గోపబందుదాస్ -6
సత్యవాది విద్యావిధానం లో సీనియర్ విద్యార్ధులకు శిక్షణ నిచ్చి జూనియర్ లకు సంస్కృతం నేర్పించేవారు .అందరు కలిసి పంక్తి భోజనం చేసేవారు .నీలకంఠ సార్ మీసం పెంచాడు చాన్దసానికి వ్యతిరేకంగా ,విరుద్ధంగా .ఆయన్ని బ్రాహ్మణ్యం బహిష్కరిస్తే ‘’నా మీసం ‘’వ్యాసం రాసి ఉత్కళ సాహిత్య పత్రికలో ప్రచురించాడు .దాన్ని ఒరిస్సా భక్తకవి శ్రేష్టుడు రాయ్ బహదూర్ మెచ్చాడు .గోదావరీస్ ,హరిహరలు కూడా మీసాలు పెంచారు .వసతి గృహం లో మాదక ద్రవ్యాల వాడకం నిషిద్ధం .పాచికలు ,పేకాట ,పందెం ఒడ్డే ఆటలూ నిషిద్ధం .విద్యార్ధి లైన్గికప్రవర్తనలో దారితప్పితే ఒంటరిగా ఒక మట్టిగుడిసె లో ఉంచి ,ఒకపూట మాత్రమె తిండి పెట్టేవారు .ఆసమయం లో బ్రహ్మ చర్య నియమాలు బోధించేవారు .అతనిలోమార్పురాగానే మళ్ళీ అందరిలో కలిపేవారు .అల్లరి విద్యార్ధి మానిటర్ అయ్యేవాడు .మానిటర్లు స్నేహితులమీద పితూరీలు చెబితే ‘’మాడల్స్ ‘’అని పిలిపించి నిరసన తెలియ జేసేవారు .
‘’ అఖిరాస్’’ అనే శారీరక వ్యాయామం విద్యార్ధులకు నేర్పించేవారు .వాసుదేవ మహాపాత్రో దీనికి అధిపతి .క్రీడలు ,పరుగుపందాలు నేర్పారు .దినవారీ కార్యక్రమం పూర్తవగానే వ్యాయామం ఉండేది .చక్కని టైం టేబుల్ తో ఆసక్తికర విద్యాబోధన జరిపేవారు .భోజన సమయం లో రెండుగ్రూపులు ఏర్పరచి వారితో వడ్డన చేయించేవారు .తెల్లవారుజామునే అందరూ లేవాలి .ఒకేఒక పైసా విలువగల ప్రార్ధన పుస్తకం విద్యార్ధులందరి చేతా ఉండేట్లు చేసేవారు .ఇలాంటి క్రమశిక్షణలో విద్య నేర్చిన వారంతా ఆతర్వాత జీవితాలలో అత్యున్నతస్థాయి పదవులు పొందారు .
శాసనమండలి సభ్యుడు
1912లో ఒరిస్సా-బీహార్ లను లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఒక ప్రత్యెక రాష్ట్రం గా వ్యవస్థీకరించి ,శాసనమండలి ఏర్పాటు చేశాడు .అందులో అదనపు సభ్యులు కొందరు ఎన్నుకోబడిన సభ్యులు ఉండేవారు .పురపాలక సంస్థల నుంచి ఒకరు ఒరిస్సా నుంచి ఎన్నికయేవారు .గోపబంధు ను దీనికి పోటీచేయమని మధుసూదన రాయ్ సూచించాడు .ప్రజలకష్టాలు కోరికలు దీనివల్ల తీరవని దాస్ ఇష్టపడలేదు .కానీ మధుసూదన్ మాట సుగ్రీవాజ్ఞ .1917లో శాసనమండలి సభ్యుడుగా గోపబందు దాస్ ఎన్నికయ్యాడు .ఈయన దృష్టిలో నాలుగు లక్ష్యాలున్నాయి .చెదిరిపోయిన ఒరియా భాష మాట్లాడే వారిని ఒకే చోట చేర్చటం ,వరదలు క్షామాల నివారణకు శాశ్వత పరిష్కారం ,ఎక్సైజ్ సుంకం లేకుండా ఉప్పు తయారు చేసే హక్కు ఒరిస్సా వారికి కల్పించటం ,సత్యవాది విద్యావిధానం లో విద్యావ్యాప్తి .
ఎం.ఎల్.సి అవగానే ఒరియా భాషా ప్రాంతాల సమైక్యతా కోరుతూతీర్మానం ప్రవేశపెట్టాడు.సి౦ఘ్ భం వంటి బాగా వెనుకపడిన ప్రాంతాలలో తిరిగి అక్కడ ,దీనస్థితిలో ఉన్న ఒరియావారిలో ధైర్యం కలిగించి ,అక్కడ బడులు నెలకొల్పి దేశాభిమానం రగుల్కొల్పాడు .కార్య దీక్షాపరుడు పండిట్ గోదావరీస్ మిశ్రా ను చక్రధర్ పూర్ హైస్కూల్ హెడ్ మాస్టర్ ను చేశాడు .తానె కార్యదర్శి .పోరాహత్ ,ధూల్ భూ సబ్ డివిజన్లలో ఎన్నో ప్రాధమిక పాఠశాలలు నెలకొల్పాడు .తన సహచర వరిష్టుడు వాసుదేవ మహా పాత్రాను బాహారాగోరాలో మిడిల్ స్కూల్ స్థాపించే బాధ్యత అప్పగింఛి తర్వాత హైస్కూల్ చేయించాడు .ఒరియా జాతీయతను ప్రజలలో వ్యాపి౦ప జేయటానికి బహుమతి ప్రదానోత్సవ సభలు ఏర్పాటు చేయించి ,విద్యాలయాలను శ్రద్ధగా నడుపుకొంటూ ,కొత్తవాటిని స్వయం కృషితో ఏర్పాటు చేసుకోవాలని అధ్యక్షస్థానం నుంచి హితవు చెప్పేవాడు .మధ్య పరగణాలలలోని ఫూల్ జార్ ,అద్మాపూర్ చంద్రపూర్ ప్రాంతాలలో పర్యటించి ప్రజలను ఉత్తెజపరచాడు .ఒరియా ఉద్యమ నిర్వహణలో ఆయనకు రాధానాధ రథ్ తోడ్పడ్డాడు .మిడ్నాపూర్ లోని ఒరియా వారిని బెంగాల్ ప్రభుత్వం రాజద్రోహ నేరారోపణతో భయపెడుతుంటే అధికారులను లెక్క చెయ్యకుండా వెళ్లి వారిలో జాతి చైతన్యం కల్గించాడు .మద్రాస్ రాష్ట్రం లో జయపూర్ ,విశాఖ ప్రాంతాలలో పర్యటించి అక్కడి ఒరియవారిలొ ధైర్య స్తైర్యాలు కలిగించాడుశాసనమండలి సభ్యుడు గోపబందు దాస్స్ .
ఒరిస్సాలోని మహానది ,కట్జూరి విరూపా ,బ్రాహ్మణి వైతరిణి ,ఖరశ్రోత ,సాలంది ,సువర్ణ రేఖా నదులు వరదలలో విపరీత నష్టాలను కలిగిస్తాయి .ప్రభుత్వం కంటి తుడుపుగా ఏదోతాత్కాలిక సాయాలు చేసి చేతులు దులుపుకోనేది .ప్రజలను శాశ్వతంగా ఆదుకోపోతే తన సభ్యత్వం వట్టి దండుగ అనుకొన్నాడు .
1919లో పూరీ జిల్లాలో పెద్ద క్షామం వచ్చింది .పేపర్లద్వారా తెలుసుకొని ప్రభుత్వేతర సహాయాన్ని పెద్ద ఎత్తున సంఘటిత పరచగా ,దేశం నలుమూలలనుంచి ఆర్ధిక సాయం ఊహకు మించి వచ్చి చేరింది .ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది .1920మార్చి 13న శాసన మండలిలో దాస్ క్షామ సమస్య ప్రస్తావన చేసి బడ్జెట్ లో చూపిన 19వేల రూపాయలు ఏమూలకూ చాలదనీ ,దాన్ని యాభై వేలకు పెంచమని గట్టిగా కోరాడు .రాష్ట్ర ప్రభుత్వం యాభై వేలు ఇస్తే కేంద్రం లక్షా యాభై వేలు ఇవ్వాలని నియమం .సుమారు ఈ రెండు లక్షలతో క్షామ నివారణకు కొంత ఉపశమనం కలిగించవచ్చునని గోపబందు భావన .క్షామపీడిత ప్రజలు తినటానికి ఏమీలేక తౌడు ,ఆకులు తింటున్న దయనీయ స్థితి ఫోటోలలో బంధించి పై ఆఫీ పర్లకు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాడు .మండలిలో కన్నీటితో వారి దైన్యాన్ని గురించి చెబుతుంటే అందరూ కన్నీరు మున్నీరుగా విలపించారు .ప్రభుత్వం ‘’లైట్ తీసుకొన్నది ,ఒరిస్సా డివిజనల్ కమిషనర్ గ్రన్నింగ్ ‘’కష్టాలను గోరంతలు కొండంత చేయటం గోపబందుకు మామూలే .నేను ఆప్రాంతాలు తిరిగి చూశా పూరీ జిల్లాబోర్డ్ వైస్ చైర్మన్ రెండువేలమంది మాత్రమె బాధితులు అన్నాడు .కనుక బడ్జెట్ పెంచం ‘’అని గట్టిగా వాది౦చాడు.వెంటనే దాస్ లేచి ‘’ఆయన వారం క్రితం కారులో వెళ్లి ఎక్కడా దిగకుండా చూసి వచ్చాడు గ్రామసీమలలోకి వెళ్ళటానికి దార్లె లేవు .అవి ఆయన చూడనే లేదు .నేను నాలుగు సార్లు చూసొచ్చాను. రెండువందల యాభై గ్రామాలు దుర్భిక్షం లో ఉన్నాయి .ఇప్పటికైనా మేల్కొని జనం చావకుండా చూడండి. ఆ ప్రాంతాలలో ఏ ఒక్క మనిషి అన్నం లేక చనిపోయినా బాధ్యత నాదీ, ప్రభుత్వానిదీ అవుతుంది ‘’అని చెప్పి కూర్చున్నాడు
గోపబంధు మాటలు లెఫ్టినెంట్ గవర్నర్ గేయిట్ హృదయాన్ని కదిలించింది 1920 ఏప్రిల్ 7న ఆప్రాంతాలు పర్యటిస్తూ గోపబంధునుకూడా తనతో తీసుకు వెళ్ళాడు ఈ విషయం అధికారులకు తెలీదు .ప్రజలు ఆకులుఅలములు తినటం స్వయంగా చూసి చలించిపోయాడు .స్త్రీల ఇత్తడి నగల్ని గ్రన్నింగ్ బంగారు నగలని అనుకకొన్నాడని గ్రహించాడు .ప్రక్కనే ఉన్న గోప బందుతో ‘’దురదృష్ట వశాత్తు ప్రభుత్వం తనకర్తవ్యాన్ని చేయలేకపోయి౦ద య్యా గోపబందూ ‘’అన్నాడు డగ్గుత్తికతో .ఇది తెలిసిన పూరీ జిల్లా మేజిష్ట్రేట్ చిరాకుతో ‘’ఈ జిల్లాలో రెండు గడ్డు సమస్యలు ఒకటి క్షామం రెండు గోపబందు ‘’అన్నాడట బాధితుల ప్రభుత్వసాయం కేవలం ఉపశమనమే శాశ్వత నివారణ జరగాలని భావించాడు దాస్ .
శాసనమండలి లో వ్రజసుందర దాస్ తో కలిసి మండలిలో వరద నివారణకు శాశ్వత పరిష్కారం కోసం తీర్మానం ప్రవేశపెట్టాడు .బాధ్యతారాహిత్య ప్రభుత్వం తీర్మానాన్ని అంగీకరించలేదు .కానీ 1922-23లో ప్రభుత్వం ఒక వరద నివారణ కమిటీ ఏర్పరచి సర్వే చేయించి 70వేలు ఖర్చు చేసింది .అది పోడిచేసిందిఏమీ లేదు శూన్యం .1927లో వచ్చిన భీభత్స వరదలతర్వాత 1928లో నిపుణులకమిటీ వేస్తె ,హీరాకుడ్ డాం ఒరిస్సాలో నిర్మాణమైంది .అప్పటికే గోపబంధు యశః కాయుడయ్యాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-22-ఉయ్యూరు ఠ .
వీక్షకులు
- 979,974 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- సుప్రకాశ శతకం
- అక్షర ప్రభాకరుడు’’ కూర్చిన వినూత్న’’ అక్షర స్వరం ‘’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.24 వ భాగం.2.2.23.
- అరుణ మంత్రార్థం. 9వ భాగం.2.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -395
- చిద్విలాస శతకం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.23 వ భాగం.1.2.23.
- అరుణ మంత్రార్థం. 8వ భాగం.1.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -393
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -391
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,923)
- సమీక్ష (1,278)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (304)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (360)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు