రాంగేయ రాఘవ -4 నవలలలో నవ చైతన్యం

r

రాఘవ  సాంఘిక ,నగరజీవిత ,గ్రామీణ జీవిత నవలలు,చారిత్రకనవలలు ,జీవిత చారిత్రాత్మక, ,ప్రాంతానికి చెందిన ,నిర్దుష్ట వాతావరణ సన్ని వేశ,ప్రాంతానికి సంబంధించిన  నవలలు  రాశాడు .నగర జీవిత నవలలో చోటీసీ బాత్ ,విషాద్ మఠ్,రాయి ఔర్ పర్వత ,సీదాసాదా రాస్తా ,హుజూర్ ఉన్నాయి. వీటిలో అనేక సమస్యలు స్పృశించాడు .పట్టణ జీవితానికి చెందిననవలలు –ప్రొఫెసర్ ,కల్పనా,ఉబాల్ ,పత్ ఘర్ .లేఖలరూపం లో చోటీసీ బాత్ రాశాడు .

  విషాద్ మఠ్ నవల బెంగాల్ కరువుపై మానవత్వం పై కరుణ రసార్ద్రంగా రాశాడు .సీదాసాదా హుజూర్ లలో మార్క్సిస్ట్ జీవన దృక్పధాన్ని తెలిపాడు .హుజూర్ లో రచనా శిల్పం బాగా ఆకట్టుకొంటుంది .కష్టపడి పని చేసే శ్రామికుడికి పూర్తీ అధికారం రానంతవరకూ వాడి ప్రపంచం దిక్కూమొక్కూ లేకుండా ఉంటుంది అని హెచ్చరించాడు .గ్రామీణ నవల’’పథ్ కా పావ్ ‘’దారిలోపాపం ,ఆఖరి ఆవాజ్ –చివరి కేక నిజంగానే’’ కేక ‘’అనిపిస్తాయి .నైతిక పతనం ,పంచాయితీ అవినీతి పూర్తిగా కళ్ళకు కట్టించాడు .నైతికపతనం పైఎక్కువ బాధపడి రాశాడు .పథ్ కాపాప్ లో శైలీ వ్యంగ్యాత్మక రచన మనసుకు పడతాయి .

  చారిత్రకనవలలో సమకాలీన జీవన సత్యాలు వర్తమానం లోకి ఆకర్షిస్తే భారతీయ ఆత్మ అయిన భాషా సంస్కృతులగమనం  తనను ఆకర్షించింది అన్నాడు .శవాలగడ్డ అనే ముర్దోం కా టీలా నవలలో మొహంజదారో మహానాగరకత పతనాన్ని బాధా తప్త హృదయం తో రాశాడు .చాలాసంయమానం తో రాశాడని మెచ్చారు .సంస్కృతి లోని బానిస బానిస లాగానే మాట్లాడుతాడు .ఆధునిక జీవన సమస్యలు ఇందులోకి చొప్పించలేదు రాఘవ .’’చారిత్రిక రచనల్లో యుగాన్నే చూశాను యుగం ద్వారానే వ్యక్తిని చూశాను .అతడు సత్యాన్వేషణలో ఉన్నట్లు నాకు కనిపించాడు ‘’అన్నాడు .రాజశ్రీ పాత్ర ఆదర్శానికి ప్రతీక .ద్వంద్వ యుద్ధం తో తేల్చుకోవలసిన దాన్ని సామూహిక మారణ కాండ యుద్ధం లోకి లాగటం ఎందుకని రాజశ్రీ ప్రశ్నిస్తే అది పుష్యభూపతి వంశ గౌరవానికి సంబంధించి అని సేనాపతి అంటే ‘’కాదు అది భ్రాంతి, దోపిడీ ,పురుష దౌష్ట్యం ‘’అంటుంది సంయమనం అంటే పలాయనం కాదు ఆరోగ్యప్రవాహం .స్వార్ధం పశుత్వ భావన .

దేవకికా బేటాలో కృష్ణుని మొదటిపదహారేళ్ళు కంస వధతో పూర్తవుతుంది .మూఢనమ్మకాలను తర్కబుద్ధితొఆలొచి౦చి  చెప్పాడు ‘’అద్భుతాలమధ్య సత్యం మునిగి పోతుంది ‘’అన్నాడు .కబీర్ తులసీదాస్ విద్యావతి ల జీవిత చరిత్రలు రాశాడు .వీటిలో హీరో వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది .యశోధర తన పరిమితుల్లో బంధింప బడినా, ఆధునిక స్త్రీకి ఉండాల్సిన స్వాభిమానం, హక్కులను ప్రస్తావిస్తుంది .’’అతడు భర్త .అతడి దయను కాను నేను .నాకు సరి సమానమైన హక్కులు కావాలి ‘’అంటుంది యశోధర.పలాయనం ఆమెదృష్టిలో అధర్మం పురుషా హంకారం పై తిరగబడింది ‘’జన్మ దుఃఖ కారణం తెలుసుకోపోలేయినంత మాత్రాన రాజ్యాధికారం దుఖం అని అన్న మాత్రాన అది దర్శన అ౦టేతత్వం అయిపోతుందా “’అని ప్రశ్నించింది .

  కృష్ణుడు కూడా ‘’నాకు కులం, వంశం కన్నా జనం గొప్ప. అన్యాయాలు అత్యాచారాలు విధ్వంసమైన ప్రపంచం లో సుఖ శాంతులు ప్రవేశించటానికే నేను జీవించి ఉంటాను ‘’అని స్పష్టం చేశాడు .నవీన మానవుడిని సమాజ వికాసం తోపాటు భారత దేశం లోకానికి ఇవ్వగలదు ‘’.సామాజిక వికాసం తో వ్యక్తీ అంతరించిపోదు ,దానికి భిన్నంగా అతడు వికసిస్తాడు’’ అన్నాడు రాఘవ .కబీరు జ్ఞాన రహస్యంలో మునిగిపోయిన వాడు ఆయన్ను ఎవరూ సరిగా అర్ధం చేసుకోలేదు అంటాడు .రాజస్థాన్ దొమ్మరి వాళ్ళ సర్కస్ ఫీట్ లను ,అక్కడి స్త్రీ పురుష సంబంధాలను ,లైంగిక నీతిగురించి ‘’కబ్ తక్ పుకారూ ‘’నవలలో గొప్పగా ప్రదర్శించాడు రాఘవ  .ధర్తీ మేరాఘర్ లో రాజస్థాన్ లోహ పీటులఅంటే కమ్మరి పనులు చేస్తూ ఉండే సంచార జీవుల మూఢనమ్మకాలు ,జీవన విధానాన్ని దగ్గరుండి పరిశోధించి  జీవిత చరిత్ర గా చూపాడు .వాళ్ళ జీవితాలను వాళ్ళ దృష్టిలో చూసి రాయటం రాఘవ ప్రత్యేకత ..అందులో ఒకడు ‘’నేను ఈలోకం లోకి వచ్చినప్పుడు నాకు కులం లేదు ,పోయేప్పుడూ ఉండదు .ఇప్పుడు నేను మానవుడిని .ఆకాశాన్ని అలాగే విశాలంగా ఉండనీయండి .భూమిని బంధించకండి .మధ్యమీరు లేపిన గోడలు కూల్చేయండి.నేను నిర్మలంగాస్వతంత్రంగా ఉన్నాను ‘’అంటాడు కాదు అనిపిస్తాడు రాఘవ .

  ఎక్కువగా రాయటం వలన రాఘవ శైలీశిల్పం దెబ్బ తిన్నాయి .అతనిదిఎక్కువగా శిల్ప దృష్టి .గాంధీ త్యాగం నిష్ఠ సేవాభావాలను మహత్తరంగా కీర్తించాడు .సుగుణ రాశి అన్నాడు. రాజకీయ మూర్ఖత్వం లేని వాడు రాఘవ .రాఘవ నవలలో నవ చైతన్యం సమర శీలత్వం ఉన్న మానవుడి సంస్కారంగా అభి వృద్ధి చెంది ,మహత్తర మార్పుకోసం పాటు పడే ఇంగిత౦ గా  కనిపిస్తుంది .విశ్వాసం దాని లక్ష్యం వివేకం దాని లక్షణం .

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-22-ఉయ్యూరు  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.