మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -20

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -20 20-పళ్ళికిలిస్తూ, మెలికలు తిరుగుతూ నవ్వులు పండించే అంజి –బాలకృష్ణ 1898లో జన్మించి 55ఏళ్ళు మాత్రమె జీవించి 1953లో మరణించిన హాస్య నటుడు బాలకృష్ణ ఇంటిపేరు వల్లూరి .1937లో కలకత్తా లో నిర్మించిన విజయ దశమి అనే కీచక వధ తో సినీ రంగ ప్రవేశం చేసి సుమారు 100 సినిమాలలో హాస్యం పండించారు .మాధవ పెద్ది ,స్థానం నరసింహారావు గార్లు ఈ సినిమాలో నటించటం వారి సరసన బాలకృష్ణ నటించటం చిరస్మరణీయం .అయినా 1951లో వచ్చిన బాక్సాఫీస్ బంపర్ హిట్టర్ ‘’పాతాళ భైరవి ‘’చిత్రం లో అంజి పాత్రతో నే గుర్తింపుపొందారు .ప్రేక్షక హృదయాలను హత్తుకొన్నది ఆపాత్ర .ఈయనకు తోడూ పద్మనాభం .ఇద్దరు కమేడియన్లతో పింగళి ,కెవి రెడ్డిగార్లు హాస్యం పండించారు ‘’కొత్తవాళ్ళయినా ,పాతవాళ్ళకంటే బాగా గొప్పగా చేసి నవ్వించారు ‘’అని అందరూ చెప్పుకొనేవారు పేరు తెచ్చుకొన్నారు .అ౦జిపాత్రతో సినీ కథను నడిపించటం లో బాలకృష్ణ గొప్పగా చేశారు పి.సూరిబాబు నిర్మించిన ‘’తారా శశాంకం’’లో కూడా హాస్య పాత్ర పోషించారు .వంకరలు తిరుగుతూ ,పళ్ళు ఇకిలిస్తూ చేతులు ముడుచు కొంటూ తిప్పుతూ నటించటం బాల కృష్ణ ప్రత్యేకత .షావుకారు మిస్సమ్మ చిత్రాలలో విజ్రుమ్భించి నటించారు .డైలాగులు చెబుతూ విచిత్రమైన నటన ప్రదర్శించటం ఈయన ప్రత్యేకత .మొదటి సినిమాల పేర్లు చెప్పమంటే ‘’నాకు గుర్తున్నాయికాని వేషం పేర్లు గుర్తు లేవు ఏదో వేషం వెయ్యమన్నారు వేశాను అంతే’’అన్నారు బాలకృష్ణ . ‘’చదువు సంధ్యలకు గుడ్బై చెప్పి నాటకాలకు గుడ్ మార్నింగ్ కొట్టి ,ఓ ఫైన్ మార్నింగ్ కలకత్తా పారిపోయి ,ఎవరేవర్నోపట్టుకొని ఒకటి రెండు హిందీ సినిమాలలో వేషాలు వేసి ,హిందీ మాట్లాడటం బెంగాలీ అర్ధం చేసుకోవటం వరకు ఎదిగిపోయాడు బాలకృష్ణ ‘’అన్నారు రావికొండలరావు గారు .ఆంధ్రా లో ఉన్న అన్ని జిల్లాల యాసల్నీ సునాయాసంగా మాట్లాడి మెప్పించేవారు .మాండ లీకాలకూ ప్రాణం పోసి పలికేవారు .ఇన్ని ఎలా వచ్చాయి అని అడిగితె ,ఈప్రాంతం లోదిగితే ఆప్రాంత భాష మాట్లాడి,అక్కడి వాళ్ళను ఆకట్టుకొని సులువుగా నేర్చేవాడినిఅన్నారు .సూరిబాబు గారి తారా శాశా౦కం లో లంబు జంబు లలో ఒకరుగా నటించి పిచ్చిపిచ్చినవ్వులతో ఆపాత్రకు జీవం పోశారు .ఈ నాటకంకేవి రెడ్డి గారు చూసి ముచ్చటపడి విజయాసినిమాలలో నెల జీతగానిగా తీసుకొని పాతాళ భైరవిలో ముఖ్యమైన అంజి పాత్ర ఇచ్చారు .తారాశశాంకం లో నవ్వునే ఈ సినిమాలో అక్కడక్కడ పెట్టించి బాలకృష్ణ పాత్రకు క్రేజ్ కలిపించారు రెడ్డిగారు .బయట వేషాలు వచ్చినా వెయ్యమనే రెడ్డి గారు ప్రోత్సహించారు .ఎక్కడెక్కడ షూటింగ్ ఉన్నా ,ఎంత బిజీ గా ఉన్నా ,రోజూ ఏదో టైంలో విజయా వాహినీ స్టూడియోకు వచ్చి కనిపించి వెళ్ళేవారు .ఎందుకు ఇలా అంటే ‘’అది దేవాలయం లాంటిదయ్యా .రోజు దర్శనం చేసుకోకపోతే తృప్తి ఉండేదికాదు .ఒక్కోసారి దేవుళ్ళు కన్పించేవారు ఒక్కో సారి లేదు ‘’అని అత్యంత విశ్వాసంగా చెప్పేవారు బాలకృష్ణ . బక్కపలచని శరీరం విచిత్రమైన ఇకిలి౦పుల తో తోటరాముడి తమ్ముడు అంజిగా పాతాళభైరవిలో బాలకృష్ణ జీవించారు .ఆయన పేరు మర్చిపోయి ఆపాత్ర కనిపించినపుదల్లా ‘’అంజిగాడ్రోయ్’’అని కేరింతలు పెట్టేవారు ప్రేక్షకులు .ఎన్నో జానపద సాంఘిక ,పౌరాణికాలలో నటించి మెప్పించారు .నవగ్రహ పూజా మహిమ సినిమాలో అవకాశ వాద యజమానిని ముప్పు తిప్పలు పెట్టె ,బుద్ధి చెప్పే నౌకరుగా బాలకృష్ణ చిరకాలం గుర్తుంచుకోనేట్లు నటించారు .అగ్గిబరాటా ,లక్ష్మీ కటాక్షం ,ప్రతిజ్ఞా పాలన ,,గురువును మించిన శిష్యుడు సినిమాలలో రామారావు ,కాంతారావు గార్లకు జతగాడుగా నటించారు .శ్రీ కృష్ణ తులాభారం ,శ్రీ కృష్ణ సత్య ,శ్రీ కృష్ణ విజయం లలో యాదవ ప్రముఖుడుగా నటించారు .చిట్టి చెల్లెలు గుండమ్మకధ ,దేవత సాంఘిక చిత్రాలలో ప్రాముఖ హాస్య పాత్రలే పోషించారు .జానపద బ్రహ్మ విఠాలాచార్య సినిమాలలో కధానాయకుడి చెలికాడు గా నటించారు .అగ్గివీరుడు ,పిడుగు రాముడు ,జ్వాలా ద్వీప రహస్యం సువర్ణ సుందరి ,గూలె బకావలి,కనక దుర్గాపూజామహిమ ,భట్టి విక్రమార్క ,కలిసిఉంటే కలదు సుఖం ,మదన కామ రాజు కథ,బొబ్బిలి యుద్ధం,మర్మయోగి ,పరమానందయ్య శిష్యులు మొదలైన ఎన్నో సినిమాలలో విలక్షణ పాత్రలు ధరించి మెప్పించారు ..తక్కువ డైలాగ్స్ ,ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ బాలకృష్ణ విలక్షణత .కడుపుబ్బా నవ్వించిన బాల కాదు కాదు ‘’పెద్ద కృష్ణ’’ ఆయన . మాయా బజార్ లో లక్ష్మణ కుమారుడు రేలంగి,తన అనుచరుడు బాలకృష్ణను ‘’సారధీ‘’అని పిలిచేవాడు .అతడి వెర్రి వెంగళప్ప తనం తెలిసిన జంట పండితులు శాస్త్రి –వంగర ,శర్మ –అల్లు లు కీర్తిస్తూ మంచినో ,మామూలో సంపాదించేవారు .ఆ పొగడ్తలలో మునిగి ఉక్కిరిబిక్కిరవుతున్న రేలంగిని బాలకృష్ణ ‘’హేరాజన్ ‘’అంటూ సంబోధిస్తూ ‘’తానా అంటే తందానా అంటూ వీళ్ళు బహుమానాలు పుచ్చుకొంటున్నారు .ఈ తాన శాస్త్రి తందానా శర్మ మనముందు పనికి రారు –‘’అటు ఇద్దరు ఇటు ఇద్దరు –అభిమన్యుని బాబాయిలు –అటుకూడిన ఇటుకూడిన –నలుగురంటే నలుగురే –మరి తమకో?-నూటికి ఒక్కరే తక్కువ మేటిమేటి బాబాయిలు –బాబో ఏమని చెప్పుదు-బాబాయిల సేన తమది బ్రహ్మాండముగా ‘’ ,ఈ సీను జన్మలో మర్చిపోగలమా ? మాయాబజార్ లోపెద్ద వేషం సారధి వేసినా రెడ్డి గారు ఆయన సమర్ధత తెలిసి , బాలకృష్ణ చేత అందులోనే ద్వారపాలకుడిగా ఇంకో వేషం వేయించారు .మిస్సమ్మ లో నోరు విప్పి మాట్లాడకుండా ఉండే అక్కినేని అసిస్టెంట్ గా గొప్పగా నటించారు . బాలకృష్ణకు మంచి ఆఫర్లోచ్చాయి రాబడి పెరిగింది మద్రాస్ లో ఇల్లు కట్టించుకొన్నారు విఠాలాచార్య ,భావనారాయణ గార్ల సినిమాలలో బాల కృష్ణ తప్పని సరిగా ఉండేవారు .డైలాగ్ టైమింగ్,ఎక్స్ప్రెషన్ బాగా ఉన్నవారు బాలకృష్ణ .పద్యాలు ,పాటలూ బాగా పాడేవారుకానీ ఈయన పాడతానని చెప్పలేదు తెలుసుకొని వాళ్ళు పాడి౦చనూ లేదు .బాలకృష్ణకు 7గురు ఆడపిల్లలు ‘’బాల కృష్ణ నుకదా బాలనాగమ్మ వంశం మాది .వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలో ‘’అని దిగులు పడేవారు .షూటింగ్ విరామ సమయాలలో ఆయన సందడి మహా ఎంజాయ్ చేసేవారు .’’జుట్టు ఊడిపోయాక బాలకృష్ణ ‘’బాల్డ్ కృష్ణ ‘’అయ్యాడు అని రావి కొండల్రావ్ చమత్కరించారు . సశేషం భోగి శుభా కాంక్షలతో మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-1-22-ఉయ్యూరు , , •

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.