మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-276

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-276
• 276-ఆంధ్రా యూని వర్సిటి స్టేజి డైరెక్టర్’’ ,రాగరాగిణి ‘’నాటకం ఫేం ,నాటకగిరీశం ,నటరాజు –కె.వెంకటేశ్వరరావు -2
కె. వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో ప్రదర్శితమైన ‘ర్రాగరాగిణి’, ‘ఫణి’ వంటి
నాటకాలలో వాన్తవికత కొట్టవచ్చినట్టు కన్పిన్తుంది గతివిన్యాసాలు,
వాచికాభినయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నట్టు స్పష్టమవుతుంది నాటకం
చూస్తున్నట్టుకాక ఆ సన్నివేశాలు జరుగుతున్నచోట ఆ వ్యక్తుల మధ్య కూచొని
చూస్తున్న ఆనుభూతి కలుగుతుంది సామాజికులకు కాని వీరి నాటకాలన్నీ
ఎకపాత్రాత్మకాలు కావడం విశేషం నాటకరంగంలో డా రాజారావు తర్వాత ఆంత
చరిత్ర సృష్టించిన నటుడు,దర్శకుడు శ్రీవేంకటేశ్వరరావు
శ్రీ క వేంకటేశ్వరరావు ఒక వ్యక్తి కాదు.ఒక వ్యవస్థ ఒక ఉద్యమం శ్రీ
ఆత్రేయ తర్వాత నాటకరంగంలో పెనుమార్పులు తెచ్చి చరిత్ర సృష్టించిన
కారణజన్ముడు వెంకటేశ్వరరావు ఆంధ్ర నాటక రంగస్థలి మీద’వెంకటేశ్వరరావు
స్కూల్‌ ఆప్‌ ఎక్షన్‌ అని ముద్రవేశారు వేంకటేశ్వరరావు తర్వాత స్థానం
వేంకటేశ్వరరావుదే అన్నంత ఎత్తుకు ఎదిగారు
“ఆయనలోని జీనియన్‌ ఏమిటంటే, ఆయనకు కొత్తపద్ధతుల్ని నటనలో
పాతపద్ధతులుగానూ, పాతపద్ధతుల్ని కొత్త పద్ధతులుగానూ చూపించగల ప్రతిభ
ఉండేది“ అని ప్రశంసించారు రాచకొండవారు
వెంకటేశ్వరరావుగారు నాటక ప్రయోక్తగా ఒక వైతాళికుడు అని చెప్పుకోవాలి
అంటే, ఎన్నో కొత్త బాటలను, కొత్త ప్రయోగాలను చేశారు సంభాషణ ఒకటైనా
లేకుండా ఆయన దర్శకత్వం వహించి ప్రదర్శించిన బెత్తం మనిషిఅందుకు
తిరుగులేని ఉదాహరణ

వేంకటేశ్వరరావు ప్రదర్శించిన పావలా, త్రివేణి.బెత్తం మనిషి, విషాదం,
కొడుకు పుట్టాల మొదలయిన నాటికలు, అసురసంధ్య, ‘ ఫణి, రాగరాగిణి,
వీలునామా, ఆకాశరామన్న, మహానటుడు వంటి నాటకాలు వారి దర్శకత్వంలో
విలక్షణతను చాటే ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు

“1950 .60 మధ్యకాలంలో ప్రజానాట్యమండలి శక్తిమంతంగా లేదు ఆ
లోటును వేంకటేశ్వరరావు, తన నాటక్నాలద్వారా, ప్రజానాట్యమండలి ఆదర్శాలను
నిలబెట్టారు వేంకటేశ్వరరావు వాచిక విధానంతో, నడకతో, హావభావాలతో,
సంభాషణల మధ్య వచ్చే కించిత్‌ విరామంలో విద్యుద్దాతంలా ఆతి వేగంగా
మాట్లాడే సంభాషణలతో పాత్రలతో ఆడుకుంటాడు .ఆయన నటించిన
నాటకాలుగాని పాత్రలుగాని తాను లేకపోతే రక్తి కటైవికావు ఒకవేళ ఎవరైనా
ప్రదర్శించినా వెంకటేశ్వరరావు, నాటక వాచికాభినయ విధానప్రభావం వారిమీద
ఉండేది”
“తెలుగు నాట, నాటక ప్రక్రియ నూతన పద్ధతులు అనుసరించటానికి కీశే |
ఆత్రేయ మార్గదర్శకుడైతే నటనలో వేగం, ఉచ్చారణలో స్పష్టత, ప్రత్యేకత |
తెచ్చింది శ్రీ వేంకటేశ్వరరావేనన్న విషయం ఆందరం ఒప్పకొని తీరాల్సిందే” ఆని
ధ్రువీకరిస్తున్నారు ప్రసిద్ధ రంగస్థల దర్శకులు, రచయిత ఆయిన శ్రీ
కెయస్‌ టి శాయి
“ఆయన నాటకాలు వేస్తున్నంత కాలం, నాటకానికి ఆయనే కర్త, కర్మ
‘క్రియగా, మారి, అంతవరకూ నాటకానికున్న రంగు, రుచి, వాసనల్ని మార్చి
నాటకాన్ని కొత్త పంథాలోకి మార్చిన ట్రెండ్‌ సెట్టర్‌గా వేంకటేశ్వరరావు గారిని
పేర్కొనాలి ఆయన తెలుగు నాటక రంగానికుండే పరిమితుల్ని, ప్రదర్శనావకాశాల్ని
మాత్రమే దృష్టిలో పెట్టుకొని నాటకాన్ని ప్రదర్శించేవాడు రష్యాలో రంగస్టలం | ఎంతో ఎదిగింది, అమెరికాలో మరీ ఎదిగిపోయింది అంటూ విదేశీ మాటలు | చెప్పి, స్వదేశీనాటకాన్ని చిన్న చూపు చూడకుండా, చాలా పరిమితులకు లొబడి |
బ్రతుకుతున్న తెలుగు రంగస్థలం మీదే నాటకాన్ని బ్రతికించారు ఒక్క మాటలో |
చెప్పాలంటే, ఆయన చాలా ప్రాక్టికల్‌ దృష్టి వున్న ప్రయోక్త” ఆన్న ప్రసిద్ధ నాటకకర్త
కాశీ విశ్వనాథ్‌ గారి మాటలు ఆలోచింపదగినవి
పాశ్చాత్య నాటక విధానాలను (ధియేటర్‌ స్టయిల్స్‌) తెలుగు రంగస్థలంమీద
ప్రవేశపెట్టి, అవి ఇక్కడి సంస్కృతికి సంప్రదాయాలకు విరుద్ధంగా, కృతకంగా
ఉన్నా “మేము కొత్త ప్రయోగం చేశాం చూడండి “అని సామాజికులచేత
బలవంతపుమాఘ స్నానం చేయించి సంబరపడే ప్రయోక్తలు తెలుగు రంగస్థల
పరిమితుల్ని దృష్టిలో ఉంచుకొని ప్రయోగాలు చెయ్యగలిగినపుడే ఆ నాటకానికి,
ఆ ప్రయోగానికి గుర్తింపు, మనుగడ ఉంటుంది ఆలా కానపుడు కొత్తగా పుట్టే
ప్రతి ప్రయోగానికి (ఎక్స్‌పెరిమెంట్‌) ఆదే తొలి ప్రదర్శన, ఆదే తుది ప్రదర్శన

ఆయ్యే ప్రమాదం ఉంది నిజానికి తెలుగు రంగస్తలంమిద ప్రదర్శితమైన
జో గ్‌ పాశ్చాత్య ధౌరణిగల నాటకాలలో అత్యధిక శాతం ఈ ఆగ్నిపరీక్షకు బలి
శ ఎత ఇన prt అలం శల an శీ 1 అయిపోయిన. నెలవిదచి సాముచెయడల ఉముచెతుం కాదుగదా”
దేంకటేశ్వరరావు దర్శకత్వం వహంచిన క్రతి నాటకంలొనూ తెలుగుతనం
ఉట్టిపడుతూ ఉండటం ప్రముఖంగా గుర్తుంచుకోవలస్‌న ఆంశం
నాటకరంగంలో ఒక కొత్త ప్రయోగం అనగానె రంగస్టలం మీద కళ్ళు
చెదిరిపోయేటట్టు రంగాలంకరణ చెయ్యడమో, రంగస్థలంమీద లెనెల్స్‌
| నిర్మించడమో లైటింగుతో విన్యాసాలు చేయించడమో, విదేశీ సరుకును తెచ్చి
కొత్త లేబుల్‌ తగిలించి మసి బూసి మారీడుకాయలా చూపించడమో
కాదు ఇప్పుడున్న ప్రదర్శనా రీతులకు భిన్నంగా కొత్త తనం చూపుతూ ప్రదర్శనలో
విలక్షణత చూపే ఎ నూతనాంశమైనా ప్రయోగమే ఆలాంటి ప్రయోగం చెసిన
వారిలో శ్రీ పామర్తి సుబ్బారావు అగ్రగామి పాత్ర పోషణలో మనస్తత్త్వం
| ముమ్మూర్తులా ప్రతిఫలించేటట్ట చేయటమే ఆ ప్రయోగం ప్రదర్శన చూసిన
bei es సగ Fr=
తరా౭త ఆ పాత్ర సామాజికుల గుండెల్లొ ఇమిడిపోతుంది మనోవీఫిలో అనుక్షణం
సంచరిస్తూనే ఉంటుండి ఆ నాటకం ఆ పాత్రలు, ఆ సన్నివెశాలు మనసులో
కాక్య్వతంగా మెదులుతూనే ఉంటాయి ఆ ప్రదర్శనా ప్రభావంవల్ల అయితే దీనికి |
వేదరనా పటిమ ఒకు.టే కారణం అని చెపడం అనాఃయం రచనలోకూడా ఒక స జ bs ళో ఫ్రీ
‘ మెరుపు లేకపోతే ఇసుక తిన్నెల మిద సుందరభవన నిర్మాణం సాధ్యం కాదనే
| విషయం కూడా జ్ఞాపకం ఉంచుకొవాలి కొత్త ప్రయోగం చేసే ఎ దర్శకుడైనా
‘ రచన విషయంలో, తన లక్ష్య సాధనకోసం, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు
  కె.వెంకటేశ్వర రావు అంటే మా ఇంట్లో అందరికీ విపరీతమైన అభిమానం ముఖ్యంగా నాకూ మా శ్రీమతి ప్రభావతికి .రేడియో లో ఆయన
నాటకం వస్తుంటే పరవశం చెందేవాళ్ళం .ఆయనగురించి పేపర్లలో వస్తుంటే పులకించి పోయే వాళ్ళం .నాలుగైదు సినిమాలలో నటించి ఉం
టాడు .ఆ వాచికం అభినయం నా అన్యతో దర్శనీయం .ఆయన గురించి వివరాలు సేకరించమని మా అబ్బాయి శర్మ కు చెబితే ,కష్టపడి
సంపాదించి పంపాడు .కానీ ఇంకా అతని గురించి చాలా వివరాలుంటాయి ఎవరికైనా తెలిస్తే తెలియ జేయండి .ఆయన లాంటి వారికోసమే
ఈ శీర్షిక మొదలు పెట్టా .నా జన్మ ధన్యమైన దను కొంటున్నాను .ఇంకా ఇలాంటి మహానుభావులగురించి తెలుసుకొని తెలియ జేస్తూ
ఉంటాను .

  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.