’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘’
— లోని కొన్నిదర్శనానుభూతులను మీముందు ఉంచుతున్నాను .బాపు 80 వ పుట్టిన రోజు 15-12-2013 న సాక్షి దినపత్రికలో శ్రీరమణ రాసిన ఈ వ్యాసం రచన మాసపత్రిక రజతోత్సవ కానుకగా ప్రచురించింది .అందులోని విశేషాలే ఇవి .
తారలకు తార సితార బాపు .ఆపేరు అర్ధ శతాబ్దిగా తెలుగింటి పేరు అయి కూర్చుంది .తెలుగు వారు బాపు ను ,రమణ ను విడి విడిగా అభిమాని౦చి నా ‘’అందమైన ద్వంద్వ సమాసంగా ‘’ఆజంటను సమాదరించారు .వారి స్నేహానికి నీరాజనాలెత్తారు.స్నేహ షష్టి పూర్తీ చేశారు .వారిద్దరూ ఒక్కరే అని తీర్మానించారు కూడా .బాపు 65ఏళ్ళ చిత్రకారుడు .యాభై ఏళ్ళ చలన చిత్రకారుడు .తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు బాపు గీతలు ముళ్ళపూడి రాతలు ప్రత్యక్ష సాక్ష్యాలు . సకల కళా ప్రపూర్ణుడు బాపు .రమణ ఎక్కడున్నా ,బాపు పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు అందించి ఆశీర్వదిస్తాడు అన్నది ‘’నిఝ౦’’గా నిజం .
బాపు బొమ్మల కథ బాలానంద సంఘం నుంచి బాల పత్రిక లోంచి మొదలైంది .యవ్వనంలో కవర్ డిజైన్లు ,కామిక్సూ మిక్స్ చేస్తూ కార్టూన్లు వేస్తూ కార్ట్యూన్లు పేల్చేదాకా పాకి ఎదిగాడు .ఎవరీ ఆర్టిస్ట్ అని జుట్టు పీక్కుంటున్న సమయాన బాపు గీతాలు మాట్లాట్టం నవ్వటం ఎగతాళి చేయటం ,ముక్కున వేలేసుకోటం నేర్పాయి.జాణ తనం నెరజాణ సొగసు అబ్బింది .తెలుగునైజం కలం తోనే అలవాటైంది .లైనూ ,గీత పదునుగా ఉండటం బ్రేవిటి ఎనాటమీపై పట్టు చూసి తెగ ఇదైపోయి అప్పటికే నెత్తిన తట్టలకొద్దీ పేర్లు మోస్తున్న వారంతా కలవరమాయే మదిలో అయ్యారు .అతన్ని చూశాక ‘’వెరి సింపుల్ .బట్ పవర్ ఫుల్ ‘’అన్నారు .పైకొస్తాడు పర్లేదు అన్నారు ఆ తట్టాబుట్టా మోసే రాయుళ్ళు .పొలిటికల్ కార్టూనిస్ట్ గా ఆంద్ర పత్రికలో 1955 చోటు సాధించి ‘’మనవాళ్ళు’’ పేరున జేబు కార్టూన్లు ,గిరీశం పేరున స్క్రిప్ట్ కార్టూన్ల బాంబులు పేల్చి లాల్చీ ఖండువాలను అదరగొట్టాడు బెదరగొట్టాడు .వాటికో ఛందస్సు అలంకారం వ్యాకరణం కారం మిర్చీ కూర్చి ‘’కార్టూన్ చిన్నయ సూరి ‘’అయ్యాడు .
సత్తిరాజు లక్ష్మీ నారాయణకు ,లాయర్ తండ్రి పెట్టుకొన్న ముద్దు పేరు ‘’బాపు ‘’ఇవాళ గుండెల్లో అలజడి రేపు తున్నాడు .అదే ఇంటి పేరు ఒంటి పేరు ఏకైక పేరూ అయింది ఖండాంతరాలలో పాకింది . గో .సు రావు .అదేనండీ గోవిందరాజుల సుబ్బారావు గారమ్మాయి భాగ్యవతిని పెళ్ళాడి ఇంటి సౌభాగ్యవతిని చేశాడు ..ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో జర్నలిస్ట్ బులపాటమూ తీర్చుకొన్నాడు .ఆ గీత అన్ని భాషల తలరాతనే మార్చేసింది .చేతినిండా పనే పని ‘’పని టు దిపవర్ ఆఫ్ వర్క్ ‘’గా వర్క్ హాలిక్కయ్యాడు. యాడ్ లపాలిటి కల్ప వృక్షం అయ్యాడు .ఎఫీషిఎంట్ సంస్థలలో ఎఫిషియెంట్ ఆర్ట్ డైరెక్టర్ అయి వాటి తలరాతలు తన గీతలతో మార్చేశాడు .నెలకు రెండున్నర వేల అత్యధిక జీతం పుచ్చు కొనే గీతా కారడయ్యాడు .తనకంటే వయసులో ప్రతిభలో పెద్ద వాడైన తమిళ చిత్రకారుడు ‘’గోపులు ‘’తో పరిచయం బాపుకు అదృష్టం అనిపించి, ఈయనా ఆయనంతయ్యాక ఒకరికొకరు ‘’ఆయనే నా గురువు ‘’అనుకొంటూ డ్యుయట్లు పాడుకొన్నారు .
సాహితీ మిత్రుడు ‘’ బీరువాల సుబ్బారెడ్డి’’ అని పిలువబడే బాపు –రమణ ల అభిమాని శ్రీ కట్టుకోలు సుబ్బారెడ్డి నాకు ఈ పుస్తకాన్ని 4-4-19 న ఇచ్చారు .ఇవాళే అది నా దృష్టిలో పడింది. ఆలస్యం చేయకుండా ,రెడ్డిగారికి ,శ్రీరమణ, రచన వారికీ ధన్యవాదాలతో మీకోసం నా పని నేను చేస్తున్నాను.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-23-ఉయ్యూరు
వీక్షకులు
- 996,592 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- స్వాగతం శోభకృత్
- (no title)
- సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -3(చివరిభాగం )
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.18వ భాగం.1.4.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.35వభాగం.మీమాంసా దర్శనం .1.4.23.
- సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -2
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.17వ భాగం.31.3.23.
- శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.34వ భాగం.31.3.23.
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.16వ భాగం.30.3.23.
- సరసభారతి శ్రీశోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -1
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,953)
- సమీక్ష (1,308)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (397)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (510)
- సినిమా (369)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు