మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 45

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 45

45-నర్తన శాల సినీ నిర్మాత -లక్ష్మీ రాజ్యం

   సి.లక్ష్మీరాజ్యం (1922 - 1987) తెలుగు సినిమా, రంగస్థల నటి, నిర్మాత. 1922లో విజయవాడ[ఆధారం చూపాలి]లో జన్మించిన లక్ష్మీరాజ్యం 1935లో విడుదలైన శ్రీకృష్ణ లీలలు సినిమాలో బాలనటిగా నటించారు  లక్ష్మీరాజ్యం మొత్తం 35 సినిమాలలో నటించారు . రెండు చిత్రాలలో ఎన్టీ రామారావు సరసన హీరోయిన్‌గా నటించారు . ఈమె 1941లో తెనాలికి చెందిన రెవిన్యూ శాఖా ఉద్యోగి కె.శ్రీధరరావును వివాహమాడారు సి.లక్ష్మీరాజ్యం కర్నూలు జిల్లాలోని ఆవుకు గ్రామంలో, 1922లో జన్మించారు.[1]



   చిన్నతనంలో తన చిన్నాన్న నరసింహం దగ్గర సంగీతం నేర్చుకున్నారు. యుక్తవయసులో హరికథలు చెప్పాలనే మక్కువతో సాలూరు రాజేశ్వరరావు వద్ద హరికథలు చెప్పడం నేర్చుకున్నారు. ఈమెకు హరికథా కళాకారిణి కావాలన్న లక్ష్యం ఉండేది. మేనమామ వెంకటరామయ్యతో పాటు పువ్వుల సూరిబాబు నాటక సమాజంలో చేరి స్త్రీ పాత్రలు ఉత్తమంగా పోషించారు.[2] తరువాత పులిపాటి వెంకటేశ్వర్లు, పువ్వుల రామతిలకం వారి సమాజంలో ప్రవేశించి కొన్ని పాత్రలు ధరించారు. ఈమె తులాభారంలో నళిని, చింతామణిలో చిత్ర మొదలగు పాత్రలు ఎంతో చలాకీగా పోషించేవారు.

   వీరు 1951లో రాజ్యం పిక్చర్స్ అను సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి నందమూరి తారక రామారావుతో అనేక సినిమాలు తీశారు. వాటిలో ప్రముఖమైనది 1963లో విడుదలైన నర్తనశాల. ఈ సినిమా జకర్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవములో రెండు బహుమతులు గెలుచుకున్నది. ఈ చిత్రప్రదర్శనకు గాను లక్ష్మీరాజ్యం ఇతర సినిమా బృందముతో జకర్తా వెళ్ళారు. లక్ష్మీరాజ్యం నిర్మించిన ఇతర చిత్రాలలో హరిశ్చంద్ర, శ్రీకృష్ణ లీలలు, శకుంతల, దాసి, రంగేళి రాజా, మగాడు ఉన్నాయి. రాజ్యం పిక్చర్స్ సంస్థ నిర్మించిన మొత్తం 11 సినిమాలలోను 5 సినిమాలలో ఎన్.టి.ఆర్. హీరోగా నటించాడు.

   ఈమె భర్త శ్రీధరరావు జూలై 29, 2006 రాత్రిన మద్రాసులోని తమ స్వగృహములో మరణించాడు.[3]

   చిత్ర సమాహారం

నర్తనశాల (1963)
శ్రీకృష్ణ లీలలు (1959)
సామ్రాట్ విక్రమార్క (1968)
హరిశ్చంద్ర
రాజు-పేద (1954)
దాసి (1952)
ఆకాశరాజు (1951)
అగ్నిపరీక్ష (1951) – సుశీల
పరమానందయ్య శిష్యుల కథ – లీలావతి
సంసారం (1950) – మంజుల
ద్రోహి (1948) – సీత
నారద నారది (1946)
త్యాగయ్య (1946)
ఇది మా కథ (1946)
పంతులమ్మ (1943)
ఇల్లాలు (1940)
అమ్మ (1939)
శ్రీకృష్ణ లీలలు (1935)
కృష్ణ తులాభారం (1935)
రాజ్య దాసి చ్చితాన్ని ఉత్తమమయినదిగా నిర్మించకలిగ నందులకు అ భినందనీయులం, “సంసారం? చితని ర్మాతలలో ఒకరైన రంగనాధదాస్‌ శారు తొముగడించిన అపారానుభావం *దాసి, చచ్నితమును సర్వాంగ సుందరం గా నిర్మించడానికి ఉపయోగించుకో కలిగారు, కధ పొందిక్క నడక సహాజం-గాన్కు బహుచక్క గా నున్నది, (పతి సన్ని వేశము జీవితంలోని వా స్పవికతను చి తించేదిగా నొప్పింది, ఉ త్తీమలక్ష్యాలన్యు అదర్శా అను అనేకఘట్లాలలో (_పబోధించబడినవి, చ్యితము చూడను చూడను ఆసక్తి యినువుడిస్తుందంటే ఆళ ఏరో రం “కాదు, . ఓకచాస్‌ీ (పనికత్త్రై తన యజమాని కుటుంబ (శేయస్సు దృష్ట్యా ఆడినమాట తప్పకుండా, అఘండత్యా గాలు వేసింది, ఈసందర్భంలో తన భర్తకు, బిడ్డల దూరమయింది. ఇల్లు వాకిలి సర స్వాన్ని వదిలేసి దిక్కు లేనిపక్షీలాగ అఆలమటించి చివరకు తను తనభర్శ, బిడ్దలం ఒకచోట చరి అనంద భా పన్చాలు రాలుస్తారు, నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే వివిధ ‘సమ స్యలం, వ్య కులు వారి తరహాలు, లోకం పోకడ వాల “శహుజం గా చతించబడనవి, ఈ చ్మితంలోని భూమికలు చక్కగా నిర్వహించ బడీనవి, (శీ,మతి లక్ష్మీ రాజ్యం, యన్‌, టి, రామా రావుగారలు చక్కా గా నటీంచారు, “= ఇందులో హోాస్యరసం సయితం శివరావు ‘లేలంగి “గారలం సవహాజంగా పోసింవారుః స్ట సంగీతం మనో జ్ఞం గా నున్నది, ఈచిత్రం నిశషమెన (పజాదరణ పొందగలఅదను టకు సందేహము లేదు, దర్శకుడు (శ్రీరంగనాధదాస్‌ గారికి చక్కని భవిస్యత్తు కలదని యాచి.త్రం రుజువు చేసేంది, రాజ్యం పిక్చర్‌ చారు యింకా ఆఅసేక ఉట తము అటే చిళతాలను నిర్మించగలరని అశిస్తు న్నాము,

   కొంతమంది వ్యక్తులు తమ జీవితకాలం లో ఎలా సతమతమౌటారో ,ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారో ,ఎంత కృషి చేసి పైకోస్తారో ,ఈ నాటి నటీనటులకు ఎలాంటి సామర్ధ్యాలు ఉండాలో లక్ష్మీ రాజ్యం ను చూస్తె తెలుస్తుంది .ఒక రోజు సుప్రసిద్ధ రంగస్థల నటిగా ,మరో రోజు సుప్రసిద్ధ చలన చిత్ర నటిగా ,ఆ తర్వాత నిర్మాతగా ,దియేటర్ యజమానురాలుగా సుమారు 55ఏళ్ళు కళారంగం లో తన జీవితాన్ని గడిపిన కీర్తి ఆమెది .

    చిన్నతనం లోనే సంగీతం పినతండ్రి నరసింహం గారి వద్ద నేర్చారు .హరికధలు చెప్పాలన్న మక్కువతో సాలూరు రాజేశ్వరరావు గారి వద్ద హరికదాగానం నేర్చుకొన్నారు .మేనమామ వెంకటరామయ్య కళాకారుడు కావటం తో ఆయనతో పాటు సూరిబాబు గారి నాటక సమాజం లో చేరి ఊరూరూ తిరిగి నాటకాలు ప్రదర్శించారు .ఈ నాటకాలలో  స్త్రీపాత్రలు అత్యుదాత్తం గా పోషించారు ...తర్వాత పులిపాటి వెంకటేశ్వర్లు ,పువ్వుల రామ తిలకం గార్లతో కలిసి తులాభారం లో నళిని ,చింతామణిలో చిత్ర వంటి చలాకీ పాత్రలు పోషించారు .ఆనాటి ప్రముఖ రంగస్థల నటుల౦దరితోనూ నటించిన అనుభవం ఆమె గారిది .చాలాకాలం బెజవాడ లో ,తెనాలిలో ఉంటూ అనేక పాత్రలు ధరించారు .

     రంగస్థలం అనుభవంతో మొదటి సారిగా 1935లో కృష్ణ సినిమాలో రాధగా ,1936లో మాయాబజార్ లో సత్యభామగా ,1940లో కాల చక్రం సినిమాలో సూరి బాబు గారి ప్రక్కన హీరోయిన్ గా నటించారు .ఈ చిత్రాలు కొన్ని హిట్ ,కొన్ని ఫట్ అవటంతో సినిమాల్లో సుస్థిరత రాలేదు .తర్వాత గూడవల్లి రామబ్రహ్మ గారి ఆహ్వానం తో మద్రాస్ వెళ్లి 1940లో ఇల్లాలు చిత్రం లో నటించి అఖండమైన కీర్తి సాధించారు తర్వాత స్వయంగా నిర్మాతగా మారి సినిమాలుతీసి సూపర్ హిట్ కొట్టారు .నర్తన శాల చిత్రానికి జకార్తా అవార్డ్ రాగా జకార్తా వేల్లిస్వీకరించారు .

     సశేషం

   మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-22-ఉయ్యూరు 
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.