పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-2

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-2

     యవ్వన దశ

తారాశంకర్ కు యవ్వన దశ వచ్చాక నళిని బాగ్చి అనే అనే విప్లవకారుడితో పరిచయం కలిగింది .అతడుఇతనిలొ విప్లవభావాలు నాటాడు .1916లో జాదవలాల్ ఉన్నతాంగ్ల పాఠశాలలో చేరి మెట్రిక్ పాసయ్యాడు .తర్వాత కలకత్తాలో సెయింట్ జేవియర్ కలేజిలోచేరి ,రాజకీయ అనుమానితుల జాబితాలో అతని  పేరు ఉండటం తో  చదువు మానేయాల్సి వచ్చింది .అసుతోష్ కాలేజిఅనే సౌత్ సబర్బన్ కాలేజిలో చేరి ,అనారోగ్యం వల్ల మానేశాడు.1921లో విప్లవభావాలు కొంత స్తబ్దతతర్వాత  నూతన ఉత్తేజం పొందాయి అతనిలో .గాంధీ సహాకనిరాకరణ పట్ల ఆకర్షితుడయ్యాడు .హి౦సావిధానం ఆయన మెచ్చలేదు. తానెప్పుడూ విప్లవవాదినికాను అని కల్లోల్ నవలలో చెప్పుకొన్నాడు .మనసులోని భావాలకు గాంధీ సిద్ధాంతాలు సమాధానం చెప్పినట్లు అనిపించింది .ప్రజల కష్టాలపై ఆసక్తి,ఆదుకోవాలనే కోరిక ,అభిమానం సానుభూతి ఆయనను మహా రచయితగా మార్చాయి .అనంత ప్రజావాహినే ఆయన మార్గదర్శి .

  పరిపూర్ణ మానవతపై తారాశంకర్ కు మహా విశ్వాసం ఉంది .మహనీయ వ్యక్తులే ఆయన నవలలలోని పాత్రలు .కవి కావాలనే కోరిక ఉండేది.1920లో ఆయన బంధువు ఒకాయన ‘’త్రిపత్ర ‘’అంటేమూడాకులు అనే ఈయన కవితా సంపుటి ప్రచురించాడు  .భారతవర్ష అనే ప్రముఖ పత్రికలఈయన కవిత అంతకు ముందే ప్రచురింపబడింది .త్రిపత్ర ఆయన బందుమిత్రులకే పరిమితం అవటం వలన తర్వాత కాల గర్భం లో కలిసిపోయింది .తర్వాతకాలం లో రాసిన కవిత్వం తక్కువేకాని, ఆయనలో భావుకుడైన కవి ఎప్పుడూ ఉండేవాడు .గురుముఖతనేర్వని ఆశుకవిత్వం ఈయనలో బాగా కనిపిస్తుంది .ఆకాలం లో ‘’కబియల్’’అంటే కవి-గాయకుడు అనేవారు గ్రామాలలో పద్యాలురాసి గానం చేస్తూ అలరించేవారు .ఈయన నవల ‘’కబి ‘’ఆ కవి –గాయక ప్రతిభకు నిదర్శనం .జానపద జీవితాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు తారాశంకర్ .

  స్వగ్రామం లాభ పూర్ లో ధనిక భూస్వామి నిర్మలశివ బంద్యోపాధ్యాయ నాటకరచయితగా ప్రయోక్తగా పేరున్నవాడు .ఈయన నాటకాలను కలకత్తాలో కూడా ప్రదర్శించేవారు .తారాశంకర్ కూ నాటకాలు రాయాలనిపించింది .18రూపాయలతో గ్రాంట్ డఫ్ రాసిన మూడు సంపుటాల మహారాష్ట్ర చరిత్ర కొని ,పానిపట్టు యుద్ధంగురించి నాటకం రాశాడు శంకర్ .నిర్మల శివ ప్రోత్సాహంతో దాన్ని ఒక నాటకకంపెనియజమాని కిచ్చాడు .ఊరూ పేరులేని వాడు రాసిన దాన్ని చదవటం దండగ అని చులకనగా చూస్తె కోపం వచ్చి  నాటకాన్ని అగ్నికిఆహుతి చేశాడు తారాశంకర్ .ఇంక రాయకూడదు అనుకొన్నాడు వ్యధతో .కాంగ్రెస్ లో ఉంటూ సమాజ సేవ చేసేవాడు. చిన్నతరహా భూస్వామికనుక కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు .

 కొంతకాలం తర్వాత ఒక మిత్రునితోకలసి ‘’పూర్ణిమ ‘’మాస పత్రిక ప్రారంభించి ,తన రచనాసర్వస్వం అందులో ప్రచురించటం మొదలుపెట్టాడు .పెద్దగాసంతృప్తికలగలేదు అప్పుడే ‘’కవి-కలం’’అనే ఒక పత్రిక చూసి అందులో ప్రేమే౦ద్రమిత్ర ,శైలజానంద ముఖర్జీ లు రాసిన కథలు చదివి ,సంమోహితుడయ్యాడు .కలకత్తాకు వస్తూ పోతూ ఉన్నా సాహితీరంగంలో కొత్తపోకడలు గమనించనే లేదు .ఆరచయితలే తనకు మార్గదర్శులు అను కొన్నాడు .ఒకసారి తారాశంకర్ తన జమీన్ లో ఒక గ్రామానికి వెడితే అక్కడ ఒక సౌందర్యవతి అయిన ఒక వైష్ణవ యువతి కనిపిస్తే ,ఆమెపై ‘’రస-కలి ‘’అంటే చందనం కథ రాసి ప్రముఖ బెంగాలీ పత్రికకు పంపి౦చి 8నెలలతర్వాత ఆ పత్రికాఫీసుకు వెళ్లి అడిగితతే వావ్వరూ ఆకథ చదవలేదని చేబితెఅవాక్కై ,మధ్యకలకత్తానుంచి దక్షిణ కలకత్తా దాకా కాళ్ళీడ్చుకొంటూ నడిచి ‘’ఇక రచనలు చేయను .సేవాకార్యక్రమాలలో ఉంటాను ‘’అని నిశ్చయించాడు .

 లాభపూర్ గ్రామయూనియాన్ బోర్డ్ కు అధ్యక్షుడయ్యాడు తారాశంకర్ .జిల్లా అంతా సైకిల్ పై తిరుగుతూ గ్రామజీవితాన్ని అధ్యయనం చేశాడు .నీటిఎద్దడి బాగా ఉన్న జిల్లా అది .కలరాతో రెండేళ్ళు ఇబ్బందిపడింది. ఆరునెలలు ప్రజల మధ్యగడిపి వ్యాధిని దూరం చేశాడు .ప్రజలకుఊరట  కలిగించి సేవాకార్యాలలోసంతృప్తి  చెందాడు  ప్రజల కళ్లల్లోవెలుగు చూసితృప్తి  చెందాడు .ఈ సంఘటనలన్నీ ఆయన రాసిన హన్సూలీ బంకర్ ‘’అంటే కొడవలి వంపు కథలో చోటుచేసుకొన్నాయి .

అభ్యుదయ సాహితీ వేదికగాఉన్న కల్లోల్ పత్రిక ముఖ చిత్రం ఒకసారి చూశాడు .తిరస్కరింపబడిన తన రస-కలి’’కథను దీనికిపంపితే ,నాలుగురోజుల్లోనేప్రచురణామోదం పొంది వెంటనే ప్రచురింపబడి,సాహితీ వేత్తల ప్రశంసలు పొంది , మరొకద రాసిపంపాని ఆహ్వానం అందుకుని పంపితే అదీ వెంటనే ప్రచురితమై ,కలికాలం అనే మరొక అభ్యుదయ సాహితీపత్రిక ‘’ఈ కథలు అరుదైన ఉత్తమకథలు ‘’అని ప్రసంశించింది .ఇవి 1929లో ప్రచురితాలు .

  సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-9-22-ఉయ్యూరు .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.