జయశంకర ప్రసాద్ -2

జయశంకర ప్రసాద్ -2

రెండు కావ్యాలు

జయ శంకర్ పరచనలలో మూడు సోపానాలున్నాయి .చిత్రాధార్ ,కానన్ కుసు౦ ,మహారాణా ప్రతాప్ ,ప్రేం పధిక్ మొదటి దశకు ,నాటకాలలో రాజ్యశ్రీ ,విశాఖ,చాలా కథలు ఆతర్వాత ‘’ఛాయా ‘’పేరుతొ వచ్చిన సంకలనకథలు మొదటి దశకుచెందినవి .రెండవ దశ ‘’ఝార్నా ‘’తో మొదలౌతుంది .ఇందులో కొత్తభావాల ఆక్రోశన కవిగా కనిపిస్తాడు .ప్రతిధ్వని వంటి కధలద్వారా మార్పులు తెచ్చాడు .నాటకరచయితగా సానబెట్టిన వజ్రమే అయ్యాడు .కామనా వంటివి నాటకం లో కొత్త ప్రయోగం .1927-37మధ్యకాలమైన మూడవ దశ ముఖ్యమైనదీ చివరిదీ .అప్పుడే ఆ౦శా, లహార్ ,కామాయినీ  వంటి ఉత్క్రుష్టరచనలు చేశాడు .వీటితోపాటు కంకాల్ అంటే అస్థిపంజరం ,తితలీ అంటే సీతాకోక చిలక ,అసంపూర్నరచన అయిన ఇరావతి కూడా రాశాడు .చంద్రగుప్త ,స్కందగుప్త ,ధ్రువస్వామినీ ,ఏక్ ఝాంట్ లతో పోలికున్న గొప్ప నాటకాలుకూడా ఈ మూడవ దశలోనే రాశాడు .ఈరకమైన రచనాత్మక ‘’బాంబ్ బ్లాస్ట్’’ తో పాటు ఆకాష్ దీప్ ,ఆంధీ అనే రెండు కథా సంకలనాలూ వెలువరించాడు .ప్రతి దశలోనూ చాలా ప్రక్రియలు సాగించిన సాహిత్యకారుడు జయశంకర్ .కథాప్రసాద్ వ్యక్తిత్వం కవి ప్రసాద్ వ్యక్తిత్వం తో ముడి పడి ఉంది .

  కిషోర దశలో ఆయన భారతేందుకాలభావ ప్రేరణతో రాశాడు .తర్వాత ద్వివేదీ గారి విప్లవ యుగం  మూడవ యుగం చాయావాద్ యుగం లో అగ్రగణ్యుడు జయశంకర ప్రసాద్ ..ఖడీ బోలీ భాషలో ప్రేంపధిక్ అనే దీర్ఘ కవిత రాశాడు .ఇందులో మానవ సమాజ ప్రేమ భావన ఉంది .తర్వాత విశ్వ ప్రేమకు దారి చూపుతుంది .ఇందులో ప్రాసను వదిలేశాడు .కొత్త ఆశలను చిగురింప జేశాడు .నిర్మాణం శైలి లో కూడా నూతనత్వం తెచ్చాడు .వీటన్నిటికి జవాబు ‘’కరుణాలయ్’’.లఘు నాటిక .దీని తర్వాత రాణాప్రతాప్ నుకూడా దీర్ఘ కవితగా రాశాడు .ఇందులో కథను నడిపించే తీరు అబ్బురపరుస్తుంది .కానన్ కుసుం లో వస్తుపరంగా ఛందస్సు పరంగా గొప్ప వైవిధ్యం చూపాడు .లయలో జాగ్రత్తలు తీసుకొన్నాడు ,కథలలో కూడా ఈ కళా మర్మజ్ఞాత్వం తెచ్చాడు .ఇందు పత్రికలోనే ఆయన పాతవీ కొత్తవీ రచనలన్నీ ప్రచురితాలైనాయి .నహీ డర్ తే అనే సానెట్ రాశాడు .ఝార్నా లో ఒక విషయం లోనుంచి మరోదానికి దాటిపోయే లక్షణం ఉంది .ఆయన కవితావికాసం స్పష్టంగా కనిపిస్తుంది ,’’కాలం సంఘటనల కల్పనా తీతం –మనసు శరీరాన్ని చేసింది ప్లావితం –అప్పుడు ఒక రోజు ధారా అపా౦గ౦  –హృదయం నుండీప్రవాహం –కన్నీరొలికి ప్రవహించింది –ప్రణయ మన్యంలా విస్తరి౦చి౦ది ‘’.ఈ భావ పరంపరనే’’ చాయా వాదం’’ అన్నారు .చనిపోవటానికి ముందు రాసిన మూడు పంక్తులను ,అంతకు ముందెప్పుడో రాసిన నాలుగు పంక్తులతో కలిపి ‘’శేష గీత్’’పేరిట వచ్చింది –‘’నా జీవన ధ్రువతార –నీ కరుణ నీడ నీలాకాశం లో విస్తరించింది చంచల గ్రహాలూ శూన్య పధాన్ని కోలుస్తున్నాయి –క్షార సాగరం కల్లోలితమైంది –నీ మధుర జ్యోతి ధారలో నానావ తేలియాడింది ‘’ఈ కవిత 1994ఫాల్గుణమాసం లో  వెలువడింది –‘ఈ రోజు జీవితం లో చంచల సుఖం –విశ్వ మదిర లా నిండింది –ప్రాణాలను కైపెక్కించే ఆ మధుర సుఖం ‘’-1994-అశ్వన్ మాసం లో వచ్చింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-5-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.