మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -34
34- స్త్రీ పాత్రలలో రాణించిన రంగస్థల ప్రసూన – వడ్లమాని విశ్వనాధం
వడ్లమాని విశ్వనాథం నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి బళ్లారి రాఘవ వంటి వారి మెప్పును పొందినవారు
. జీవిత విశేషాలు
ఇతడు 1912లో తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, నందంపూడి అగ్రహారంలో వెంకటశాస్త్రి, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. బాల్యంలో ఆరవ ఏటనే విజయనగరం మహారాజావారి సంగీత పాఠశాలలో ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడుగారల శిక్షణలో 1918 వరకు సంగీతం అభ్యసించారు
నాటకరంగ
1918 వ సంవత్సరంలో వింజమూరి వెంకటలక్షీనరసింహారావుగారి ద్వారా పెద్దాపురం విద్యా వినోదినీ సభలో ప్రవేశించారు. చావలి లక్ష్మీనారాయణ శాస్త్రి, కేశవరపు కామరాజు, కోఠీ శేషగిరిరావు మొదలైన ప్రముఖుల ఆదరణతో “హరిశ్చంద్ర” నాటకంలో లోహితుని పాత్ర ధరించడంతో ఆంధ్ర నాటకరంగంలో ప్రవేశించారు. ఆ నాటకంలో హరిశ్చంద్ర పాత్రను వింజమూరి లక్ష్మీనరసింహారావు, చంద్రమతి పాత్రను మద్దూరి కోదండరామదీక్షితులు నటించారు. ఉద్దండులు ప్రదర్శించే ఆ నాటకంతో లోహితుని పాత్రలో విశ్వనాథం అడుగడుగునా అద్భుతమైన నటనను ప్రదర్శించడంతో నాటక ప్రదర్శనానికే ఒక నూతన కాంతి ఏర్పడేది. కాలకౌశికునకు చంద్రమతిని విక్రయించి, తాను వీరబాహునకు అమ్ముడుపోయి ఇరువురూ వియోగంతో దుఃఖించేటప్పడు ఇతడు లోహితుడుగా చూపించిన సాత్వికాభినయం పేక్షకులను దుఃఖసాగరంలో ముంచివేసేది. కొంతకాలానికి విద్యా వినోదినీ సభ కార్యక్రమాలు మూలపడడంతో కాకినాడ లోని యంగ్ మెన్స్ హాపీ క్లబ్ వారు ఇతడిని తీసుకువెళ్ళారు. ప్రప్రథమంగా ‘కృష్ణలీల’లో చిన్న కృష్ణుని పాత్రను, ప్రహ్లాద పాత్రను, ధ్రువ, మార్కండేయ, లవుడు, రఘురాముడు మొదలైన ముఖ్య బాలపాత్రలను అద్భుతంగా నటించి బాలనటుడిగా ఒక స్థానాన్ని సంపాదించారు. 1926 నాటికి ప్రమీలార్జునీయంలో ప్రమీల, ‘చింతామణి’లో చింతామణి, జవ్హరీబాయి, సావిత్రి, మోహిని మొదలైన ముఖ్య స్త్రీ పాత్రలను పోషించారు. బాలకృష్ణుడు మొదలు భక్తరామదాసు వరకు, చిత్ర మొదలు చింతామణి వరకు, దేవదేవి మొదలు విప్రనారాయణ వరకు సమస్త ముఖ్య స్త్రీ, పురుష పాత్రలను ఇతడు ధరించారు.
ముఖ్యంగా ఇతడు నటించిన “ప్రమీల”, “రోషనార”, “చింతామణి” నాటక ప్రదర్శనాలతో వచ్చిన డబ్బుతో కాకినాడలో ది యంగ్ మెన్స్ పాలెస్ థియేటర్ కట్టడమనేది చర్చిత ప్రసిద్ధమైన విషయం. ఆ గౌరవం ఇతడికే దక్కింది.
ఇతడు స్త్రీ పాత్రలేకాక, రామదాసు లో “రామదాసు”, విప్రనారాయణలో “విప్రనారాయణ” మొదలైన పురుష పాత్రలను అద్భుతంగా అభినయించి మెప్పించాడు.
1930 లో “యంగ్‌మెన్స్ యూనియన్” పేరుతో స్వంత కంపెనీ స్థాపించి 1932 వరకు నడిపి, ఎస్.పి.లక్ష్మణస్వామి, ఎ.వి.సుబ్బారావు, రేలంగి మొదలయిన బాల్యమిత్రులతో ఆనేక నాటకాలను ప్రదర్శించారు. ఆ తరువాత 1935 వరకు పారుపల్లి సుబ్బారావుగారి కంపెనీలో బలిజేపల్లి వారితో హీరోయిన్‌గా ఎన్నో నాటకాలు ఆడారు. సి.ఎస్.ఆర్. ఆంజనేయులు ఈయన సహకారంతో స్వంత కంపెనీ స్థాపించి “తుకారాం”, “పతితపావన”, “చింతామణి”, “రాధాకృష్ణ” వగైరా నాటకాలు ప్రదర్శించారు. దురదృష్టవశాత్తు 1937 లో తీవ్ర విషజ్వరానికి లోనై ఆరోగ్యం చెడిపోయి, రంగస్థలం నుంచి నిష్క్రమించారు
సినిమారంగం
ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు తారుమారు కావడం వల్ల సినిమా రంగంలో ప్రవేశించారు. పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన శ్రీవేంకటేశ్వర మహత్యం (1939) నుండి శ్రీవెంకటేశ్వర మహత్యం (1960) వరకు, నాటి శివరావు నటించిన పరమానందయ్య శిష్యులకథ(1950) నుండి పరమానందయ్య శిష్యులకథ(1966) వరకు అనేక చిత్రాలలో బహువిధమైన పాత్రలను ధరించారు.
ఇతడు నటించిన సినిమాల జాబితా:
- శ్రీ వెంకటేశ్వర మహత్యం (1939)
- పరమానందయ్య శిష్యులు (1950)
- సంతోషం (1955)
- శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)
- నవగ్రహ పూజామహిమ (1964)
- పరమానందయ్య శిష్యుల కథ (1966 సినిమా) (1966)
- తల్లి ప్రేమ (1968)
- రాజకోట రహస్యం (1971)
- మల్లమ్మ కథ (1973)
సన్మానాలు
తెలుగుదేశంలో ఉన్న పెద్ద నటులందరితోను నటించి, లెక్కలేనన్ని బంగారు పతకాలు, రజితపాత్రలు అందుకున్నారు. మైసూర్ మహారాజా, హైదరాబాదు రాజా కృష్ణప్రసాద్, జయపూర్ మహారాజా వంటి కళాపోషకులతో సత్కరింపబడ్డారు.
బిరుదులు
·
ఆంధ్ర రంగస్థల నక్షత్రం
బాలనట భానుడు
· రంగస్థల ప్రసూన
· భావ చింతామణి
· నటశిఖామణి
· ద్వారంవెంకటస్వామి నాయుడు గార్ల శిక్షణలో 1918 వరకు సంగీతం అభ్యసించారు. అదేసంవత్సంలో వింజమూరివెంకట లక్ష్మినరసింహా రావుగారి ద్వారా, పెద్దాపురం విద్యావినోదిని నాటకసంస్ధలొ ప్రవేసించారు. చావలిలక్ష్శినారాయణశాస్త్రి, కేశవరావుకామరాజు, కోఠీశేషగిరిరావు వారిసరసన హరిశ్చంద్ర నాటకంలో లోహితుని పాత్రను పోషిస్తూ నాటక రంగంలో ప్రవేశించారు. అనంతరం కాకినాడ లోని యంగ్ మెన్స్ హేపి క్లబ్ లో చేరి చిన్నికృష్ణుడు, ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, లవుడు మెదలగు బాలపాత్రలు చేయసాగారు. అలా బాలకృష్ణుని మెదలు భక్తరామదాసు వరకు, చిత్ర మెదలుకొని చింతామణి వరకు స్త్రీ పాత్రలతో సమంగా పురుషపాత్రలు ధరిస్తూ వందలాది నాటకాలు నాటి ప్రముఖ నటీ, నటులు అందరి సరసన నటించారు.
అదేకంపెనీలో రేలంగి, ఎస్.పి.లక్ష్మణస్వామి, ఏ.వి.సుబ్బారావు వీరికి మంచి మిత్రులుగా ఉండేవారు. అనంతరం 1935 వరకు పారుపల్లి సుబ్బారావు. బలిజేపల్లి, సి.యస్.ఆర్.గార్లతో పలునాటకాలు ప్రదర్శించారు. 1937 అనారోగ్యంతో నాటకరంగానికి దూరమై కొంతకాలానికి సినిమా రంగంలో ప్రవేసించారు. జానపద-పౌరాణిక చిత్రాలలో దాదాపువీరు మునిగా, బ్రాహ్మణుడుగా, పండితుడిగా ఎన్నో వందలరకాల పాత్రలు వందల సినిమాలలో కనిపిస్తారు అన్ని అతిథి పాత్రలే! అలా ముపై సంవత్సరాలు వెండితెరపై వెలుగొందారు. 1973 మార్చి18 వతేదిన 62వ ఏటమద్రాసు రాయపేటలోని వైద్యశాలలో తుదిశ్వాస వదిలారు.
· ఈయన మొదటి సారిగా విజయావారి పాతాళభైరవిలో నటించినపుడు కొడుకు పుడితే విజయప్రసాద్ అని పేరుపెట్టారు .ఈయనే ఆతర్వాత విజ్జిబాబు పేరుతొ జంధ్యాల మల్లె పందిరి సినిమా హీరోగా నటించారు .ఆతర్వాత చాలా సినిమాలలో నటించారు .
· సశేషం
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-1-22-ఉయ్యూరు
