మన మరపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -43

మనమరపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -43

 43-నట యోగి లింగమూర్తి -2

— _ నేతి పరమేశ్వర శర్మ MOHINI  1999

 ముదిగొండ లింగమూర్తి అంత పొడగరి కాదు – అంత పొట్టికాదు. అంత లావూకాదు, అంత సన్నమూకాకుండా సమతూకంగా ఉండేవారు. ఎప్పుడూ తెల్లటి ధోవతి పింజపోసి కట్టి మెడపట్టీలేని తెల్లని లాళ్ళీ ధరించి ఉండేవారు. ఈ తెలుపునకుతోడు పల్చని నలుపు తెలుపు శిరోజాలు! నెమ్మదిగా మాట్లాడే స్వభావం. జ నెమన్ముదిలోనూ కరకరలాడే కంఠస్వరం! చిరుగాలికి కూడా చలించే లెతాకు నంటి మనస్తత్వం! ఈ లక్షణాలన్ని కలబోసి కన్సించేవారు ‘  లింగమూర్తి 1908 అక్టోబర్‌ 10వ తేదీన ‘ఆంధధ్రాప్యారిస్‌’ని పిలిచే తెనాలి పట్టణంలో జన్మించారు. వీరు ఉద్భటారాధ్య వంశీకులు, తెలంగాణాలోని దేవరకొండ తాలూకా ముదిగొండ [గ్రామం ఈ వంశీకుల జన్మస్థలం. పందొమ్మిదవ శతాబ్దంలో ఈ వంశీకులు కొందరు తెనాలి వచ్చి స్టరపడ్డారని తెలుస్తోంది. ఆ వంశంలోనివారే లింగమూర్తిగారు. తెనాలి తాలూకా హైస్కూల్ట్‌ విద్యాభ్యాసం జరిగింది. స్కూల్‌ ఫైనల్‌ వరకు చదివారు. అదే కాలంలో ఆ పాఠశాలలోనే గోవిందరాజుల సుబ్బారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు, అబ్బూరి రామకృష్ణారావు, లక్కరాజు విజయగోపాలరావు, పెద్దిభొట్ల చలపతి, పల్లలమర్రి సుందరరామయ్య మొదలైన మహానటులందరూ చదివారు. అందరూ కలిసి పాఠశాల నాటకాల్లో పాల్గొన్నారు. హైస్కూల్‌ వదిలిన తర్యాత పూర్వ విద్యార్థుల నాటక సంఘమంటూ ఒకటి నెలకొల్సి నాటకాలు ప్రదర్శించారు. విరంతా పెరిగి నటులుగా రూపుదిద్దుకొంటున్న సమయంలోనే కొడవటిగంటి కుటుంబరావు, గుడిపాటి వెంకటచలం, మాధవపెద్ది బుచ్చి సుందరరామయ్య శా త్రిపురనేని గోపీచంద్‌, మునిమాణిక్యం నరసింహారావు, త్రిపురారిభట్ల విరరాఘవస్యామి మొదలైన కవులు సాహిత్వసేవ చేస్తూ ఉండేవారు. లింగమూర్తిగారి పూర్వీకుల్లో గాయకులుగాని, నటులుగాని, ఉన్నట్టు దాఖలాలు కన్సంచడము లేదు. కానీ వారు జన్మత: నటులు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ, కాలక్షేపం చేయకుండా, నాటకరంగంలోకి వచ్చారు. ఆం(ధ్రదేశంలో పేరెన్నికగన్న శ్రీ రామవిలాస సభలో వీరుకూడా ఆదిలోనే ప్రవేశించారు. ఆ సభవారు ప్రదర్శించిన (ప్రతాపరుద్రీయం నాటకంలో పడవవానివేషం మొదలు యుగంధరుని పాత్రవరకూ సుమారు పదిరకాలైన పాత్రలు ధరించి ప్రశంసలు పొందారు. “నివు రమ్యాలోకన కలిగిఉండే ఒక్క గడ్డిపరకముదనే రత్నఖచితమైనట్టి అద్భుత సౌధాన్ని వ్యక్తపరచగలవు. కాని నీలో ఆ రమ్యాల్‌ కన లేనప్పుడు మాత్రం ఒక్క గడ్డిపరకే ఆ అద్భుత సౌధాన్ని దాచివేస్తుంది” అంటూ ఒక జపాన్‌ ఆచార్యుని సూక్తిని శ్రీ సంజీవ్‌దేవ్‌ రూపారూపాల నేతన [గ్రంథంలో ఉట౦కించారు. ఈ సూం్త లింగమూర్తిగార్కి సరిగ్గా అతికిపోతుంది. కన్యాశుల్కం నాటకం శ్రీరామ విలాససభవారు అద్భుతంగా ప్రదర్శించెవారు. అందులో రామప్తు పంతులు వేషం మొదట్లో తంగిరాల ఆంజనేయులుగారు (మాష్టర్‌ అంజి) ధరించారు. వీరు అకాల మరణం చెందారు. కన్యాశుల్కం నాటకానికి విఘాతం ఏర్పడింది. అటువంటి క్తిష్టపరిస్టితుల్లో లింగమూర్తిగారు రామప్ప పంతులు పాత్రను స్వకరించి మాష్టర్‌ అంబికి సమ ఉబ్జీగా పోషించి ప్రశంసలు పొందారు. వీరు ప్రారంభంలో రామప్ప పంతులు వేషానికి తలపాగా ధరించేవారు. (ప్రేక్షకులు తలపాగాకు నిరసన తెలియజేస్తే వారి అభిరుచిననుసరించి తలపాగా తొలగించి ‘జులపాలు’ జుట్టుతో అభినయించారు. ఈ సందర్భంలో ఒక సన్నివేశం వివరిస్తాను. ఒక సందర్భంల్‌ మధురవాణితో మాట్లాడి తలుపువేసుకొని జా(గ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ రంగంలోనుండి నిష్కమించే సమయంలో మధురవాణిపై అనుమానం, అంతలోనే వృద్ద రసికత్వం చూపుతూ చేసే అభినయానికి ప్రేక్షకులు ముగ్గులై హర్షధ్యానాలతో హోరెత్తించేవారు. ఈ విధంగా అనేక సన్నివేశాలలో అద్భుతంగా నటించి అజరామరమైన కీర్తిని సంపాదించుకున్నారు. కొంతకాలం న్థానం నరసింహారావుగారి సమాజంలోనూ, మరికొంతకాలం సి.యస్‌,ఆర్‌. ఆంజనేయులుగారు ప్రదర్శించిన భక్తతుకారాం, పతితపావన జ్‌. నాటకాలలోనూ వివిధ పాత్రలుపోషించారు. స్పష్టమైన వాచకం, పాత్రోచితమైన వేషం, హద్దులు మీరని ఆంగికాభినయంతో ‘ప్రతిపాత్రనూ రసరంజితంచేసి (ప్రేక్షకులకు రసానుభూతిని కల్షించెవారు. అందుక్షేపేక్షకులు ఏరిని ‘క్యారెక్షర్‌ యాక్టరోగా అభిమానించారు. ఆ రోజుల్లో ప్రదర్శించే నాటకాల్లో మల్డాది గోవిందశాసస్త్రి, ఏలేశ్వరపు కుటుంబళా’స్త్రి, బెల్లంకొండ సుబ్బారావు, కళ్యాణం రఘురామయ్య, యస్‌.పి. లక్ష్మణస్వామి, మాష్టర్‌ కళ్యాణి, జొన్నవిత్తుల శేషగిరి, టి. రామకృష్ణశాస్త్రి ప. సూరిబాబు, మొదలైన వారంతా అద్భుతంగా పద్యాలు పాడి వేషాన్ని రక్తి కట్టించేవారు. ఇందరు మహాగాయకులు, నటుల మధ్య కేవలం డైలాగ్స్‌  చెబుతూ (పైక్షకుల అభిమానాన్ని లింగమూర్తిగారు పొందారంటే వారి నటనా సామర్ధ్యాన్ని మనం గమణంచవచ్చు,. ఆమా “భి విధంగా కేవలం ‘ సంఖభాషకులు చెప్పేనటులను ఆరోజుల్లో “ప్రోజ్‌ యాక్టర్స్‌” అని పిలిచెవారు. గోవిందరాజులు సుబ్బారావు, బసవరాజు సుబ్బారావు, డాక్టర్‌ చంద్రమౌళి సత్యనారాయణ, వంగర వెంకట సుబ్బయ్య, లింగమూర్తి మొదలైన వారందరూ (ప్రోజ్‌యాక్టర్స్‌గా చలామణి అయ్యారు. జౌత్సాహిక నాటక సమాజాలవారు వీరిని నాటకం రిహార్సల్స్‌ చూడటానికి ఆహ్యానిస్తూఉండేవారు. పెద్దనటుడ్ని అనే గర్యం లేకుండా రిహార్సల్స్‌ చూడటానికి వచ్చేవారు. వచ్చినవారు రిహార్సల్స్‌ చేసే ప్రదేశంలో కూర్చోకుండా చాటుగా కూర్చుని నాటకం ఆసాంతం విని మనోనేత్రంతో చూసి నాటకంలోని లోటుపాట్లను క్షుజ్మంగా వివరించేవారు. రిహార్సల్స్‌ చూసేఎరి ప్రత్యేక  పద్దతి గురించి ఆరోజుల్లో విశేషంగా చెప్పుకునేవారు. ఇక వీరి సినిమా జీవితం పరిశీలిస్తే… 1937 సం॥ ఏరి సినిమా జీవితానికి నాంది పలికింది. ప్రథమ దర్శనం తుకారాంలో గోస్వామి పాత్ర. కానీ వాహినీవారి వందేమాతరం (1939)లో డాక్టర్‌ పాత్ర అద్భుతంగా పోషించి వెలుగులోకి వచ్చారు. ఆ తరువాత స్వర్గసీమ, సుమంగళి, దేవత, భక్తమాల, నారద-నారది, సువర్షమాల, ధర్మాంగద, వేమన, పెద్దమనుషులు, త్యాగయ్య, నా ఇల్టురామదాసు, ఆమ్మరుసు పాండవ వనవాసం మొదలైన ఎనఖై సినిమాలలో వైవిధ్యంగల పా(త్రలెన్నో ధరించారు. ధరించిన పాత్రలన్ని పండించారు. ‘వేమన’లొ అభిరామయ్య పాత్ర, ‘త్యాగయ్య’లో జపేశన్‌ పాత్ర, ‘పాండవ వనవాసం”లో శకునిపాత్ర, ‘పోతనిలో అజామిళిని పాత్ర “నభూతో నభవిష్యతి” అన్నట్టు నటించి, నటునిగా విశ్వరూపం చూపారు. “పెద్దమనుషులు’ సినిమాలో రామదాసు పాత్ర”, ‘పాండవ వనవాసం’ లో శకునిపాత్ర నటనాపరంగా భిన్నధృవాలైన పాత్రలు. ఆ పాత్రలు రెండింటిని పోల్చుకుని సమీక్షిస్తే వారి నటనలోని లోతుపాతుల్ని, నటనా నైపుణ్యాన్ని మనం గమనించవచ్చు. సారథీవారి ‘పంతులమ్మ’ (దర్శకుడు శ్రీ గూడవల్లి రామబ్రహ్మం)లో ఒక ‘టిపికల్‌ పాత్ర పోషిం ప్రజాభిమానాన్ని, విమర్శకుల (ప్రశంశల్ని పొందారు. పోతన, స్వర్గసీమ సినిమాలలో నటించడమేగాక ఆ చిత్రాలకు, (ప్రొడక్షన్‌ మేనేజర్‌గా కూడా పనిచేశారు. సాధనావారి ‘సంసారం’ సినిమాకు కొంతవరకు దర్శకత్వం వహించి, విరమించుకున్నారు. 1949 సం॥లో ఉత్తమ నటునిగా ఎంపికై తన సత్తాని నిరూపించుకున్నారని చిత్రకళ పత్రిక (1949)లో ప్రముఖంగా ప్రచురించారు. సినిమా టెక్నీషియన్స్‌ ఎసోసియేషన్‌కు కార్యదర్శిగా కొంతకాలం పనిచేసారు. ఎరు సహనటులను మనస్సూర్తిగా ప్రేమించేవారు. 1957 సం॥లో సన్మాన సంఘానికి కార్యదర్శిగా ఉండి మద్రాసుల్‌ స్టానంవారిని వ్‌ ఘనంగా సత్కరించారు. ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్యగారు, లింగమూర్తిగారు జీవికా జీవులు. నాగయ్యగార్ని ఎంతో ఆప్యాయంగా ‘బావా’ అంటూ పిలిచేవారు. భక్తపోతన వేషానికి నాగయ్యగారు పనికివస్తారా? పనికిరారా? అన్న సందిగ సమయంలో లింగమూర్తిగారు కె.వి.రెడ్డిగారికి ధైర్యంచెప్పి నాగయ్యగారినే ఖాయం చేయించారు. “భక్త పోతన షూటింగ్‌ మొదటిరోజు రానేవచ్చింది. ఆరోజు ఉదయమే, (క్రాఫింగ్‌ తీయించి, స్నానం చేయించి స్టూడియోలోని మేకప్‌రూమ్‌కు తీసుకొని వెళ్తాను… ఒక గంటలో వేషం పూర్తి అయింది. ఆయన ముఖంలోకి మూసాను. మా నాగయ్యకాదు. ఆ రూపమే లేదు. ఎదొ కొత్తతేజం కనబడింది. నా వళ్లు జలదరించింది.” అంటూ ఆనాటి “పోతన” గురించి తర్వాత చెప్పారు లింగమూర్తి గారు. పోతన సినిమూ అఖండ విజయం సాదించింద్‌. నాగయ్యగారిలో భక్త పోతనను చూసే మహద్భాగ్యం ఆం(ధ్ర(ప్రజలకు కలిగించినవారు లింగమూర్తిగారేనని ఎందరికి తెలుసు? కపటము, ఈర్ష్య ఎరుగని మహోన్నత వ్యక్తిని లింగమూర్తిగారిలో చూడవచ్చు. సినిమా నటునిగా పేరు (ప్రఖ్యాతులు సంపాదించిన తరువాత కూడా నాకి ఉన్నతికి కారణమైన నాటకరంగాన్ని విస్మరించలేదు. అవకాశం లభించినపుడల్లా రంగస్థలంపై నటిస్తూనే వచ్చారు. పెడతోవలు పడ్డున్లు నాటకరంగాన్ని, నటుల్ని నిర్మొహమాటంగా విమర్శించేవారు. రంగస్థలం అభివృద్దికి ఎంతగానో పాటుపడ్డారు. నాటక రంగంలోనేకాదు, సినిమారంగంలోకూడా క్యారెక్టర్‌ యాక్టర్‌ అనిపించుకున్న బహుకొద్దిమందిల్‌ లింగమూర్తిగారిదే అగ్రస్థానం! ఎపా(త్ర ధరించినా లింగమూర్తిగారు కనబడేవారుకాదు. పాత్ర కనబడేది. నాటకరచయితగా కూడా లింగమూర్తిగారు పేరు పొందారు. వెంకన్న కాపురం, పెళ్లిచూపులు, త్యాగం మొదలైన కొన్ని నాటికలు కూడా రించారు. వెంకన్న కాపురం నాటికను ఒక దశాబ్దంపాటు ఆంధ్రదేశంలోని దాదాపు అన్ని సమాజాలవారు (ప్రదర్శించారు. ఆరోజుల్లో ప్రతి పరిషత్తులోనూ, వెంకన్నకాపురం నాటిక ఉండాల్సిందే! బహుమతులు గెల్బుకోవాల్సిందే!! “నాటకరంగంమీద ఏకాగ్రతతో పాత్రలో లీనమై పాత్ర జొచిత్యం గ్రహించి, పోషణ చేసుకుంటూ నటించే నటునికి, ఆ అనుభవంలో ఉత్తీర్ణుడై తరించే మార్గం అలవడుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఇది చాలా ఉపకరిస్తుంది. రంగస్థలం ఒకో దేవాలయం లాగా అందుకు ఉపయోగపడుతుంది. ఆత్మకు మోక్షాన్ని కలిగించే మార్గాల్లో ఇదొకటి (బళ్లారి రాఘవ). సరిగ్గా ఇదే దృక్సృథంతొ లింగమూర్తిగారు నాటకరంగ జీవితమంతా గడిపారు. మానవజీవితం ఎప్పుడూ ఒకేరకంగా ఉండదు. జీవనగమనంలో ఎత్తుపల్టాలు, వెలుగు నీడలు చాలా సహజం. 1974లో వారి అర్జాంగి కైవల్యం పొందారు. ఆ సంఘటన లింగమూర్తిగారి జివనగమ్యాన్ని మార్చివెసింది. నటరాజుని మనసా, వాచా, కర్మణా విశ్శసెంచిన, ఉవాసించిన ఆ నటరత్నం నాటకరంగాన్ని ఏడ్‌, ఆథ్యాత్మిక చింతనాపరులైనారు. సత్యాన్వేషణల్‌ సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. శేషజీవితాన్ని కాశీపుణ్యక్షేత్రంలో విశ్వేశ్వరుని సన్నిధిలోగడిపి, అక్కడే లింగైక్యం చెందారు.    

-ముదిగొండ లింగమూర్తి గారి వెంకన్న కాపురం (1958) నాటిక ఆంధ్రదేశంలో విసృతంగా ప్రదర్శించబడిన నాటికలలో యిదొకటి

‘యోగి వేమన’

లింగమూర్తి :- అభిరామ్.

ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందరూ నాగయ్య గూర్చే చెబుతుంటారు. వంకాయకూర బాగుంటే నాణ్యమైన వంకాయల్నీ, వంటమనిషిని మెచ్చుకుంటాంగానీ – ఉప్పూ, కారాల్ని మెచ్చుకోం. కానీ అవి లేకుండా కూరే లేదు. కానీ వాటికి అంత గుర్తింపు ఉండదు. అందుకే – చిత్తూరు నాగయ్య అనే మర్రిచెట్టు ఇతర పాత్రధారుల ప్రతిభని కప్పెట్టేసిందని సినిమా రెండోసారి చూస్తేగానీ తెలీదు.

అభిరాముడిగా ముదిగొండ లింగమూర్తి నటన సూపర్బ్. చాలా సహజంగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో నాగయ్యకి పోటీగా తట్టుకుని నిలబడ్డాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. నాకు మహామంత్రి తిమ్మరసు, పాండవ వనవాసం సినిమాల్లోని ‘దుష్ట’ లింగమూర్తి తెలుసు. ‘సాత్విక’ లింగమూర్తి తెలీదు.

‘పెళ్లిచేసిచూడు’ లో దొరస్వామి కూడా నాకిట్లాంటి షాకే ఇచ్చాడు. ఈ పాత సినిమాలు చూస్తుంటే క్రమంగా నాకొక విషయం అర్ధమవుతుంది. పాతతరం నటులైన లింగమూర్తి, దొరస్వామి వంటి గొప్ప ప్రతిభావంతులని మనకి తెలీదు. అందుకే సూపర్ హిట్టయిన సినిమాలు ఒకటో, రెండో చూసి ఏదో సాదాసీదా సపోర్టింగ్ ఆర్టిస్టుల్లే అనుకుంటాం.. కానీ కాదు.

 పౌరాణికాల్లోనే కాకుండా, సాంఘికాలలో కూడా జిత్తులమారి వేషాలను వేసి మెప్పించడంలో తనకంటూ ఒక స్టానాన్ని సంపాదించుకున్నారు. ఆ రోజుల్లొ ఈ తరహా పాత్రలు పోషించడంలో సి.ఎస్‌.ఆర్‌., ముదిగొండ లింగమూర్తి ధూళిపాళ పెర్టు ప్రధానంగా వినిపించేవి. లింగమూర్తి కళ్ళలో క్రౌర్యం (ప్రదర్శించడంలో నేర్పరి.ర్యం (ప్రదర్శించడంలో నేర్పరి.


నాగయ్య గారి అవసాన దశ లో
 నర్సింగ్‌ హోంలో (ప్రవేశించవలసి వచ్చింది. మూ[త్రవ్యాధి త్మీవతరంగా ఉందని (గ్రహించిన డాక్రర్లు ఆయన్ను అడయార్‌లోని వి, హెచ్‌. ఎస్‌, సెంటర్‌కు చేర్చారు. మృత్యుదేవతతో ఆయన రెండు గంటలసేపు భీషణ సమరం సలిపారు. ఆయన అవసాన దళ సమీపిస్తున్నదని తెలుసుకోని మృత్యుశయ్య దగ్గిర ఉన్న యీ రచయిత, ఢీ) ముదిగొండ లింగమూర్తి “రఘుపతి రాఘవ రాజారాం” గీతం పొడుతోంపే ఆ మహోసటుడు, కళాతపస్వి శాశ్వతంగా కన్ను మూశారు,

  రోంగస్థలంమోది పాత్ర తెరలోని పాతృతో మాటాడడం ఖండచూళిక, ఉదా॥ “వెంకన్న కాపురం”! నాటకంలో రంగస్గలంమోది వెంకన్న తెరోలోపలి భార్యతో సంభాషించడం.

ముదిగొండ లింగమూర్తి మొదలైన ప్రసిద్దనటులు ఉద్భ దించారు. వీరు (ప్రదద్శించిన నాటకాలు (ప్రతాపరుద్రీయం, కన్యా శుల్కం, బొబ్బిలి, రోషనార బాగా పేరు సంపొదించాయి. స్థానం నరసింహారావుగారు స్తీ పొత్రలు ధరించి ఆంధ్ర దేశంలో అపూర్వమైన పేరు ప్రఖ్యాతుల్ని గడించారు. అలాగే మాధవపెద్ద వెంకటరామయ్యగారు ఉత్తమ నటుడుగా క్రీర్తింపబడ్తారు.

 సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-22-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.