పాతబంగారం -2
2-లవ కుశ
‘’తెలుగులో మాట్లాడే ఫిలిం ‘’ అనే ప్రకటనతో సి.పుల్లయ్య గారు1934లో తీసి డైరెక్ట్ చేసిన ‘’లవ కుశ ‘’లో శ్రీ పారుపల్లి సుబ్బారావు శ్రీ పారుపల్లి సత్యనారాయణ గారు ,శ్రీ భీమారావు మాస్టర్ మల్లెశ్వరావు ,మిస్ శ్రీ రంజని నటించారు .ఆర్ సి ఏ యంత్రం చేత తయారు చేయబడింది .చమ్రియా టాకీస్ డిష్ట్రి బ్యూటర్స్ ద్వారా విడుదలైంది.కధ మనకు తెలిసిందే కనుక దాని జోలికి వెళ్ళటం లేదు .పాటలు ,పద్యాల విషయం లోకివెడదాం.
1-వశిష్టుడి పద్యం –
‘’ఎన్ని దోషములున్న నెంచక ఇంచుక –గుణములున్న మెచ్చి చే కొందు వనుచు –బాటించి పలికిన పలుకు బ్రహ్మ వరంబు-గా ప్రతిష్టకు దెచ్చు ఘనుడ వనుచు
హీనుడైన సమాశ్రయించిన దమ్ముని –జూచిన చందాన జూతు వనుచు –గొల్చిన వారికి గూర్మి నా చంద్రార్క –ముగ సౌఖ్యములోసగి బ్రోతువనుచు
బరులు స్వజనులనక ప్రజలందర గన్న –ప్రజల లీల బ్రోచు ప్రభుడ వనుచు
నీ గుణంబు లెంచు నిఖిల లోకంబులు –రమ్య గుణ సముద్ర రామ భద్ర ‘’
2-శ్రీరాముడు
‘’రఘు రాజు నాదిగా రాజులౌ మమ్ముల –వర ప్రేమ గూర్పు భవ్యులార
ఏకొరంతయు లేక నే పాపమును లేక –ఘన రీతి వర్తించు ననఘులార
వనమున కే నేగ దనటచే నా వెంట –చను దెంచి నట్టియో సదయులార –మీ యనుగ్రహంముచే నీ యయోధ్య సుఖమ్ము –మీర చేరగ గంటి ధీరులార
మిమ్ము వంచించి మర్రి వృక్షమ్ము నీడ-పోయితిని నన్ను మన్నించి బ్రోవు డయ్య
భూరి యశులార సద్గుణా ధారులార – ధీరవ వరులార సాకేత పౌరులార’’
3-చాకలి వాడి పాట
‘’ఏటోలె ఈ మురిపింత –చందమామా లాంటి చక్కని మొగము –నా కాసి దిప్పి మురియ రాదా –సరసముగా మురియరాదా’’
4-రాముడు సీత
సీత-‘’ముదమాయేగా నాథా –సదయాన్తరంగ నీ సరసన్ మమెలంగన్ –నాదథానవచీ కనుల కిమ్పౌ వనిన్
రాముడు-వన చిత్రమున్ గనగా –ఘనమౌ ప్రమోదం బౌ-సురసాలముల గనుమా సఖియా –వర కీర శుకముల పరి భాషణముల్ -హృదయాను రాగంబౌ గాదె –ముదమాయగా మదిన్ ‘’
5-చాకలి ,ఈరి గాడి పాట
చాకలి –‘’ఎల్లేల్లె నంజా నీ వోటము నా కెరిక –నేదా బెంజాలి నంజా –సూరి గాడు నీ కాసి సూచిన చూపు నీకొల్లు –పులకరిమ్పులతో ఎత్తించే కైపు –నీ సైగలు నే సూడ లేదే ఆ తోట వైపు ‘’
ఈరి –‘’అ పాటి సూపులకే వోపకపోతే –నీ చేపాటి కర్రకి తానోపగలదట్రా
లచ్చి –ఈ పాటి సూపులకే వోపకపోతే –నువ్వేపాటి మొగుడివిరో రెంకయ్య బాబూ –నీ తాపు లిట్లు తి౦టదిరో రెంకయ్యబాబూ
చాకలి –నువ్వోద్దె నాకింక తు౦టరీ గుంట-నిన్నోదిలేస్తే పోతాదే నా కీ తంటా ‘’
6=లక్ష్మణుడు
‘’ప్రభో ధర్మమా శ్రీరామ సుగుణ శీల యేరామా –సతిన్ సాధ్విన్ విధి కానన్ బనుప న్యాయమా రామా –‘’
7-సీత
‘’ఆహా ఏమి నా భాగ్యము స్వామి కరుణించెన్ నేటికి నా జన్మ తరియి౦చెన్ –మునిపత్నుల సంసేవ దొరికేన్ ,నా మనసునకానందముకలిగెన్ —‘’
8-వాల్మీకి
‘’సాహస మేల ఈ లీల జానకీ –వెత బడకేపతి సేవ భాగ్యమొదవు -వినుత చరిత మాతా బేల తనమేలా –సుగుణో పేత స్థిరమా విచారము
అరమర లేల నేనిలుచు నా శ్రమమునీది కాదె ?’’—
9-లవ కుశులు
‘’రామనామ స్మరణామృత పానమే-తనివి తీర మనసార గ్రోలి ధన్యుడ నైతి ‘’
రఘురాము చరితము వినుమమ్మా ఇక –రాముని ,సీతారాముని దలచిన పాపము దొలగునుగా
ఖర దూష ణాదుల ఖండించెను గద –వాలిన్ కోలన్ గూలగ నేసెను రాముడు
ధర రావణు దునిమి దయ చెన్నారెను—‘’
10-రాముడు –రూపము మరువగానౌనా –జీవితం బెటోపావన చరితా –నీ వియోగము నే సహి౦తునా—‘’
11-సీత –‘’ఎట్టులనున్నవాడో మనుజేశుడు రామ విభుండు నక్కటా —‘’
12-ధరిత్రి
‘’నిరాదర మాయేనా నేటికి –భూమిజా కా ఈ బాములు గలిగే –రఘు కులేశా కరుణ లేదా –అనలపూతా యగుట లేదా
13-లవుడు
‘’దీరోత్తంసు డనేక వాహినులతో శత్రుఘ్ను౦ డు నీ ధారుణిన్-శూరుల్ గల్గిన ధైర్యలక్ష్మి హయ మాశు ప్రౌఢ మన్ బట్టుడీ’’—
14-శత్రుఘ్నుడు
‘’ఈ రీతి గా బల్కిన మీ నాలుకలు గోయన్ దగు నిపుడు –ఛీ దూరముగా జనుడు ‘’—
15-కుశుడు
‘’కడు౦ గడు పొగరు తలకేక్కేనా ఛీ దుష్టుడా –ఖలుడా ఖలుడా తులువా ‘’—
లవ కుశ –తురగము విడువముగా –‘’
16-లక్ష్మణ లవకుశులు
‘’తాటక మర్దించి తపసియాగము గాచే శ్రీ రాము నెరుగరే శిశువులార ?
‘’ఆడుదాని జంపినట్టి మీ రాముని నెరుగమే యత డొక్క వీరు డౌనే –‘’
ఇలా దెప్పుడు పద్యం వీర విజ్రు౦ భణగా సాగుతుంది
17-శ్రీరాముడు .కుశుడు
‘’స్త్రీ ,బాలకుల జంప చెలగు పాప మటంచు పలికిరి గురువులో బాలులార
‘’తాటక జంపుచో నేటికి ఈ బుద్ధి కలుగక పోయెనో పలుకు మయ్య –‘’అని ఈ ఇద్దరూ వాది౦చు కొంటారు
‘’మీ తల్లి ఏ సాధ్వి మీరిచట నుండుట కేమి కారణమ్ము ?’’
‘’సర్వ లోకైక జనని మా తల్లి యిందు –చేరి యుండుట హేతువు చెప్పరాదు ‘’
18-మహిని మా తల్లి లోకైక మాతః యేని –ఆమె సత్కీర్తి జగముల నలరు నేని –జనని మాతల్లి సాధ్వి యేని –యితడు నీ అస్త్రమున మూర్చ నెనయుగాత’’
19-లవ,కుశులు
‘’ వర సరోజ లోచనా రామా –రఘుకులాబ్ధి సురు చిర సోమా –రఘురామా పరంధామా అరి భీమా –ధరణిజా మనో౦బు జ కామా –సురవరాదభిరామా –దయ గనుమా మది గనుమా వరనామా ‘’
దాదాపు 30పాటలు పద్యాలున్న సినిమా ఇది .ముఖ్యమైనవి కథా సందర్భానికి తగినవే పేర్కొన్నాను .సంభాషణలు మొదలైనవన్నీ –శ్రీ రమణ మూర్తి రాశారు .
రాముడుగా శ్రీ పారుపల్లి సుబ్బారావు ,సీతగా శ్రీమతి శ్రీ రంజని ,లవుడుగా మాస్టర్ భీమారావు ,కుశుడుగా మాస్టర్ మల్లేశ్వర .రావు లు నటించారు .ఈ చిత్త జల్లు పుల్లయ్యగారే 1963లొ వచ్చిన రామారావు ,అంజలి సీతారాములుగా నటించిన లవకుశ కలర్ సినిమాకు డైరెక్టర్ .వారబ్బాయిసి ఎస్ రావు గారుకూడా డైరెక్షన్ లో సాయం చేశారు .
సశేషం
మీ –గబ్బిట-దుర్గాప్రసాద్ -7-1-22-ఉయ్యూరు

