మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 42


     మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 42

     42-గానకోయిల,సంగీత సరస్వతి  అందాలరాముని బామ్మ - నటి పూర్ణిమ

     సురభి నాటక సమాజం తోటలో విరిమల్లె పూవు లాంటి నటి .పగోజి భీమవరం దగ్గర పొలసానిపల్లె వీరి పూర్వీకుల ఊరు .1-3-1918న అత్తిలి లో నడి ఏటిలో పడవలో సురభి లక్ష్మమ్మ ,గోవిందరావు లకు జన్మించారు .తండ్రి సురభి నాటక  సమాజానికి మకుటం లేని మహారాజ నటుడు చిన్నతనం నుంచే సంగీతం అభ్యసించారు .అప్పటికే నటనలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆమె 15వ ఏట అవేటి రామయ్యగారిని వివాహమాడారు .పుట్టింట బాలనటిగా ప్రారంభమైన నట జీవిత౦1936లో ‘’శ్రీ శారద మనో వినోదిని ‘’పేరిట స్థాపించిన స్వంత నాటక కంపెనీలో నాయిక పాత్ర ధారణతో పరిపక్వమైంది .

      శైశవం లో పోషించిన చిన్న కృష్ణుడు ,లవుడు ,కుశుడు ,పాత్రలు యుక్తవయసులో సత్యభామ ,సక్కుబాయి ,సావిత్రి ,చిత్రాంగి ,ప్రమీల ,చంద్రమతి ,మల్లమాంబ ,కమల వంటి పాత్రలతో మలుపు తిరిగి ఆమె కీర్తి కిరీటం లో కలికితురాయి లుగా వెలుగు లీనాయి .కురుక్షేత్రం ,పాండవోద్యోగావిజయాలు ,సత్య హరిశ్చంద్ర పౌరాణిక నాటకాలలో పూర్ణిమ ద్రౌపది కృష్ణ ,చంద్రమతిగా నటించి పాత్రలకు జీవం పోశారు విప్రనారాయణలో దేవదేవి గా ,నటించి మెప్పించారు .

      సాంఘిక నాటకాలు కన్యాశుల్కం లో మధురవాణి బాలనాగమ్మ లో సంగు పాత్ర డాక్టర్ గోవింద రాజుల సుబ్బారావు గారి సరసన నటించి వన్నె తెచ్చారు .ఆనాటి స్టేజి ఆర్టిస్ట్ లైన సీస్ ఆర్ ,బళ్ళారి రాఘవ ,మాధవపెద్ది సత్యం ,సూరిబాబు ,అబ్బూరి వరప్రసాదరావు ,పీసపాటి నరసింహమూర్తి ,వంగర వెంకట సుబ్బయ్య ,బందా కనక లింగేశ్వరరావు ,రెండు చింతల సత్యనారాయణ వంటి హేమా హేమీలతో నటించిన నతపూర్నిమ ఆమె .ఏలూరులోని మోతే వారి ‘’సీతారామాంజనేయ నాటక సమాజం ‘’,సురభి నాటక సమాజాలలో కూడా నాయిక పాత్రలు ధరించి ఒప్పించిమేప్పించారు

       1934లో స్వయంగా పూర్ణిమా దియేటర్ ను స్థాపించి స్వీయ సారధ్యం లో ఎన్నో నాటకాలు ఆంద్ర దేశం లోసమర్ధవంతంగా  ప్రదర్శించి సమర్ధత చాటారు .బీహార్ ఒరిస్సా చెన్నై ఢిల్లీ లలోనూ ప్రదర్శనలు నిర్వహించి రాష్ట్రేతరుల అభిమానం విపరీతంగా పొందారు .ఇలా శుక్ల పక్ష పౌర్ణమిగా నాటకరంగం పై పూర్ణిమ సంపూర్నా వెలుగులతో రాగ రంజితం చేశారు .రంగూన్ వంటి ఇతర దేశాలలోనూ నాటక ప్రదర్శనలు నిర్వహించి మెప్పించారు .

       1941లో గూడవల్లి రామబ్రహ్మం గారి అపవాదు సినిమాలో కోవెలమూడి ప్రకాశరావు లక్ష్మీ రాజ్యం రఘురామయ్య బాలసరస్వతి ల సరసన వెంకయ్యగా వేసిన ఎం సి రాఘవన్ భార్య అనసూయగా పూర్ణిమ అసమాన నటన తో నటించారు .పాటలు బసవరాజు అప్పారావు తాపీ ,కోసరాజులు రాశారు .సత్యభూమి సినిమాలోనూ నటించారు .

       1973లో బాపు దర్శకత్వం లో నాగేశ్వరరావు నాగభూషణం ,అల్లు రాజబాబు ,లత లతోపాటు బామ్మగారుగా  నాగభూషణం తల్లిగా పూర్ణిమ నటించారు .బహుశా ఇదే ఆమె చివరి సినిమా అయి ఉండచ్చు .

      హరికధా గానం చేసి ,మెప్పించారు ఆకాశవాణిలో తమ గానం తో ఆకర్షించారు .గ్రామ ఫోన్ రికార్డు లద్వారా తన గానమాదుర్యాన్ని శ్రోతలకు వినిపించారు సకలకళా పూర్ణిమ .

       ఆంధ్రనాటక కళాపరిషత్ ,చెన్నై తెలుగు అకాడెమీలు పూర్ణిమను ఘనంగా సత్కరించి గౌరవించాయి .1958లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమనటి పురస్కారాన్ని గవర్నర్ భీమసేన్ సచార్ గారి ద్వారా ’’సువర్ణ ఘంటా కంకణం ‘’ అందజేసి సత్కరించింది. అనేక సంఘాలు ఆమెను సన్మానించి ‘’గానకోకిల’’ ,’’ సంగీత  సరస్వతి ‘’వంటి సార్ధక బిరుదులను ప్రదానం చేశాయి .సంఘ  సేవాపరాయణురాలుగా ,కార్యకర్తగా కీర్తిపొందారు .వరద బాధితుల సహాయార్ధం రాష్ట్రం లో చాలా చోట్ల ప్రదర్శనలిచ్చి ఆ డబ్బును వరదబాధితులకు ,ఇతర అభ్యుదయ కార్యక్రమాలకుందించిన దాన శీలి పూర్ణిమ .

       జీవిత చరమా౦కం లో ఏలూరులో ఉంటూ పక్ష వాటం తో బాధ పడుతున్నా ,లెక్క చేయకుండా ఏలూరు జిల్లా కేంద్ర గ్రంధాలయం లో నిర్వహించిన బళ్ళారి రాఘవ గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొని ,తన నటనా కౌశలాన్ని ప్రదర్శించిన నట సామ్రాజ్ఞి పూర్ణిమ .26-5-1995న 77వ ఏట నట పూర్ణిమ పూర్ణిమ నటరాజులో ఐక్యమయ్యారు .

       సశేషం

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-22-ఉయ్యూరు
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.