత్ 1890లో ఉద్యోగం కోసం బొంబాయ్ వెళ్లి ఎవరినీ అర్ధించకుండా ఒక మిషన్ స్కూల్ లో టీచర్ గా చేరాడు.జ్ఞానోదయ పత్రికలోనూ పని చేశాడు .తర్వాత దాదర్ న్యు ఇంగ్లీష్ స్కూల్ టీచర్ గా నియుక్తుడై ,ట్యూషన్లు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-2

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-2 కేశవ సుత్ మొదటినుంచి బలహీనుడు ,ఎప్పుడూ సణుగుతూ ఉండేవాడు .ఒంటరిగా వాహ్యాళికి వెళ్ళేవాడు .ముఖం ఆలోచనా గభీరం ,చూపు ఎప్పుడూ కిందకే ఉండేది .తీక్ష్ణమైన కను చూపులు .ఎత్తు5అడుగులు  గుండ్రని ముఖం పై ముడుతలు .’’ముఖం ఖిన్నంగా ఉంటేనేం దివ్య ప్రభతో అతడు చేసే గానం ప్రపంచ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్

 మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్ మరాఠీ భాషలో నవకవిత్వానికి నాంది పలికి కేశవ సుత్,అటు బెంగాలీలకు  మైకేల్ మధుసూదన దత్ ,ఉర్దూ భాషాభిమానులకు హాకీ ,గుజరాతీయులకు నర్మద్ ల సరసన చేరాడు .ఈ శతాబ్ద సాహిత్య చరిత్రలో వీరు మైలు రాళ్ళు .వీరందరూ వాగ్గేయకారులే . జాతీయ చైతన్యానికి పాశ్చాత్య సంస్కృతీ ఎలా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తాడిమళ్ళ రాజగోపాల శతకం

తాడిమళ్ళ రాజగోపాల శతకం 1913లో కాకినాడ శ్రీ వెంకటేశ్వర విద్యాసాగర ముద్రాక్షర శాలలో శ్రీ మంగు వెంకట రంగనాథ రావు గారివలన తాడిమళ్ళ రాజగోపాల శతకం ముద్రింపబడింది .వెల బేడ అంటే రెండు అణాలు . ‘’ శ్రీ తాడిమళ్ళ వాస –రాజగోపాల నీ పూజ తేజమయ్య’’అనేది మకుటం . ‘’శ్రీ కృష్ణు నెవ్వరు సేవింపు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-10(చివరి భాగం )

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-10(చివరి భాగం ) ధనవణికన్ పత్రిక ‘’మహావిద్వాంసులు స్వామినాధయ్యర్ అజ్ఞాత  తమిళ మహాపురుషులగురించి విలువైన విషయాలు త్రవ్వి తీసి లోకానికి తెలియబరచారు .సాంప్రదాయ విద్వాంసులు కూడా ఆయనలా సరళంగా రాయగలరని నిరూపించారు .ఆయన శైలి అద్భుతం చిన్న చిన్న మాటలతో ,సరళ సుందరంగా రాస్తారు ‘’అని మెచ్చింది .మీనాక్షి సుందర పిళ్ళై జీవిత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిట్టి పని సాధించుకొన్న శ్రీనాథుడు

తిట్టి పని సాధించుకొన్న శ్రీనాథుడు శ్రీనాథ కవి సార్వ భౌముడు తెలుగు రాయని దగ్గరకు వెళ్లి ‘’ధాటీ ఘోటక రత్న ఘట్టన మిల ద్రాఘిష్ట కళ్యాణ ఘంటా టంకార విలు౦ఠ లుంఠిత మహోన్మత్తాహిత క్షోణి  భ్రుత్కోటీ రాంకిత కుంభినీధర సముత్కూట ఝాటకర్ణాటాంధ్రధిపా-సామరాయని తెలుంగా –నీకు బ్రహ్మాయువౌ ‘’అని దీవించి –‘’అక్షయ్య౦బుగసాంపరాయని తెలుంగా ధీశ –కస్తూరికా భిక్షాదానము … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-9

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-9 1912లో ఎం ఆరె ఎన్ రామనాధ చెట్టియార్ ,సోదరులు కలిసి శ్రీ కాళహస్తి ఆలయం కుంభాభిషేకం మహా వైభవం గా జరిపి, ఆలయ చరిత్ర పుస్తకం ప్రచురించారు  .అప్పుడు అయ్యర్’’ తిరుకాళత్తిపురాణం ‘’ప్రచురించే సన్నాహం లో ఉన్నాడు  .భక్త కన్నప్ప గురించి అనేక విషయాలు సేకరింఛి కాళహస్తి మహా కుంభాభిషేక సమయం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 2 Comments

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-8

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-8 నిరుపమాన పాండిత్యం ,నిరాడంబర జీవితం   అయ్యర్ ఒక చిన్న ఇంట్లోనెలకు 20రూపాయల  అద్దెకు ఉండేవాడు .ఒకసారి ఇంటి యజమాని స్నేహితుడు యజమానిని ‘’ఇంత తక్కువ అద్దె కు ఎందుకు ఇచ్చారు ?”’అని అడిగితె ఇంటి యజమాని ‘’ఈ ఇరవై కూడా తీసుకోవటం నా తప్పే .మా ఇంట్లో ఆయన అద్దెకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిట్టడం లో చమత్కారం

తిట్టడం లో చమత్కారం ముక్కు పొడుం అడుక్కుంటే ఇవ్వలేదని ఒక కవి ‘’శాస్తుర్లట ఈ నీచుడు –పాసోత్తుల మగడు వీని పరువేమో కా –కాస్తంత  నశ్యమడిగిన నాస్తీ యని పలికె వీని నాలుక పీకా ‘’అంటూ పద్యం లో తిట్టిపారేసి చమత్కారం సృష్టించాడు . తిట్టు కవిత్వం లో కొంత హాస్యం ఏర్పడినా ,అది ఉత్తమ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-7

 తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-7  , రాజధాని కళాశాలలో అయ్యర్ నిజాయితీ ,పాండిత్యం సునిసితహాస్యం తో విద్యార్ధులను ఆకట్టుకొన్నాడు .కొ౦దరు అసూయా పరులు అయ్యర్ క్లాసులలో గోలచేయమని కొందరు విద్యార్దులను పురిగొల్పగా ,వారొక ‘’నచ్చినార్కిలియార్ ,శంకరాచార్య లతోపాటు అయ్యర్ కూడా అదే దారిలో తప్పులు చేశాడు ‘’అని కరపత్రం రాసి వదిలగా ఒక విద్యార్ధి బాధాపడుతూ అయ్యర్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-6

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-6 కుంభ కోణం కాలేజి అధ్యక్షుడు వి.నాగోజిరావు సంగీతం లో దిట్ట .కొన్ని సంస్కృతతగ్రంథాలు ముద్రించాలనుకొని ,అయ్యర్ సాయం కోరగా చక్కగా పరిష్కరించి ముద్రణకు తోడ్పడ్డాడు .అయ్యర్ కు ఏదైనా సాయం చేయదలచి ‘’మీరు పాఠ్య పుస్తకాలు రాస్తే మీ రాబడీ పెరుగుతుంది , ,మంచి పుస్తకాలూ వచ్చి ఉభయ తారకంగా ఉంటుంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రతి,చు౦బన హాస్యం

రతి,చు౦బన హాస్యంజుగుప్స కలిగించేవి హాస్య ప్రోద్బలాలు ఎలా అవుతాయని ఒక డౌట్ఉంది .అవి సభ్యసమాజం ముందు చదివితే జుగుప్స కల్గిస్తాయికానీ ,ఒంటరిగా చదివితే ఏహ్యం కంటే తమాషా గా ఉంటాయి .మన రహస్యా౦గాన్ని ఇతరులముందు చూపించటానికి సిగ్గుపడతాం .కానీ బాత్ రూమ్ లో ఫ్రెంచ్ బాత్ అదే నండీ బట్టలిప్పి స్నానం చేస్తుంటే జుగుప్సకలిగించదు గర్వం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-5

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-5జీవక చింతామణి పరిష్కరణ ,ప్రచురణ పూర్తయ్యాక అయ్యర్ ‘’పత్తుపాట్టు ‘’అనే కడ(చివరి ) సంగం కాలం లో వెలసిన సంకలనాన్ని పరిశీలించాడు .వ్రాత ప్రతులకోసం మారుమూల గ్రామాలు తిరిగాడు .అయ్యర్ అంటే ఈర్ష్య కలిగిన కొందరు జీవకచింతామణి పై వ్యాఖ్యలు చేశారు .శైవంలో పుట్టిపెరిగినవాడు జైనం మీద పరిశోధన ఏమిటని వారి అభ్యంతరం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆడంబర పద ప్రయోగ హాస్యం

ఆడంబర పద ప్రయోగ హాస్యం మామూలు మాటలుకాకుండా పెద్ద పెద్ద మాటలు ఉపయోగించి మాట్లాడితే ఆ వాగాడంబరం వలన వికృతి తో హాస్యం పుడుతుంది అన్నారు మునిమాణిక్యం మాస్టారు .పానుగంటి వారి సాక్షి వ్యాసాలలో ఇది పుష్కలం .ఉదాహరణ –‘’దోమలన్నీ సభ చేసినవి ఆ సభకు కిష్కింధ నుంచి కొన్ని దోమలు వచ్చి చేరినవి .వాటి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-4

వాడుదురై ,కుంభ కోణాలలో అధ్యాపకత్వం అయ్యర్ కోసం సుబ్రహ్మణ్య దేశికర్ ఒక ఇల్లు కట్టించాడు .1877నవంబర్ లో అయ్యర్ భార్య ,తన తలి దండ్రులతో అక్కడ కాపురం పెట్టాడు .కుటుంబానికి కావలసినవన్నీ మఠం సమకూర్చేది .దేశికర్ అభిమానానికి ఇంటిల్లిపాదీ సంతోషించారు .ఇంతలో మడురైలోమీనాక్షి అమ్మవారి కుంభాభిషేకం దగ్గరకురాగా దానితోపాటు ఇతర క్షేత్రాలు దర్శించాలని దేశికర్ భావించి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-3

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-3 పట్టీశ్వరం లో ఉండగానే తమ తలిదండ్రులు ఉండే కొత్తూరు వెళ్ళాడు స్వామినథయ్యర్ .జ్వరం వచ్చి చాలా వారాలు ఉండిపోయాడక్కడ .ఆరోగ్యం కుదిరాక గురుపూజ సందర్భంగా పిళ్ళై గారు వస్తారని తిరువాడుదురై వెళ్ళాడు .ఈమఠ స్థాపకులు శ్రీ నమశ్శివాయ మూర్తి ఆరాధన పుష్యమాసం లో జరిగే గొప్ప ఉత్సవం .ఆ ఉత్సవ రోజుల్లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా తూములూరు శ్రీదక్షిణా మూర్తి శాస్త్రి గారు

డా తూములూరు శ్రీదక్షిణా మూర్తి శాస్త్రి గారు చిత్త శార్దూలమ్ము చిత్తు చిత్తు గ ,గాగ నెత్తిపై కెక్కిన నీరజాక్షి –శేముషీ సింహమ్ము ‘’శ్రీ ‘’పెంచి ,దానిచే మహిషాదులను నామపు మహిత భావ –శ్వాస హంసము నెక్కి ,చతుర సంచారంబు నేర్పించి కాచు నిర్నిద్ర మాత ‘’అయిన లలితా పరా భట్టారిక శ్రీ రాజ రాజేశ్వరి పై శతకం రాసి ,తమ గురుదేవులు  బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-2 

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-2    . మీనాక్షి సుందరం పిళ్ళై శిష్యరికం . మాయూరం లో తిరువాడుడురై మఠానికి చెందినఒక భవనం లో మీనాక్షి సుందరం పిళ్ళై ఉండేవాడు .తమిళ మహా విద్వాంసుడుగా పేరుపొందాడు .స్థలపురాణాలు ఎన్నో రాశాడాయన .తమిళ భాషా సాహిత్య బోధనలో మహాదిట్ట .స్వామినాథన్ ను వెంటబెట్టుకొని తండ్రి సుబ్బయ్యర్ ఆయనదగ్గరకు వెళ్ళాడు .వీరిని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-1  

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-1    అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లో శ్రీ ప్రేమానందకుమార్ రాయగా తమిళం లోకి కివా జగన్నాథన్ అనువదించగా ,తెలుగు సేత  శ్రీ చల్లా రాధా కృష్ణ శర్మ చేయగా ,కేంద్ర సాహిత్య అకాడెమి 1989లో ప్రచురించింది .వెల-5రూపాయలు .ఇంతకీ ఎవరు ఈ తాత?అనే విషయాన్ని మున్నుడిలో జగన్నాథన్ తెలిపాడు .గత శతాబ్ది ఉత్తరార్ధం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వర సంధానం తో హాస్యం

స్వర సంధానం తో హాస్యం స్వరం లో మార్పునే స్వర సంధానం అంటారు .ఇదికూడా ఉచ్చారణ వికృతే.దీనితో హాస్యం పుడుతుందని మునిమాణిక్యం ఉవాచ .ఒకసారి మాస్టారు స్వామి శివ శంకర స్వామిని ‘’అనుష్టుప్  ‘’నడక ఎలా ఉంటుంది అని అడిగితె –ఒక కాని ఒకే కాని ,రెండు కానులు అర్ధణా ,మూడుకానులు ముక్కానీ ,నాలుగు కానులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దూర్జటికలాపం

శ్రీ వేదాంతం పార్వతీశం రచించిన ‘’ధూర్జటి కలాపం ‘’తెలుగు విశ్వవిద్యాలయం 1996లో ప్రచురించింది .వెల-24రూపాయలు .దీనికి ముందుమాట రాసిన తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య నాయని కృష్ణ కుమారి గారు ‘’కూచిపూడి నృత్య సంబంధమైన శాస్త్ర ప్రాయోగిక విషయాలలో సమర్ధులైన శ్రీ వేదాంతం పార్వతీశం ‘’ధూర్జటి కలాపం ‘’రాశారు .నాట్య ద్వాదశ అంగాలను కరణ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఏకప్రాస సీతారామ శతకం- అల్లమరాజు రామకృష్ణ కవి

ఏకప్రాస సీతారామ శతకం అల్లమరాజు రామకృష్ణ కవి ఏక ప్రాస సీతారామ శతకం రచించి జగ్గమపేట శ్రీ సీతారామస్వామి ఆలయ ధర్మకర్త శ్రీ మోగంటి కొండ్రాజు గారి ద్రవ్య సహాయంతో,కాకినాడ శ్రీ సరస్వతీ ముద్రాక్షర శాలలో 1913లో ప్రచురించాడు  వెల.కేవలం పావలా.   పీఠికలో శార్దూల పద్యం లో –‘’శ్రీ మా హైమవతీ సరస్వతుల గూర్మిం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -11(చివరి భాగం )

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -11(చివరి భాగం )    ఇండియాస్వయం నిర్ణయ హక్కు   న్యూయార్క్ లో విఠల్ భాయ్ కి మాజీ భారత కార్యదర్శి వెడ్జి వుడ్ బెన్ కు ఫారిన్ పాలిసి అసోసియేషన్ తరఫున ఒక చర్చ జరిగితే ,రేడియో లో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అపసంహిత హాస్యం

అపసంహిత హాస్యం అపసంహిత హాస్యం పదాలను దగ్గర దగ్గరగా పలికితే సంహితం .విపరీతార్ధం కోసం వాక్యాలను విశ్లేషం చేయటం అపసంహిత .ఒకాయన బుద్ధి హీనుల గురించి కాలేజిలో ఉపన్యాసం ఇవ్వటానికి రాగా ,ప్రిన్సిపాలాయన్ను విద్యార్ధులకు పరిచయం చేస్తూ ‘’ఇవాళ మీరు బుద్ధి హీనులగురించి మంచి ఉపన్యాసం వింటారు .మంచి అని ఎందుకు అన్నానంటే ఇచ్చే ఆయన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -10

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -10మేయో సతి ‘రాసిన ’మదర్ ఇండియా ‘’లో భారతీయులను అనేక విధాల కించపరచింది .స్వపరిపాలనకు ఇండియన్లు పనికి రారు అని రాసింది .విదేశీయులే కాక మనవాళ్ళలో మహారాజ ధీరజ్ విజయ చంద్ మెహతాబ్ అమెరికా వెళ్లి ఇండియన్ల స్వాతంత్ర … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సంకర హాస్యం

సంకర హాస్యం కొన్ని పదాలలో ఉన్న ఒక అక్షరాన్ని  మరొకటి కౌగిలించుకొని ఒక వింత రూపాన్ని పొంది ,పరిహాసంగా మారటమే సంకరం .నేపధ్యప్పాట ,ఏమ్హ్లేదు ,షుమ్మయ్య (ఉష్,అమ్మయ్య ),పుస్తకం కొండ మెందుకు ?వాణ్ణ నాల్సిన పన్లేదు.ఇలాంటివి ముళ్ళపూడి మార్క్ ఆస్యానికి బంగారు తునకలు . భ్రష్టం –తచ్చనం ,అన్ స్ప్రూయత,వ్రెందుకు ,బ్ర౦ధి ఖానా లోహనం –ను … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -9

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -9 సామ్రాజ్యం నుంచి విడిపోయే హక్కు విఠల్ భాయ్ పటేల్ ఒక సమీక్ష చేస్తూ ‘’కేంద్ర ప్రభుత్వ ఆదాయం లో 45శాతం మిలటరీ వ్యయానికే పోతుంది .ఇండియాసెక్రెటరి  ఆయన నియమించే ఉద్యోగుల జీతాలు పెన్షన్ లు కాక ఇండియా  అప్పుపై … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అర్ధం లేని మాటలో హాస్యం

అర్ధం లేని మాటలో హాస్యంఒక సారి రావూరు మునిమాణిక్యం గారితో ‘’మీకథ చదివా బాగుంది .అందులో ఆఘ్రుణీ,అఘ్రుతి కూడా ఉన్నాయి. చదూతూన్నంతసేపు నాకు మా వంతుడైన క….క్క శ్వేశ్వరుడు మభాత్తేలు క్రీడించు కొన్నట్లున్నాయి ‘’అన్నాడు మరోసారి భమిడిపాటి మునిమాణిక్యం కలిసి విశ్వనాథ ఉపన్యాసం విన్నారు .ఎలాఉందని ముని ,భమిడి ని అడిగితె ‘’హ్రుశితమ్గా ,అవిశమిత౦ గా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -8

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -8ఎస్టేటు –పెన్షన్దండి ఉప్పు సత్యాగ్రహం దేశం లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు .ప్రభుత్వం లాటీలకు ,జైళ్లకుకు పని పెట్టింది .రవీంద్రుడు ‘’నైట్ ‘’బిరుదును వదిలేస్తూ వైస్రాయ్ చేమ్స్ ఫర్డ్ కు ‘’మీ బిరుదులు  ఇప్పుడు మాకు అవమానంగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గుజరాత్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్,స్త్రీ విద్య ఉద్యమకారిణి –శారదా మెహతా (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-నవంబర్ విహంగ మహిళా వెబ్ మాసపత్రిక 

గుజరాత్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్,స్త్రీ విద్య ఉద్యమకారిణి –శారదా మెహతా (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-నవంబర్ విహంగ మహిళా వెబ్ మాసపత్రిక  26-6-1882 న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గోపీలాల్ మణీ లాల్ ధ్రువ అనే జుడీషియల్ ఆఫీసర్ ,బాలాబెన్ అనే నగర బ్రాహ్మణ దంపతులకు శారదా మెహతా జన్మించింది .కవి ,స౦ఘ సంస్కర్త … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -7

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -7 విఠల్భాయ్ పటేల్ రాజీనామా 25-4-1930న విఠల్ భాయ్ పటేల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి స్వాతంత్ర్య ఉద్యమం లోకి దూకాడు .తన రాజీనామాకు కారణాలు తెలుపుతూ వైస్రాయ్ ఇర్విన్ కు –‘’డియర్ లార్డ్ ఇర్విన్ –నా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రెండు భాషల కలయిక వల్లా హాస్యం పుడుతుంది

రెండు భాషల కలయిక వల్లా హాస్యం పుడుతుంది ఔను నిజం .అందులో సౌందర్యం ఉండకపోవచ్చు .చమత్కారంగా ఉంటుంది .తుపాకీ రాయుళ్ళు అనే పగటి వేష గాళ్ళు ఇలా హాస్యం పుట్టిస్తారు .వేదపనసలు చదివినట్లు ఏవో తమాషా శ్లోకాలు చదివి నవ్విస్తారు –‘’బాకీసారా సుమనాసా సర్వాదాయం .యధాక్రమం తిన్నట్టే తినకున్నట్టే .మాడడం.మాట మాట ప్రసంగేన డబ్బు దిబ్బుస్త … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -6

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -6 సెప్టెంబర్  అసెంబ్లీ సమావేశాలలో విఠల్ భాయ్ సూచించిన సూచనలన్నీ సమ౦జసాలని సభ తీర్మానించగా మోతీలాల్ ‘’1928డిసెంబర్ 1లోపల అసె౦బ్లే ఆఫీస్ డిపార్ట్ మెంట్  ఏర్పడాలని దానికి ఇండియా కార్యదర్శి అనుమతికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ‘’ఒక తీర్మానం లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నిరర్ధక పదప్రయోగ హాస్యం

నిరర్ధక పదప్రయోగ హాస్యం ఒకసారి మునిమాణిక్యంగారిని మిత్రులు ఒకపద్యం రాసి చదవమన్నారు ఆయనకు అందులో ప్రవేశమే లేదు .బలవంతంగా ఒత్తిడి చేశారుకనుక రాదు అంటే పరువు పోతుందని ఆశువుగా ‘’ఆశ్రిత పక్ష విచక్షణ కృతక్షణ రక్షితా  దుర్నిరీక్ష భాక్ష్యాంతర దక్షణా క్షోణీభరా –కమలాక్షా తక్షణ యక్షీకృత పక్షీంద్ర లక్ష్యా –వైరిస్తుత కీర్తీ  సాంద్ర వసుక్ష్మాపాల చంద్రా … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment