హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి
పశ్చిమ గోదావరిజిల్లా గరగ పర్రు గ్రామం లో 1884లో శ్రీ పాలకోడేటి గురుమూర్తి సద్వంశ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించారు .మెట్రిక్ పాసై L.M.P.చదివి రాజమండ్రిలో వైద్య వృత్తి చేశారు .1910లో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి ,అయిదేళ్ళు పని చేసి ,తర్వాతఏజెన్సీప్రాంతంలో మూడేళ్ళు డాక్టరీ చేశారు .1918లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీ నామా చేసి ,రాజమండ్రి లో స్వంతంగా విద్యాలయం నెలకొల్పి ప్రజా సేవ చేయటం ప్రారంభించారు .
హరిజన ఉద్ధరణ పై అభిమానం కలిగి సేవ చేశారు. రాజమండ్రి పురపాలక సంఘానికి 1925నుంచి 1927 వరకు రెండేళ్ళు అధ్యక్షులుగా ఉన్నారు .ఆంధ్రా మెడికల్ అసోసియేషన్ కు మూడు సార్లు అధ్యక్షులుగా పని చేశారు .మద్రాస్ మెడికల్ కౌన్సిల్ ఎక్సిక్యూటివ్ మెంబర్ కూడా .ఉత్తర విశాఖ జిల్లాలో క్షామం వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవటానికి గొప్ప సేవ చేశారు .
ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా ఉంటూ కాంగ్రెస్ సేవ చేశారు .ఇంతటి మహాను భావుడిని రాజమండ్రి’’ పందిరి వారి వీధి’’లో ముస్తఫా స్వయంగా క్రూరంగా లాఠీ చార్జి చేశాడు .గురుమూర్తిగారి తలను పట్టుకొని గోడ కేసి కొట్టాడు ఆ రాక్షసుడు .ముస్తఫా నరరూప రాక్షసుడైన పోలీస్ ఆఫీసర్ .వాడి నరనరానా అక్కసు ద్వేషం ,ప్రతీకారం జీర్ణించుకు పోయాయి .ఆ ఆవేశంతో ఉచితాఉచితాలు లేకుండా కాంగ్రెస్ వాదులను కొట్టేవాడు. ఇలాగే వీడి చేతులలో దెబ్బలు తిన్నవారిలో బ్రహ్మా జోస్యుల సుబ్రహ్మణ్యం వెలిదండ్ల హనుమంతరావు గార్లు కూడా ఉన్నారని ముందే చెప్పుకొన్నాం .డాక్టర్ గురుమూర్తిగారు ముస్తఫా చేతిలో ఎన్ని దెబ్బలు ,ఎన్ని పోట్లు తిన్నారో లెక్కే లేదు .
గురుమూర్తిగారు ప్రఖ్యాత అణుశాస్త్ర వేత్త డా .ఆకునూరి వెంకట రామయ్య గారి అర్ధాంగి శ్రీమతి కృష్ణ మయి గారికి మాతా మహులు అని ఆమె చెప్పినట్లు జ్ఞాపకం .ఇంతకంటే గురుమూర్తి గారిపై సమాచారం దొరకలేదు .వారి కుటుంబ సభ్యులెవరైనా వారి గురించి మిగిలిన విషయాలు తెలియ జేయచ్చు.వారి ఫోటో కూడా దొరకలేదు .
(శీ, పాలకోడేటి గురుమూర్తి
1884 జననం. సర్దార్ వల్లభాయిపకేల్ లాంటి దిట్ట. నిర్మోహమాటి.
నీతి, నిజాయితీలకి మరోపేరు. వెద్యవృత్తిలో పేదసాదలకి ఎంతో సేవచేశారు.
జాతీయోద్యమాలలో జెలుశిక్షలను అనుభవించి, సత్యా(గహాలలో లారీ
దెబ్బలుతిన్నారు. మునిసిపల్ చైర్మన్ గా ఆదర్శవంతంగా కృషిచేశారు. హరిజన,
సహకారోద్యమాలకి వూపిరిగా సేవలు చేశారు. ఆజన్మాంతం ఆదర్శవంతంగా
జీవించారు. 1984లో కీర్తి శేషులెనారు. రాజమండ్రికి వలస వెళ్ళిన పాలకోడేటివారి కుటుంబం శ్రీయుతులు గురుమూర్తిగారు, సూర్యప్రకాశరావు గారు, రామ్మూర్తిగారు, వంటి ప్రముఖులతో విశ్వఖ్యాతం పొందుతోంది. అయితే వీరు రాజమండ్రికి దగ్గర్లోనే వున్న రాజానగరం సమీపంలోని గండేపల్లి నుంచి రాజమండ్రికి వలస వచ్చారనే ఊహ కూడా వుంది. రాజమండ్రిలోని ఇన్నీస్పేటలో నాల్గవవీధి ‘పాలకోడేటివారి వీధి’. మాజీ ఛైర్మన్ స్వాతంత్య్ర సమరవీరుడు, సుప్రసిద్ధ సహకారవేత్త, డాక్టర్ పాలకోడేటి గురుమూర్తిగారు ఈ వీధిలో నివసించేవారు. ఎందరో ఉద్యమవీరులకు ఇక్కడ అతిథ్యం లభించేది. దాదాపు నగరంలోని సహకార సంస్థలన్నింటిని వీరే స్థాపించారు. పురపాలక సంఘం పక్షాన ప్రప్రధమంగా ఆయుర్వేద ఆసుపత్రిని ప్రస్తుత కోటిపల్లి బస్టాండ్లో నెలకొల్పారు. అది ఈనాటికీ పనిచేస్తోంది. విచిత్రమేమంటే ఇప్పుడు పాలకోడేటి వారి వీధిలో పాలకోడేటి వారికి స్వగృహం లేదు.
డా॥ పాలకోడేటి గురుమూర్తి చేతి మహిమ
1933 వ సం॥లో హరిజవాశమంలో వుంటుండగనే నుబహ్మణ్యం గార్కి క్షయవ్యాధి అంకురించి_ది, తాత్తాలికమైన చికిత్సవలన కొంత ఉపశ మించింది. కాని వ్యాధి నిర్మూలనం కాలేదు. 1934 సం। వెసవిలో ఆయ నకు చాల (ప్రమాదకరమైన జబ్బు చెపింది. కఫం గొంతుపచ్తైపింది. దాదాపు ఆయన వృత్యువుతో పోరాటాన్నే సాగించాడు. వైద్య సహాయం కోసం రాజమండ్రి నుండి ఎందరో డాక్టర్లు వచ్చారు డా॥ పాలకోడేటి గురుమూర్తి గారు అందరి సలహాలతో వైద్యం చెళారు. ఆయన తుది (ప్రయత్నంగా ఒక యింజక్షన్ యిచ్చి చెతులె త్తి భగవంతుని (ప్రాంచాడు ఆ స్థితిలో మేమంతా యెంతటి నిస్సహాయ నిస్పృహలతో వున్నామో చెప్పనక్కర్లదు,
సు[బహ్మాణ్య ంగారు మృత్యువుతో అలా పోరాడుతూ ‘ ‘My soul shall live as a maonumsnt cf ~esistence to British Imperialism’ (నా ఆత్మ క్ మా9జ్య (పతిఘటనకు శాశ్వత చిహ్నంగావుండుగాక! ‘ | అని గబ్లీగా “కేక లేయటం మొదలె నెట్టారు. మమంతా దేవుడ్ని ప్రొర్సిస్తూ నిశ్చేష్షులె వుండిపోయాము. ఈశ్వరానుగహం వలన అప్పటి కాయన కౌ గండం తప్పింది. కొంచెం బలం చేకూరడంకోనే ఆయన బళ్ళారి సాం దూర్లో కొన్ని నెలలపాబు విశ్రాంతి తీసుకున్నారు. ఆ విశంతి ఆయన జబ్బును తాత్యా లిక గా పోగొట్టింది. ఏీత్రాకాలంనాటికి ఆయన తిరిగ సీతా నగరం చరుకున్నారు. అప్పటికి ఆ గ్రామంలోని సభ్యులందరూ బైళ్ళనుండి విడుదలై వచ్చిళశారు. కానీ చేతినిండా మనస్సుకు నచ్చిన పని లేక విరుత్సా హంగా కాలం గడపవళలపి వచ్చింది.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-22-ఉయ్యూరు