మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-161

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-161

· 161-మూడేళ్ళు హీరో కృష్ణకు 30సినిమాలలో పాడిన సింహాసనం లో ,’’ఆకాశామలో ఒకతార’’ఫేం –రాజ్ సీతా రాం

· సూపర్ స్టార్ కృష్ణ హీరోగా దూసుకుపోతూ 250 వ సినిమా వైపుకి అడుగులు వేస్తున్నారు. అయన సంవత్సరానికి 12 సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు. కృష్ణకు,గాయకుడు బాల సుబ్రహ్మణ్యంనకు ఒక విషయంలో తేడా వచ్చింది. కృష్ణ నా సినిమాలకు పాడవలసిన అవసరం లేదని అనడంతో బాలు కూడా సరే అన్నారు. కృష్ణ జేసు దాసుతో వరుస సినిమాలకు పాటలు పాడించుకుంటున్నారు. ఇది 1985 నాటి మాట. అప్పుడు కొత్త గాయకుడికి ఒక బంపర్ ఛాన్స్ దొరికింది. అతని పేరు రాజ్ సీతారాం. రాజ్ సీతారాంతో కృష్ణ దాదాపుగా 30 సినిమాలకు పాటలు పాడించుకున్నారు. ఇప్పుడు శంకర్ మహదేవన్,ఉదిత్ నారాయణ్ ఎలా అయితే వైవిధ్యాన్ని చూపేవారో,అప్పట్లో రాజ్ సీతారాం గొంతు కృష్ణకు బాగా సెట్ అయింది.

·

· రాజ్ సీతారాం కృష్ణకు 1985 నుంచి 88 వరకు అంటే మూడు సంవత్సరాలు పాడగా వాటిలో 14 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సూర్య చంద్ర,బ్రహ్మాస్త్రం,సింహాసనం,ఖైదీ రుద్రయ్య,తండ్రి కొడుకుల ఛాలెంజ్,దొంగోడొచ్చాడు,ముద్దాయి వంటి సినిమాలకు పాడాడు. ఇక ఆ తర్వాత కృష్ణ సినిమాల్లో అయన పాడటం ఆపేసారు. ఎందుకంటే రాజ్ సీతారాంకి పాటలు పాడటం ఒక హాబీ మాత్రమే.

·

· కృష్ణ సినిమాలకు పాటలు పాడకముందే శోభన్ బాబు సినిమా జగన్ లో ఒక పాట పాడారు. ఆ తర్వాత రాజ్ సీతారాంకి పెద్దగా సపోర్ట్ లేకపోవటం,కృష్ణ సినిమాలకు బాల సుబ్రహ్మణ్యంతో పాడించటానికి రాయబారాలు సక్సెస్ అవ్వటంతో ఆ తర్వాత కృష్ణ సినిమాలకు బాల సుబ్రహ్మణ్యం పాడటం వరుసగా జరిగిపోయింది.

·

· 1990 పత్రికల్లో బాలుని ఎన్టీఆర్,ANR, శోభన్ బాబు తిరస్కరిస్తే కృష్ణ ఆదరించారని చెప్పుతారు. అయన వారి మధ్య గ్యాప్ పెరిగింది. ఇప్పటికి పల్లెలలో రాజ్ సీతారాం పాడిన సింహాసనం పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే రాజ్ సీతారాం ఏమి చేస్తున్నారనే సందేహం కలుగుతుందా? ఆ తర్వాత రాజ్ సీతారాం Rural Management లో డిగ్రీ చేసారు. గుజరాత్‌లో ఈ కోర్సు తర్వాత, శ్రీరామ్ వెంచర్స్ గ్రూప్‌లో కొన్నాళ్లు పని చేశాడు. ఆ తర్వాత వీడియోకాన్ గ్రూపులో కూడా పని చేశాడంటారు. ఐతే యూఎస్ లో ఐవా ఫార్మా పిటిఈ లిమిటెడ్ అనే పెద్ద కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా పదవి నిర్వహిస్తున్నాడు. న్యూ జెర్సీ ప్రిన్స్‌టన్ ఏరియాలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. జెనెరిక్ ఫార్మాలో ఇది కూడా లీడింగ్ కంపెనీ. రెండేళ్ల క్రితమే ఈ సంస్థకు అమెరికా నుంచి 30 మిలియన్ డాలర్ల భారీ ఫండింగ్ సమకూరింది. ఇంత పెద్ద కంపెనీకి ఉపాధ్యక్షుడిగా పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ సీతారాం జగ్గీ వాసుదేవ్ నిర్వహించే ఈషా ఫౌండేషన్‌లో వలంటీర్ గా కూడ పని చేశాడు. పర్యావరణ హితం కోరుతూ జరిగే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటుంటాడు రాజ్ సీతారాం.

· · గుజరాత్ లో శ్రీరామ్ వెంచర్స్ లో కొంతకాలం పనిచేసారు. ఆ తర్వాత కొంతకాలం VIDEOCON లో కూడా పనిచేసారు. ఆ తర్వాత US వెళ్లి సెటిల్ అయ్యారు. రాజ్ సీతారాం US లో పెద్ద కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-3-22-ఉయ్యూరు

· ఆకాశంలో ఒక తార-రచన వేటూరి -గానం రాజ్ సీతారం ,సంగీతం -బప్పిలహరి

ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ
ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ

ఇలలో ఒక చందమామ
ఒడిలో పొంగింది ప్రేమ
ఇలలో ఒక చందమామ
ఒడిలో పొంగింది ప్రేమ

తార జాబిలి కలవని నాడు
ఏ వెన్నెలా లేదులే

ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ

అనురాగం అందంగా మెరిసింది
నీ కళ్ళలోన అందుకో నా లేతవలపే
నీ ముద్దుముంగిళ్ళలోన

అనురాగం అందంగా మెరిసింది
నీ కళ్ళలోన అందుకో నా లేతవలపే
నీ ముద్దుముంగిళ్ళలోన

కదిలే నీ ప్రాణశిల్పం
మదిలో కర్పూరదీపం
కదిలే నీ ప్రాణశిల్పం
మదిలో కర్పూరదీపం

నింగి నేల కలిసినచోట
ఏ వెలుతురూ రాదులే

ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ

ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో
ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి
దోసిళ్ళలోన

ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో
ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి
దోసిళ్ళలోన

ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో
ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి
దోసిళ్ళలోన

అలలై నా సోయగాలు పాడాలి
యుగయుగాలు
అలలై నా సోయగాలు పాడాలి
యుగయుగాలు

వాగు వంక కలవని నాడు
ఏ వెల్లువ రాదులే

ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ

కాలంతో ఈ బంధం
ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన

కాలంతో ఈ బంధం
ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన

నీవే నా రాచపదవి
నీవే నా ప్రణయరాణివి
నీవే నా రాచపదవి
నీవే నా ప్రణయరాణివి

నీవు నేను కలవకపోతే
ప్రేమన్నదే లేదులే

ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ
తార జాబిలి కలవని నాడు
ఏ వెన్నెలా లేదులే

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.