జయశంకర ప్రసాద్ -4
చరిత్ర పాఠాలు
తమకాలపు గొప్పg బుద్ధి జీవులలో జయశంకర్ ప్రసాద్ ఒకరు .భారతేందు దారిలో నడుస్తూనే చారిత్రకనాటకాల ద్వారా కొత్త జీవితం ఇచ్చాడు .ఐకమత్యం ,సామూహిక జాగరణ ఆనాటి అందరి లక్ష్యం .చరిత్ర గౌరవాన్ని పెంచిన ఆయన నాటకాలు రాజ్యశ్రీ ,హర్ష వర్ధన్ ,అజాత శాత్రు ,చంద్రగుప్త ,స్కంద గుప్త ,చాణక్య గౌతమబుద్ధ ,ధ్రువ స్వామినీ .’’నాటకం రంగస్థలం కోసం కాదు రంగస్థలం నాటకం కోసం ‘’అని నిష్కర్షగా చెప్పాడు .తనకాలం నాటి జాతీయ భావాలను అందులో పోదిగాడు .ఆయన నాటకం ఆనందం తోపాటు భయాన్నీ ,కష్టాలనూ కలిగించేది.
రాజ్యశ్రీ నాటకం లో వికట ఘోషుడు బౌద్ధ భిక్షువుగా ఉంటూ ,తర్వాత ఘరానా దొంగ ఖూనీ కోర్ అయ్యాడు .అజాత శత్రు లోని దేవదత్తుడు ఈర్ష్య మోసం అత్యాశలకు ప్రతినిధి అయిన పీఠాధిపతి.యువరాజు విరుద్ధకుడు తండ్రికే శత్రువు .అజాత శత్రువు తన తండ్రి బింబి సారుడిని దేశం నుంచి బహిష్కరిస్తాడు .కులీనులు ఇవేమీ పట్టకుండా ఉదాసీనంగా ఉంటారు .సామాన్యజనాన్ని పట్టించుకొనే నాథుడు ఉండేవాడు కాదు .వీరు సకలం కోల్పోయి చేతనా శూన్యులై ఐకమత్యం లేకుండా ఉంటారు .గొప్ప వీరుడు పర్ణదత్తుడు పౌరులపరిహాసానికి గురౌతాడు .దేశ స్వతంత్ర సంగ్రామం లో పాల్గొని క్షతగాత్రులైనవారికి సాయం చేయమని పౌరులను వేడుకొంటాడు .నిస్వార్ద దేవసేన ఆయన కు పూర్తీ సహకారమందిస్తుంది .ఈ చివరి దృశ్యం స్మశాన నేపధ్యం లో జరిగి గుండెల్ని పిండి చేస్తుంది .స్కందగుప్తుడు ఆశా కిరణంగా గోచరిస్తాడు .చివరికి అసత్యం పై సత్యం విజయం సాధిస్తుంది .
బౌద్ధం పై రచయితకు ఆకర్షణతో పాటు విమర్శనా ఉంటుంది .ఆటవిక మతాన్ని అనుసరించేవారికన్నా హూణులు ఫర్వాలేదు అంటాడు శ్రీలంక బౌద్ధ భిక్షువు ధర్మ సేనుడు .సంస్కృతీ పట్ల ఉన్న ఆత్మానందాన్ని ప్రసాద్ వ్యంగ్యంగానే చూశాడు. స్కంద గుప్తుని ప్రపంచం లో వెలుగు మానవాత్మ సౌందర్యం కనిపిస్తాయి .స్కంద గుప్తనాటకం ప్రసాద్ సర్వోత్క్రుష్టనాటకం .క్షమాభావం తక్కువ .
చంద్ర గుప్త నాటకం లో చాణిక్యుని మహోన్నత పాత్రగా చిత్రించాడు .మధు కరుణ ఆయనకవిత్వం లో పదేపదే వాడాడు. కామనా నాటకం ఎలిగరి తో ఉంటుంది .ఏకఘాంట్ నాటకానికీ ఇదే నేపధ్యం .ఈ రెండూ గొప్ప స్పూర్తి నిస్తాయి .భావనాత్మక శక్తులు క్రియ ,ప్రతిక్రియగా ఒకవైపు ,ఆలోచనల సంఘర్షణ లుగా మరో వైపు దర్శనమిస్తాయి .చాణక్యుడు ఆసరాతో పాటు ఆనందం కల్గిస్తాడు .జ్ఞానం తో ఐకమత్య సాధన చేశాడాయన .నాటకం లోఉన్న శాంతి అత్యంత సహజం గా ఉంటుంది .చాణక్యుని నిర్వేదనానికి ఒక దీప్తినీ ప్రసాదిస్తాడు జయశంకర ప్రసాద్ ..
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-22-ఉయ్యూరు
