· మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35
· 35-ముక్కు బులాకీతో చలాకీగా నటించే సురభి బాలసరస్వతి-3(చివరిభాగం )
· 1955లో విఠాలాచార్య డైరెక్షన్ లో వచ్చిన కన్యాదానం లో కాంతారావు జానకి ,వహీదా రెహ్మాన్ లతోపాటు బాలసరస్వతి’’ లీల’’ గా నటించారు.మాటలు పాటలు శ్రీ శ్రీ .యోగానంద్ డైరెక్షన్ లో విజయగౌరి లో రామారావు లలితా పద్మిని లతో నటించారు .జూనియర్ సముద్రాల రచన ..1956లో జోయాఫిలిమ్స్ బాల సన్యాసమ్మ లో పి.సుబ్బారావు డైరెక్షన్ లో జగ్గయ్య జివరలక్ష్మి కృష్ణకుమారి ల సరసన నటించారు .జు సముద్రాల రచన .బీస్ రంగా డైరెక్షన్ లో భక్తమార్కండేయ లో పుష్పవల్లి రఘురామయ్య లతో నటించారు రచన సముద్రాల .విశ్వనాధం రామమూర్తి సంగీతం .వేదాంతం రాఘవయ్య దర్శకత్వం మల్లాదివారి మాటలుపాటలు ,ఘంటసాల సంగీతం తో వచ్చిన వినోదావారి చిరంజీవులు సినిమాలో నటించారు .విక్రం ప్రొడక్షన్స్ తెనాలి రామ కృష్ణలో బీస్ రంగా డైరెక్షన్ లో అగ్ర తారాగణంతో నటించారు .పి.పుల్లయ్య డైరెక్షన్ లో జూపిటర్ వారిఉమా సుందరి చిత్రం లో రామారావు నాగయ్య కన్నాంబ శ్రీరంజని లతోపాటు నటించారు. సంగీతం అశ్వత్ధామ రచన సదా శివ బ్రహ్మం .’’రాయే రాయే సిన్నదానా రంగైన పిల్లదానా ‘’పాటపిఠాపురం పాడగా ఈమెపై చిత్రించారు . …1957లో సారంగధర లో రామారావు భానుమతి లతోపాటు మల్లిక వేషం వేశారు .శాంతినివాసం లో ‘చక్కనిదానా చిక్కని దానా ఇంకా అలకేనా ‘’పాట కు రేలంగితో నటించారు .శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం లో శరభగా రామణా రెడ్డి సరసన భార్యగా చేశారు .పదవే పోదాముగౌరి ‘’పాట వీరిద్దరిపై తీశారు .సిరిసంపదలు లో కొండమ్మగా చేశారు .కొసరాజు రాసిన ‘’కొండమ్మో ఓ బంగారపు కొండమ్మో’’ఈమెపై చిత్రించారు .1963 శ్రీ కృష్ణార్జున యుద్ధం లో చినముని అల్లుతో సరసాలు సాగించే సుభద్ర చెలికత్తె గా వేసి ‘’ అంచలంచెలు లేనిమోక్షము చాలాకష్టమే భామినీ- ‘ కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చినమునీ ‘’అన్న పాటలో చిరస్మరణీయంగా నటించారు .పెండ్యాల మ్యూజిక్ పింగళి సాహిత్యం ,బిగోపాలం ,స్వర్ణలత గానం లో మైమరపించారు .తిరుపతమ్మకధలో ‘పో పోరాపోకిరి మామయ్యా’’సాంగ్ చిత్రీకరణ లో ఉన్నారు .కానిస్టేబుల్ కూతురులో,నాదీ ఆడజన్మే లో నటించారు .
· 1965బొబ్బిలి యుద్ధం లో వెంకటలక్ష్మి గా నమ్మకమైన రాణీ వాసపు దాసిగా నటించి రంగారాయుడు మల్లమ్మ ఏకైక సంతానాన్ని తెల్ల దొరలకళ్ళు కప్పి రక్షింఛి చివరికి ప్రాణాలు సైతం పోగొట్టుకొన్న పాత్రలో అత్యద్భుతంగా నటించారు .1969లో ఆదర్శకుటుంబం లో నూ ,మాతృదేవత లోనూ ,1971లో ఆనందనిలయం లో ,జీవిత చక్రం మొదలైన సినిమాలలో తనదైన శైలిలో నటించి మెప్పించారు సురభి బాలసరస్వతి .
ఆమెగురించి నాకు వీకీపీడియాలో ‘’-సురభి బాలసరస్వతి తెలుగు చలనచిత్ర హాస్యనటి. ఈమె హాస్యపాత్రలతో పాటు కొన్ని చిత్రాలలో నాయికగా, ప్రతినాయికగా కూడా నటించింది. సురభి బాలసరస్వతి1931,జూలై 3న ఏలూరులో జన్మించారు.[‘’
అనే వాక్యం తప్ప ఏరకమైన సమాచారమూ ఎక్కడా దొరకలేదు .నాకు చాలా బాధకలిగి నేనే వరుసపెట్టి 1940నుంచి 1960 వరకు వచ్చిన సినిమాలు ఆతర్వాత వచ్చిన సినిమాలు వెతికి ఆమె నటించిన పాత్రలు ఆమెపై చిత్రించిన పాటలు , రచన ,దర్శకులు సంగీత దర్శకుల వివరాలతో మూడు ఎపి సోడ్ లు రాసి హమ్మయ్య అని తృప్తి చెందాను .
మంచి భారీ పర్సనాలిటి ,చలాకీ కవ్వించే కళ్ళు చక్కని డైలాగ్ డెలివరి ఎలాంటి పాత్ర కైనా నప్పే అవయవ సౌష్టవం ,కమ్మగా పాడే స్వరం బాల సరస్వతికి పెట్టని ఆభరణాలు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-1-22-ఉయ్యూరు

