హాస్యం భేదాలు
హాస్యం గురించి చెప్పమంటే ఎదో ఒకపద్యం చదివి ఎంతహాస్యం ఉందొ చూడమంటారు .హాస్య భేదాల గురించి ఏ లక్షణ గ్రంథమూ లేదు .అసలు భేదాలున్నట్లే ఎవరూ గుర్తించనే లేదు .అలంకారాలలో శబ్దాలంకారాలు అర్ధా లంకరాలు ఉన్నాయి .శబ్దాలంకారాలలో యమకం ,అనుప్రాసం ముక్తపద గ్రస్తం అని ఎన్నో రకాలు . అర్ధాలంకారాలు వంద దాకా ఉన్నాయి .ఉపమ రూపక భ్రా౦తిమత్ వగైరా .ఇలాగే హాస్యంలోనూ భేదాలున్నాయి .వీటిని ఎవరూ గుర్తించకపోవటం వలన మునిమాణిక్యం గారు వాటి గుర్తించి, పరిశీలించితెలియజేశారు .
శబ్దాశ్రయం –వాక్కు గత హాస్యాన్ని శబ్దాశ్రయం,భావాశ్రయం అర్దాశ్రయం అని మూడు భాగాలు చేశారు మాస్టారు .శబ్దాల కూర్పుతో వికృతి చూపించవచ్చు ఉచ్చారణలో తేడా ,ఇతరభాషా ప్రయోగాలు ,అస్తవ్యస్త పద ప్రయోగం ,అశ్లీల అసభ్య పద ప్రయోగం క్లిష్ట ,శ్లిష్ట విశ్లధ పద ప్రయోగం వలన వికృతి వస్తుంది ఇలాంటిహాస్యం బాగుంటుంది .ఇదంతా శబ్దాశ్రయ హాస్యం .
భావాశ్రయం –లో ఒక మెలిక ఒక వైపరీత్యం ,ఒక విచిత్రం వింతపోకడ ,విరోధ భావాల కలయిక ,వేర్వేరు అర్ధాలు కల మాటలకలయిక వలన భావాశ్రయ హాస్యం వస్తుంది రసం ,కారణం ,అలంకారం భావాలు ఆభాస రూపం లో నవ్విస్తాయి .ఇవి భావాశ్రయ హాస్యం లో అంతర్భాగాలు .
అర్దాశ్రయం –జుగుప్స కలిగించనిదీ,రమణీయార్ధం తో ఉన్నదీ,అలంకారం తో ఉన్నదీ ,ధ్వని వ్యన్జకంగా ఉండేదీ ,వికార రహితమైనదీ ,రసాను భూతి కలిగించేదీ ,క్షుద్ర భావం లేనిదీ ,చిత్త వృత్తికి కారణం అయిందీ ,ఆనందమే హద్దుగా ఉండేదీ అర్దాశ్రయహాస్యం .
అర్దాశ్రయం లో1- పెర్సేప్ట్యువల్ హ్యూమర్ అంటే అనువిదాశ్రయం అంటే చూసిన, విన్న విషయాలలో వక్రత మాత్రమె గుర్తించటం 2-ఇమాజినేటివ్ హ్యూమర్ అంటే భావాశ్రయానికి పైన ఉండేది .భావాశ్రయం లో లేని దాన్ని ఊహించుకొని ,దాన్ని వికృతంగా భావించి నవ్వటం. రసం ఉన్న చోట లేనట్లు ,కారణం లేని చోట ఉన్నట్లు అనుకోని ఆ భావనలో వికృతిని చూసి నవ్వటం ను ఇమాజినేటివ్ హ్యూమర్ అంటారని మునిమాణిక్యం ఉవాచ .
అర్దాశ్రయ హాస్యం హృదయానికి సంబంధించింది .ప్రేమ సానుభూతి మొదలైన మానవీయ లక్షణాలకు సంబంధించింది .అర్దాశ్రయం లో భాగమైన ఉక్తి విశేషాలు నిశితమైన మేధ వలన ఏర్పడినవి .ఈ ఉక్తులు రసభావనా సామర్ధ్యం కలవి అంటారు మాస్టారు .కనుక అర్దాశ్రయ హాస్యం హృదయానికి ,మేధస్సుకు సంబంధించింది అని తేల్చారు మాస్టారు .అందుకే ఇది అత్యుత్తమ హాస్యం అని విశ్లేషకులు సర్టి ఫై చేశారు
శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-10-21-ఉయ్యూరు

