మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-283

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-283
283-బీదలపాట్లు ,అగ్గిరాముడు ,విమల చిత్రాలు నిర్మించిన –పక్షిరాజా వారి ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు
పక్షిరాజా స్టుడియోస్ ఒక సినీ నిర్మాణ సంస్థ. దీనిని ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు (1910-1976) కోయంబత్తూరులో 1945లో స్థాపించాడు. ఈ సంస్థ తెలుగు భాషతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, సింహళ భాషలలో సినిమాలు నిర్మించింది.

పక్షిరాజా పతాకంపై నిర్మాత ఎస్‌.ఎమ్‌ శ్రీరాములు నాయుడు ‘బిదలపాట్లు 1 (దర్శకత్వం-రామనాథ్‌) అగ్గిరాముడు, విమల మొ చిత్రాలు నిర్మించారు,

  
విమల
“కొన్ని పాటలు వింటున్నప్పుడు చాలా బాగుంటాయి. కొన్ని పాటలు పదిమందిలో పాడేటంత ఉదాత్తంగా, గౌరవనీయమైన స్తానంలో ఉంటాయి.
కొన్ని పాటలు స్వర రచనా పరంగా క్లీష్ణంగా ఉన్నా సరే ఆదరించదగ్గ స్థాయిలో ఉంటాయి. ఈ మూడు అర్హతలనూ కలిగి ఉన్నా కేవలం కాస్‌ అనే ఒక
వర్గానికి మాత్రం కట్టుబడిపోయి ఎంతో మందికి అందకుండా ఉండిపోయిన మంచి పాటలలో

చిత్రంలోని ఓ రెండు పాటలు వస్తాయి. 1960 లో విడుదలయిన ఈ చిత్రానికి మాటలూ-పాటలూ ముద్దుకృష్ణ రాశారు. సంగీతం సుబ్బయ్యనాయుడు
అందించారు. సుబ్బయ్య నాయడు అనగానే తెలుగువారందరికీ ‘మురిపించే మువ్వలు’ చిత్రం…నీ లీల పొడెదదేవా’ పాట ..గుర్తొచ్చేస్తాయి. యన్‌.టి.ఆర్‌, భానుమతి
నటించిన ‘అగ్గిరాముడు’ చిత్రాన్ని నిర్మించిన పక్షిరాజా సంస్థకు సుబ్బయ్య నాయుడు సంగీతాన్ని అందించే వారు. ఆ పక్షిరాజా సంస్టే నిర్మించిన ఈ
చిత్రం ద్వారా అందించిన ఓ రెండు ఉత్తమ గీతాలివి.

అ: కన్నుల్లొ నీ బొమ్మచూడు నా….కన్నుల్లొ నీ బొమ్మచూడు
అది కమ్మని పాటలు పొడు ॥కన్నుల్లొ॥
ఆ; పున్నమ వెన్నెల వన్నెలలో ॥ పున్నమః స కన్నుల కట్టిన రూపముతో
నీవే మనసున తోచగా నీవే
నను నేనే మరిచిపోదురా ॥కన్నుల్లొ॥
అ; కోయిల పాటల తీరులతో ॥కోయిల॥
సరికోయిల రాగాలల్లుదమా ॥సరి; =
ఆ; నచ్చిన పూవు గద నేను ॥ నచ్చినః
కోరి వచ్చిన తుమ్మెద నీవెరా కన్నుల్లో!
అ; రాగమాలికల వీణనీవే రాగ!
అనురాగము లేలే జాణవెలే ॥ అను॥
ఆ; నీవే వలపుల జాబిలిరా నీవే!
సరి నేనే కులుకుల వెన్నెలరా ॥కన్నుల్లొ!

ఈపాటను మరొక అద్భుత స్వరరచనగా పేర్కొనాలి. ఈ పాటను కూడా ఘంటసాల, జయలక్ష్మి పాడగా ఎన్‌.టి.ఆర్‌, సావిత్రిపై చిత్రీకరించారు.
ఇది ఒక రాగమాలికా గీతం. సాధారణంగా రాగమాలిక అనగానే ఒక రాగం నుంచి ఇంకో రాగంకి స్వర రచన మారినప్పుడు శ్రోతలు ఒక విధమైన
జంప్‌ని ఫీలవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి జంప్‌ని ఎక్కడా కనబడనీయకుండా సాఫీగా స్వరపరచబడిన గీతమిది. పల్లవికి పహాడి రాగం
బేస్‌గా ఉంటే “పున్నమ వెన్నెల. వన్నెలలో చరణానికి రాగేశ్రీ రాగాన్ని, “కోయిల పాటల తీరులతో’ చరణానికి తిలంగ్‌ రాగాన్ని ‘రాగమాలికల వీణ
నీవె చరణానికి కాఫీ రాగాన్ని వాడుకున్నారు. ఈ రాగాలను వాడుకోవడంలో కూడా జనరంజకత్వం కోసం రాగేశ్రీ రాగంలో రాని కాకలినిషాదాన్ని-
తిలంగ్‌ రాగంలో లేని రిషభాన్ని ఉపయోగించారు. ఇవికాక ఉపయోగించిన రూపక తాళ ప్రకారంగా చూసుకుంటే కర్ణాటక శాస్త్రీయ సంప్రదాయానికి
కావలసిన రీతిలోని ఆరు మాత్రల నడకలో ఉండే రెండు మాత్రల చొప్పున మూడు ఖండాలుగా కాకుండా హిందుస్థానీ పద్ధతిలో ఉపయోగించే
మూడు మాత్రల చొప్పున రెండు ఖండాలుగా నడిపించటం ఓ ప్రత్యేకత ప్రయోగంగా పేర్కొనాలి. ఇక పాడిన ఘంటసాల, జయలక్ష్మి-బిందువులో
సింధువులా తమ ప్రతిభనంతా ఎంతో క్లుప్తంగా, వినేవాళ్ల గుండెల్లో నిక్షిష్తంగా ఉండేట్లు ప్రదర్శించారు.

అ: కన్నుల బెళుకే కలువలురా కన్నుల! కన్నియ తళుకే కనకమురా ॥కన్నుల॥
కలవోలే కనిపించే కల!
కలలోనె వలపించే ॥కల॥
కనులలో ఆ రూపే కాపురమైపోయే ॥కను॥కన్నుల॥
; కనరాని అందాలనే
కనులార కనినంతనే ॥కనరాని॥
వనమేమొ ఈ వేళనే ॥వన॥
నందనమనిపించెనే ॥నందన॥
॥విరు॥
చిరు!
॥లఎన॥
హృదయాలు కదిలించెనే 1హృద॥ కనరాని॥
; ఇటు చూడు ఇటు చూడవే ఇటు!
ఇది ఏమి మటుమాయమే ఇటు!
; వనరాణి వగలాడిగా కునుసైగ కావించగా ॥వన॥
వనమేమొ ఈ వేళనే నందనమని పించెరా ॥1వన॥
॥విరి॥
॥చిరు॥
కరిగించెరా ॥ఎనరాని;వనరాణి॥
: కోరి కోరి నీ రూపము కనగా ॥కోరి॥
తీరును ఆకలి దాహములే ॥తీరును॥
చేరి చేరి నీ పాటలు వినగా ॥చేరి॥
చిందును అమృత బిందువులే ॥చిందును।॥ ॥కోరి॥
అః కలలు ఫలించె కాలములో ॥కలలు॥
కలిసిన ప్రేమలు శాశ్వతమే ॥ కలిసిన ॥
ఆ; కలనైనా మెలకువనైనా కల!
లోకము సుందర నందనమే లోకము! కలలు!

ఈపాటను ఘంటసాల, జయలక్ష్మి గానం చేశారు. ఎన్‌.టి.ఆర్‌., సావిత్రి ప్రధాన పాత్రలలో అభినయించిన ఈ పాటలో రేలంగిలా డైలాగులు
చెప్పే వేళంగి అనే హస్యనటుడు, సావిత్రికి చెలికత్తెగా నటించిన మరో నటి కూడా కనిపిస్తారు. ఇది ఒక రాగమాలికా గీతం. “కన్నుల బెళుకే కలువలురా”
అనే పల్లవి నుంచి “కనులలో ఆ రూపే కాపురమై పోయే’ అనే చరణం వరకు బేహాగ్‌ రాగంలో స్వరపరిచారు. వినసొంపుగా ఉండే ఈ బేహాగ్‌ రాగాన్ని
మన సంగీత దర్శకులు అంతగా ఉపయోగించుకోలేదనే చెప్పాలి. ఓసారి సింహావలోకనం చేసుకుంటే ఎస్‌. రాజేశ్వరరావు స్వర పరిచిన “చెంచులక్ష్మి
చిత్రంలోని ‘నీలగగన ఘనశ్యామా’ పాట ‘భక్తప్రహ్లాద’ చిత్రంలోని ‘వరమొసగే వనమాలీ” పాట గుర్తుకు వస్తాయి. ‘కన్నుల బెళుకే’ పాట మొదటి
చరణం – “కనరాని అందాలనే” దగ్గర్నుంచి “’హృదయాలు కదిలించెనే’ వరకు, ఆ తర్వాత అదే వరుసలో వచ్చే ఇంకో చరణం –
“వనరాణి వగలాడిగా’ దగ్గర్నుంచి ‘హృదయాలు కరిగించెరా’ వరకు భాగేశ్రీ రాగాన్ని ఉపయోగించారు. ఈ రెండు చరణాల మధ్య వచ్చే ‘ఇటు
చూడు ఇటు చూడవే..ఇది ఏమి మటుమాయమే’ అనే వాక్యాలకు బిలహరి రాగాన్ని వాడుకున్నారు. ‘కోరి కోరి నీ రూపము కనగా” అనే చరణాన్ని
గౌరీ మనోహరి రాగంలోను “కలలు ఫలించే కాలములో) చరణాన్ని కళ్యాణి రాగంలోను స్వరపరిచారు. బెత్సాహిక గాయనీ గాయకులకు ఈ పాట
ఓ పరీక్షలాంటింది. మొత్తం పాటను సాధన చేసి ఏకబిగిన పాడగలిగిననాడు ‘మేం పాడడానికి పనికొస్తాం’అని వారు ధైర్యంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా
శాస్త్రీయ సంగీత కచ్చేరీలు చేసే విద్వాంసులు కొన్ని సినిమా పాటలు పాడవలసి వచ్చినప్పుడు తమకు అలవాటైన ధోరణిలో పాడడం, సినిమా
పాటల ఒరవడికి అలవాటుపడ్డ శ్రోతలకు ఈ ధోరణి మింగుడుపడని విధంగా వుండడం సహజం. “రాధా -జయలక్ష్మిగా శాస్త్రీయ సంగీత ప్రపంచంలో
గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకున్న గాయనీమణుల్లో ఒకరైన జయలక్ష్మి ఈ ‘కన్నుల బెళుకే’ పాటలోని “కనరాని అందాల’ చరణాన్ని పాడుతుంటే
సాధారణ స్థాయిలో ఉండే శ్రోతలకు కూడా శరీరం రోమాంచితం అయిపోతుంది. ముఖ్యంగా “హృదయాలు కలిగించెనే’ దగ్గర ఆవిడ హృదయాలను
కదిలించేస్తుంది. ఆ రససిద్ధికి కారణం – రాగం భాగేశ్రీ కారణమా లేక జయలక్ష్మి పాడిన పద్దతా అన్నది ఎవరికి వారే సమాధానం చెప్పుకోవలసిన
ప్రశ్న. అల్లాగే చిరునవ్వు చిలికించగా’ దగ్గర ఘంటసాల కూడ తనదైన రసస్పర్శతో పులకింప చేస్తారు.
ప్రజల మనసులలో చక్కని అభిరుచిని పెంపొందింపచేసి వారి చైతన్యంలో సంస్కారాన్ని నింపాలకునే దృశ్య, శ్రవణ మాధ్యమం ఏదైనా సరే
ఇటువంటి పాటల వ్యాప్తి ద్వారా పదే పదే పూనుకుంటే చక్కని సాంస్కృతిక వారసత్వాన్ని తర్వాతి తరాల వారికి అందించిన సార్థకత చేకూరుతుంది.

ముళ్ళపూడి సాహితీ సర్వస్వం
ి.
పక్షిరాజా వారి “అగ్గిరాముడు”, “మలై కళ్లన్‌” చిత్రాలు తయారవుతున్న
సమయంలో, అవసరాన్ని బట్టి, భానుమతి సరిగా ఇరవై నాలుగు గంటలలో ఆరు
పాటలు రికార్డు చేసింది, ఒక నిముషం కాలం, ఒక అడుగు సెల్యులాయిడ్‌ వృధాగా
పోకుండా.
“నేను పాదదానికీ, నటించడానికీ ప్రత్యేకం కష్టపడి ప్రయత్నం ఏమీ
చెయ్యను. నా కృషి ఫలితం బాగుంటుందని నామీద నాకు నమ్మకం ఉంది. ఇలా
చెప్పడానికి నాకు జంకేమీ లేదు. ఫాల్స్‌ డిగ్నిటీ లాగే ఫాల్స్‌ మాడెస్టీ కూడా నాకు
నచ్చదు” అంటుంది భానుమతి. (ఆంధ్ర వారవత్రిక – 1956)

అగ్గి రాముడు సూపర్ డూపర్ హిట్ సినిమా .రామారావు నటన హైలైట్ .సంగీతం ,పాటలు అదుర్స్ .రేలంగి హాస్యం చిత్రానికి మరింత వన్నె తెచ్చింది .భానుమతి పాటలు

ఒక ఊపు ఊపాయి .సబ్ ఇన్స్పెక్టర్ గా ముక్కామల జీవం పోశాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-22-ఉయ్యూరు

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-284
284-అలనాటి మూకీ చిత్రాల నటుడు దర్శకుడు ,కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ,పాత భూకైలాస్ ,భక్తప్రహ్లాద ఫేం –ఎం.వి.సుబ్బయ్యనాయుడు
మైసూరు వెంకటప్ప సుబ్బయ్య నాయుడు (1896 – 21 జూలై 1962) ఒక భారతీయ రంగస్థల, మూకీ చిత్రాల నటుడు, దర్శకుడు. ఇతడు తొలి కన్నడ టాకీ చిత్రం సతీ సులోచన (1934), తెలుగు సినిమా భూకైలాస్ (1940), కన్నడ సినిమా భక్త ప్రహ్లాద (1958) మొదలైన వాటిలో నటించి పేరు గడించాడు.[1] ఇతడు కన్నడ సినిమా హీరో లోకేశ్ తండ్రి. [2] నాటక రంగంలో ఇతని కృషికి గుర్తింపుగా 1961లో ఇతనికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. [3]

విశేషాలు
సుబ్బయ్య నాయుడు నాటకాలలో మొదట చిన్న చిన్న పాత్రలలో నటించడం ప్రారంభించి నాయక పాత్రలు ధరించడం వరకు ఎదిగాడు. ఇతడు ఆ రోజులలోనే చెప్పుకోదగ్గ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇతడు రట్టిహళ్లి నాగేంద్రరావుతో కలిసి సినిమాలలో నటించడం ఆరంభించాడు. వీరిద్దరూ కలిసి తొలినాళ్ళ కన్నడ సినిమాలు వసంతసేన (1941), సత్య హరిశ్చంద్ర (1943), మహాత్మా కబీర్ (1947) వంటివి తీశారు. భక్త ప్రహ్లాద సినిమా తర్వాత ఇతడు మళ్ళీ నాటకరంగానికే పరిమితమయ్యాడు.[4]

మరణ
ఇతడు 1962, జూలై 21న మండ్యలో గుండెపోటుతో మరణించాడు. ఇతని చివరి రోజులలో కూడా ఇతడు తన నాటక సమాజం సాహిత్య సామ్రాజ్య నాటక మండలితో కలిసి చురుకుగా నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతడు మరణించే రోజు మండ్యలో ఓ నాటకంలో అంబరీషుని వేషం వేశాడు.[4]

పాక్షిక ఫిల్మోగ్రఫీ
సంవత్సరం

సినిమా

పాత్ర

1934

సతీ సులోచన

ఇంద్రజిత్తు

1940

భూకైలాస్

రావణుడు

1941

వసంతసేన

1943

సత్య హరిశ్చంద్ర

హరిశ్చంద్రుడు

1947

మహాత్మా కబీర్

1958

భక్త ప్రహ్లాద

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-11-5-22-ఉయ్యూరు

— మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-285
285-మెలోడి కి శ్రీకారం చుట్టి ,సంప్రదాయ సంగీతానికి నవ్యత కూర్చి 500పాటలు పాడిన సంగీత దర్శకుడు.లేతమనసులు ,మంచి చేసు సినీ ఫేం – –ఎం.ఎస్.విశ్వనాధన్
యావత్‌ భారతీయ సంగీత చరిత్ర సగర్వంగా చెప్పుకునే గొప్ప సంగీత దర్శకుడు.
ది కింగ్‌ ఆఫ్‌ లైట్‌ మ్యూమ్యూజిక్‌ (మీల్లిసై మన్నార్‌)గా ఖ్యాతినొంది సినీ ప్రేక్షకుల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. సంగీతంలో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఆశేష సినీ ప్రేక్షకులతో జేజేలు పలికించుకున్న ఈ ఘనాపాటిని ‘తైరై ఇసై చక్రవర్తి’ ( ది ఎంపరర్‌ ఆఫ్‌ సినీ మ్యూజిక్‌) అంటూ తమిళనాడు ప్రభుత్వం కీర్తించింది. ఆరు దశాబ్దాలకి పైగా వైవిధ్యమైన సంగీతంతో ఊర్రూతలూగించిన సంగీత చక్రవర్తి ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ (87)ని సినీ సంగీత ప్రపంచం శాశ్వతంగా కోల్పోయింది. ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ ఇకలేరనే విషాదాన్ని జీర్ణించుకోలేక సప్తస్వరాలు మౌనంగా రోదిస్తున్నాయి. సుమధుర సంగీతంతో ప్రేక్షకుల్ని రంజింపజేసి 60 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానానికి ముగింపు పలికిన ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ జీవిత విశేషాల సమాహారం..
భయంకరమైన బాల్యం
1928 జూన్‌ 24న కేరళలోని పాలక్కడ్‌ గ్రామంలో విశ్వనాథన్‌ జన్మించారు. నాలుగేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయారు. పేదరికంతో కుటుంబాన్ని పోషించలేక, ఎవరి సహాయం అందక ఆఖరికి కన్న కొడుకునే కడతేరుద్దామనే నిర్ణయం తీసుకున్న తల్లి నారాయణీకుట్టి నుంచి విశ్వనాథన్‌ని తాతయ్య రక్షించారు. బతుకు తెరువు కోసం విశ్వనాథన్‌ థియేటర్లలో సమోసాలు, బజ్జీలు అమ్మారు. బడికి వెళ్ళి చదువుకోవాల్సిన విశ్వనాథన్‌ బాల్యం భయంకరంగా గడిచిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. థియేటర్లలో పని చేసే పుణ్యమా అని.. ఆయనకు సంగీతంపై మక్కువ ఏర్పడింది. 1933 నుంచి 1939 వరకు సంగీతం నేర్చుకున్నారు. 13 సంవత్సరాల వయసులోనే ‘త్రివాన్‌డ్రూమ్‌’ నాటకంతో తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు.
మలుపు తిప్పిన పరిచయం
సింగర్‌గా, యాక్టర్‌గా రాణించాలని విశ్వనాథన్‌ ఎప్పడూ తపించేవారు. ఆ తపనకి తగ్గట్టుగానే ఆయన కొన్ని డ్రామాల్లో సైతం నటించారు. సింగర్‌, యాక్టర్‌ ఏ వైపు పయనించాలో అర్థంకాని తరుణంలో ప్రముఖ వయోలినిస్ట్‌, స్వరకర్త టి.ఆర్‌.పాపా పరిచయం విశ్వనాథన్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. విశ్వనాథన్‌లోని ప్రతిభను గుర్తించి ఆయన తన ఎస్‌.వి.వెంకటరామన్‌ మ్యూజికల్‌ ట్రూప్‌లో చేర్చు కున్నారు. ఆ ట్రూప్‌తో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విశ్వనాథన్‌కు సంగీత దర్శకత్వం పట్ల మరింత అవగాహన పెరిగింది. అదే సమయంలో ఎస్‌.ఎం.సుబ్బయ్యనాయుడు, సి.ఆర్‌. సుబ్రమణియమ్‌ వంటి సంగీత దర్శకుల మ్యూజికల్‌ ట్రూప్‌లో చేరి, హార్మోనియం వాయిద్యకారుడుగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇదే ట్రూప్‌లో పని చేస్తున్న వయోలినిస్టులు టి.కె.రామ్మూర్తి, టి.జి.లింగప్పలతో మంచి చనువు ఏర్పడింది.
సరికొత్త ఒరవడికి శ్రీకారం
ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ స్వరపర్చిన పాటలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఆయన కంపోజ్‌ చేసిన ప్రతి పాటను ప్రతి ఒక్కరూ సులువుగా పాడుకునేలా ఉండటం విశేషం. సంప్రదాయ భారతీయ సంగీతానికి వెస్ట్రన్‌, డిస్కోలతో సమ్మిళితం చేసి సరికొత్త ప్రయోగాలతో విశ్వనాథన్‌ ప్రేక్షకుల్ని అలరించారు. మెలోడి పాటల్ని ప్రేక్షకులకు పరిచయం చేసి సరికొత్త సంగీత ఒరవడికి విశ్వనాథన్‌ శ్రీకారం చుట్టారు. ఎటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకుండా అప్పటి సంప్రదాయ సంగీతంలోనే నవ్యత తీసుకొచ్చే క్రమంలో విశ్వనాథన్‌ విజయం సాధించారు. ఆర్‌.బాలసరస్వతి, వాణీజయరాం, ఎస్‌.జానకీ, ఎ.ఎల్‌.రాఘవన్‌, ఏసుదాసు, ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల, ఎ.ఆర్‌.ఈశ్వరీ, టి.ఎం. సుందరరాజన్‌, జయచంద్రన్‌ వంటి అద్భుతమైన నేపథ్యగాయనీ గాయకులంతా విశ్వనాథన్‌ చిత్రాల్లోని పాటలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైనవారే కావడం విశేషం.
భిన్న దర్శకులు
ఎస్‌.ఎస్‌.వాసన్‌, బి.ఆర్‌. పంతులు, బి.ఎస్‌.రంగ, కృష్ణన్‌- పంజు, ఎ.భీమ్‌సింగ్‌, మాధవన్‌, సి.వి.సుందర్‌, టి.ఆర్‌.రామన్న, ఎ.సి.త్రిలోక్‌చందర్‌, కె.శంకర్‌, కె.బాలచందర్‌, ముక్త వి.శ్రీనివాసన్‌, చిత్రాలయ టి.ఆర్‌.గోపు, చో రామస్వామి, మల్లియం రాజగోపాల్‌, మధురై తిరుమరన్‌, కె.ఎస్‌.గోపాలకృష్ణన్‌, దాదా మిరసి, ఎస్‌.పి.ముత్తురామన్‌,

సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -11-5-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.