· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -152

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -152

· 152-కంచుకోట ,నిలువుదోపిడి సినీ ఫేం దర్శకనిర్మాత -విశ్వశాంతి విశ్వేశ్వరరావు

యు. విశ్వేశ్వర రావు తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. యు.విశ్వేశ్వరరావు 20 మే 2021న చెన్నై లో కరోనాతో మరణించాడు. [1][2][3]

విశేషాలు
విశ్వేశ్వరరావు సంపన్నుల కుటుంబంలో జన్మించాడు. ఇతనికి మూడుసంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. మేనమామ ఇతనిని చేరదీశాడు. ఇతనికి 8 సంవత్సరాల వయసు వచ్చేవరకు అక్షరాభ్యాసం జరగలేదు. మొదట్లో ఇతడు మూడు సంవత్సరాల తరువాత చదువు ఆగిపోయింది. వ్యవసాయం చూసుకునే వాడు. ఇతని బావ దావులూరి రామచంద్రరావు ఇతడిని బాగా చదివించాలని నిర్ణయించాడు. ఫలితంగా ఇతడు తన 14వ యేటనుండి ముదినేపల్లి, గుడివాడ, ఏలూరు, విజయనగరాలలో చదివి బి.ఎస్.సి.పట్టా సంపాదించాడు. తరువాత గుడివాడ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా చేరాడు. తనకు చదువు చెప్పిన టీచర్ల సరసనే సహ ఉపాధ్యాయుడిగా పనిచేయడం అతనికి వింతగా అనిపించింది. సినిమా నిర్మాతలు అట్లూరి పూర్ణచంద్రరావు, పి.రాఘవరావు గుడివాడ స్కూలులో ఇతని శిష్యులు. తరువాత గుడివాడలో జనతా ట్యుటోరియల్ ఇన్‌స్టిట్యూట్ స్థాపించి కొంతకాలం నడిపాడు. ఇతడికి విదేశాలలో వెళ్ళి చదువుకోవాలనే ఆసక్తి ఉండేది. కాని అతని బావ ప్రోద్బలంలో సినిమా రంగంలోనికి అడుగు పెట్టాడు.

మొదట ఇతడు పి.పుల్లయ్య వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా చేరాడు. కన్యాశుల్కం, జయభేరి చిత్రాలకు పుల్లయ్య వద్ద పనిచేశాడు. ఆ సమయంలో బాలనాగమ్మ సినిమాకు తమిళ డబ్బింగ్ హక్కులు కొని నిర్మాతగా మారాడు. ఆ చిత్రం విడుదలై అతడికి లాభాలు తీసుకువచ్చింది. దానితో అతడు విశ్వశాంతి అనే సంస్థను స్థాపించి 15 తమిళ, తెలుగు డబ్బింగ్ సినిమాలు నిర్మించాడు. డబ్బింగ్ చిత్రాల వల్ల వచ్చిన ఉత్సాహంతో కంచుకోట, నిలువు దోపిడి, పెత్తందార్లు, దేశోద్ధారకులు వంటి భారీ చిత్రాలను నేరుగా నిర్మించి నిర్మాతగా స్థానం సంపాదించుకున్నాడు.

వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలు తీసినా తన ఆశయాలను ప్రతిబింబించే చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశంతో అటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు ఎవరూ ముందుకురారని తనే దర్శకుడిగా అవతారం ఎత్తాడు[4].

సినిమాలు
ఇతడు నిర్మించిన చిత్రాలు:

  1. కంచుకోట (1967)
  2. నిలువు దోపిడి (1968)
  3. పెత్తందార్లు (1970)
  4. దేశోద్ధారకులు (1973)

ఇతడు దర్శకత్వం వహించిన సినిమాలు:

  1. తీర్పు (1975)
  2. నగ్నసత్యం (1979)
  3. హరిశ్చెంద్రుడు (1981)
  4. కీర్తి కాంత కనకం (1983)

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు యూ. విశ్వేశ్వరరావు(92) చెన్నై లో కరోనా సోకి కన్నుమూశారు. ఎన్టీఆర్ కు ఆయన వియ్యంకుడు అవుతారు. విశ్వశాంతి విశ్వేశ్వరరావుగా పేరోందిన ఆయన పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన విశ్వేశ్వరరావు బీఎస్సీ వరకు చదువుకుని గుడివాడలో ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించారు.

తొలి రోజుల్లో ఆయన రంగస్థల నటుడు, నాటక రచయిత. విశ్వేశ్వరరావు మంచి గేయ రచయిత, కధకుడు కూడా. అతని బావ దావులూరి రామచంద్రరావు ప్రోద్భలంతో సినీరంగంలోకి ప్రవేశించిన విశ్వేశ్వరరావు తొలుత పి.పుల్లయ్యవద్ద దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా చేరారు. కన్యాశుల్కం, జయభేరి చిత్రాలకు పుల్లయ్య వద్ద సహయ దర్శకుడిగా పనిచేశారు. ఆ సమయంలో బాలనాగమ్మ సినిమాకు తమిళ డబ్బింగ్ హక్కులు కొని నిర్మాతగా మారారు. ఆ చిత్రం విడుదలై నిర్నాతగా ఆయనకు లాభాలు తెచ్చి పెట్టింది.

ఆ ప్రోత్సాహంతో ఆయన విశ్వశాంతి అనే పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. తమిళ, తెలుగు భాషలలో 15 డబ్బింగ్ సినిమాలు నిర్మించారు. డబ్బింగ్ చిత్రాల వల్ల వచ్చిన ఉత్సాహంతో కంచుకోట, నిలువు దోపిడి, పెత్తందార్లు, దేశోద్ధారకులు వంటి భారీ చిత్రాలను నేరుగా నిర్మించి నిర్మాతగా స్థానం సంపాదించుకున్నారు.

వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలు తీసినా, తన ఆశయాలను ప్రతిబింబించే చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశంతో అటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు ఎవరూ ముందుకు రారని తనే దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ఆయనే కథను సమకూర్చుకునే వారు. కంచుకోట, తీర్పు, పెత్తందార్లు, మార్పు, నగ్నసత్యం, హరిశ్చంద్రుడు వంటి 25 సినిమాలు నిర్మిoచారు.

‘దేశోద్థారకులు’ చిత్రంలో ‘ఆకలై అన్నమడిగితే పిచ్చోళ్లు అన్నారు నాయాళ్లు’ అనే పాటను ఆయనే రాశారు. ‘నగ్నసత్యం’, హరిశ్చందుడ్రు’ చిత్రాలకు ఆయన జాతీయ పురస్కారాలు అందుకోగా, ‘కీర్తి కాంతా కనకం’, ‘పెళ్లిళ్ల చదరంగం’ చిత్రాలకు గానూ రెండు నందులను సొంతం చేసుకున్నారు.

17వ నేషనల్‌ అవార్డ్‌ సెంట్రల్‌ జ్యూరీ మెంబర్‌గా ఉండడమే కాకుండా సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శిగా కూడా విశ్వేశ్వర రావు పనిచేశారు.

·

కుమార్తె శాంతిని ఎన్టీఆర్‌ కుమారుడు– కెమేరామ్యాన్‌ మోహనకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. అలా రామారావుకి విశ్వేశ్వర రావు వియ్యంకుడు అయ్యారు. 1986లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరిగింది. ఆ సమయంలో ఏపీ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా విశ్వేశ్వరరావు చేశారు. ఎఫ్‌డీసీ డైరెక్టర్‌ చైర్మన్‌తో పాటు సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో అనేక పదవుల్లో తన సేవలు అందించారు. విశ్వేశ్వర రావుకి కుమార్తెలు మంజు, శాంతి, కుమారుడు ధనుంజయ్‌ ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉన్నారు. ఒక కుమార్తె హైదరాబాద్‌లో ఉన్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తండ్రి కడచూపునకు కూడా పిల్లలు చేరుకోలేని పరిస్థితి. దీంతో విశ్వేశ్వరరావు భౌతికకాయానికి గురువారం చెన్నైలో ఆయన మిత్రులే అంత్యక్రియలు నిర్వహించారు.
సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.