కళా విశ్వ నాథ దర్శనం -1
–
హిందీ లో ఝనక్ ఝనక్ పాయల్ బాజే ,నవరంగ్ వంటి అద్భుత కళా ఖండాలు సృష్టించి సంగీతానికి ,సాహిత్యానికి భారతీయ కళా వైభవానికి వున్నత మైన స్థానం కల్పించిన వాడు శాంతా రాం .అవి అద్వితీయాలు అనిపించుకున్నాయి అంత ఎత్తుకు ఎవరు చేరలేరని భావించిన రోజులవి. హిందీసినిమాలకుదేశమంతట అభిమానులుంటారు .ఆదరిస్తారు .ఆ సిన్మాలకు మంచి మార్కెట్ వుంది .శత దినోత్స వాలు చేసుకొనేవి .అవి దర్శకుని సృజాత్మక శక్తికి నిదర్శ నాలు .అలాంటి సినిమాలు తెలుగు లో తీయ టానికి సాహసించటం కష్టమే .మరి కొత్త దనం కళాల పట్ల పూర్తి అవగాహనా ,ఆరాధనా వున్న దర్శకులు ఊరుకో లేరు .ప్రయత్నం చేస్తారు .చేసి ప్రతిభను నిరూపిస్తారు
అదిగో ఆ కోవ లోని వాడే మన కాశీ నాథుని విశ్వ నాథ్.
దిగ్దర్సకుడు ఆదుర్తి సుబ్బా రావు దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి ,క్రమంగా తనపై పెట్టిన విశ్వాసాన్ని రుజువు చేసు కున్నాడు .’’ఉండమ్మా బొట్టు పెడతా’’సినిలోమన సంస్కృతీ ని ప్రతిబింబించే సన్నీ వేశాలు అతనే తీసాడు అసిస్టెంట్ గానే. .కృష్ణా జిల్లా మానికొండ లో ఆ సినిమా షూటింగ్ జరిగింది .కడియాల విష్ణు రావు గారు ఆ ఊరిలో ధన వంతులు సంస్కారి స్నేహ పాత్రుడు .సినిమా అంతా వాళ్ల పొలాల్లో నే జరిగింది .ఎంతో పంట నష్ట పోయారు . వాళ్ళ అబ్బాయి తొమ్మిదో తరగతి చడువుందే వాడు ఆ వూరి హై స్కూల్ లో. నేను అక్కడ సైన్సు మాస్టర్ గా పని చేస్తున్నాను .నా దగ్గర ప్రైవేటు కుడా చదివే వాడు .అతను మమ్మల్ని తీసుకొని వెళ్లి షూటింగ్ చూపించాడు యాక్టర్లు అందరికి వూరి లోని ఇళ్ళల్లో లోనే బస .కొద్దిమంది బెజ వాడ హోటల్ లో వుండే వారు ..దాదాపు నలభై రోజుల పైనే షూటింగ్ జరిగింది .విశ్వ నాథ్ కాఖీ ప్యాంటు ,కాఖీ షర్టు ఇన్ షర్ట్ అంటే’’టక్ ‘’చేసి బెల్ట్ తో వుండే వాడు అప్పటికి ,ఇప్పటికి అదే ఆయన దర్శ కత్వ పు డ్రెస్ ..ధూళిపాల ”రావమ్మ మా లక్ష్మి రావమ్మా ”అని సంక్రాంతి దాసరి వేషం లో పాడుతూంటే ఇళ్ళ దగ్గర ముత్యాల్లాంటి ముగ్గులు .బంగారు తల్లుల్లాంటి గొబ్బెమ్మల మధ్య సన్నివేశాలు తీయటం నేను చూసాను .అప్పుడు ఆ వూళ్ళో ప్రతి ఇల్లు సంక్రాంతి శోభతో కళ కళ లాడేది ..పొలం లో ”బోర్ వేస్తె జలం భూమి నుంచి చిమ్ముకొని పైకి రావటం ,అప్పుడు పాడే ‘’పాతాల గంగమ్మా రారా ఉబికుబికి ఉరికురికి రా ‘’పాట జమున, కృష్ణ ల మీద చిత్రీక రించాడు విశ్వనాథ్ .కృష్ణ సరిగ్గా నటించ లేక పోయేవాడు .టేకుల కేకులు తెగ తినేవాడు .ఆ రోజున జమున కోపం వచ్చి చెంప మీద కొట్టినంత పని చేసింది .వెంటనే మూడ్ వచ్చి గొప్పగా నటించి అందరి సహనానికి ఫుల్ స్టాప్ పెట్టాడు .విశ్వ నాథ్ చాలాప్రశంతం గా అరుపులు హడావిడి లేకుండా చిత్రీకరణ చేసాడు .అదే మొదటి సారి అతన్ని చూడటం. అయితె ఎందుకో తెలీదు కాని అతని శక్తి యుక్తుల మీద నమ్మకం వుండేది నాకు .కాని ఇంత గొప్పగా ఎదిగి తెలుగు చిత్ర సీమను మలుపు తిప్పుతాడని అనుకోలేదు .మాణిక్యం మట్టి లో ఉన్నంత వరకే . బయటకు వస్తే దాని కాంతికి మనం అప్రతిభుల మవ్వాల్సిందే . .రెండోసారి విశ్వనాథ్ ను శంకరాభరణం విజయోత్సవాలకు ఆ బృందమంతా ఆంద్ర దేశ మంతా పర్యటిస్తూ ,ఉయ్యూరు వచ్చినప్పుడు ఆసినిమా ప్రదర్శిస్తున్న సాయి మహల్ కు వచ్చినప్పుడు చూసి సోమయాజులు విశ్వనాథ్ లకు షేక్ హాండ్ ఇచ్చి అద్భుత కళాఖండం అనగా నవ్వుతూ చేతులు జోడించారు ఆఇద్దరు .మూడో సారి శ్రీ వేటూరి సుందర రామమూశ్ర్తి పెదకల్లెపల్లిలో 1999ఫిబ్రవరి 24 ,25లలో తన స్వగృహంలో,శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం ఆడిటోరియం లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరై వేటూరి వారింట్లో కాఫీలు టిఫన్ లు మధ్యాహ్నం నవకాయ పిండి వంటలతో ఆదంపతులు అత్యంత ఆత్మీయంగా అందించిన విందు భోజనం చేసి మహదానందం పొందాము అందులో కళాతపస్వి బాల సుబ్రహ్మణ్యం జంధ్యాల ,సప్తపది హీరోయిన్ శ్రీమతి సబిత ,దేవదాస్ కనకాల ,లక్ష్మి దంపతులు ,శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు అదొక గొప్ప’’ ఎట్ హోం’’ కార్యక్రమం .అందర౦ మహా దానందం అనుభవించాం .అప్పుడే నేను నాపాత డైరీలో శంకరాభరణం సినిమా గురించి ‘’విశ్వనాధుని కీర్తికిరీటం లో మరో అమూల్యాభరణం శంకరాభరణం ‘’అనే శీర్షిఅక్తో రాసుకొన్న పెద్ద వ్యాసాన్ని విశ్వనాథ్ కు చూపిస్తే హెడ్డింగుల వారీగా చూసి నవ్వి సంతకం పెట్టి తేదీ కూడా రాశారు అది నాకు గొప్ప’’ ట్రెజరీ ‘’. సాయంత్రం ఇంటికి తిరిగివస్తూ ,మోపిదేవి లో శ్రీ సుబ్రహ్మ ణ్ఎశ్వర ఆలయానికి వెడితే అక్కడా వీళ్ళు కనిపించారు .ఇలా కళాతపస్వి విశ్వనాథ దర్శన భాగ్యం నాకు కలిగింది .
విశ్వ నాథ్ అమూల్య చిత్రాలు
జీవన జ్యోతి చిత్రం లో వాణిశ్రీ శోభన్ బాబుల చేత అద్భుత నటనను రాబట్టాడు. అందులోని ప్రతి మాట ,పాట గుండె తలుపుల్ని తడుతాయి. సన్ని వేశాలతో గుండెను పిండి చేసే మహా గొప్ప చాతుర్యం వుంది విశ్వనాథ్ కు .అలాగే ‘’అమ్మ మాట ‘’సినిమా లో (పేరు కర్రెక్టేనా? ))సత్యనారాయణ ,జయంతి ల నటన ల తో మనల్ని మరో లోకం లోకి తీసుకు వెద తాడు .మాతృత్వపు మహోన్నత భావాన్ని చాలా ప్రతిభావంతం గా ఆవిష్కరించాడు .ప్రపంచ ప్రసిద్ధ కథా’’డాస్టో విస్కీ’’ నవల –క్రైం అండ్ పనిష్ మెంట్ ‘’ఆధారంగా తీసిన నేరము -,శిక్ష లో ఎంతో బాలన్స్ గా emotions ను
కంట్రోల్ చేస్తాడు .’’ఆత్మ గౌరవం ‘’ను సరదాగా జలసాగా తీసి నవ్వులు పూయించాడు .జగ్గయ్య రామా రావు ల స్నేహ ధర్మానికి గొప్ప నిర్వచనం చెప్పాడు దీనిలోదేవిక వుంది సినిమా పేరు ‘ ‘’చిన్న నాటి స్నేహితులు ‘’ .ఇలా వొక్కొక్క సినిమాలో ఒక్కొక్క భావానికి తన దదైన న శైలి లో పట్టం కట్టాడు .
సిరి సిరి మువ్వ ,సీతా మహా లక్ష్మి లతో ఉత్తదర్శకుల జాబితాలో చేరాడు .ఇక శంకారాభరణం చిత్రంలో విశ్వ నాథ్ కళా విశ్వ రూపం చూస్తాము .సోమయాజులు మంజు భార్గవి పాత్రలను ఆరాధ్య మైన వాటిగా చూపటం లో సంగేత సాహిత్యాలని ఈ తరానికి కళాత్మకం గా పరిహాయం చేయటం లో ఈ నాటి యువతను మన సంస్కృతీ సాంప్రదాయాల వైపు మళ్లించటం లోసిని మాధ్యమం యెంత చేయాలో అంత కంటే ఎక్కువ గా చేసిదిగ్దర్శనం చేశాడు . ఉత్తమోత్తమ దర్శకుడని పించు కున్నాడు .కళామ తల్లికి బంగారు గొడుగు పట్టిన వాడనిపించుకున్నాడు .’’సప్త పది’’ చిత్రం లో శంకరాచార్య గారి అద్వైత సిద్ధాంతాన్ని కాలానుగుణ భాష్యం చెప్పి సెహ బాష్ అని పించు కున్నాడు. ఈ ధోరణి నచ్చని బాపు- రమణలు’’ రాదా కల్యాణం’’ తీసి దీన్ని తిప్పి కొట్టారన్నది వేరే విషయం .’’స్వర్ణ కమలం’’ లో భానుప్రియ లోని నట, నాట్య ప్రతిభను కనుల విందుగా కమనీయం గా ఆవిష్కరించిన తీరుకు జోహార్లె .’’స్వాతి కిరణం’’ లో ముమ్ముట్టి సహజ నటనకు నీరాజనం పట్టించాడు. రాధికను అమ్మ తనానికి ప్రతినిధి గా మలచిన తీరు అద్వితీయం .child progidy –బాల మేధావి ,బాల సంగీత విద్వాంసుడు ‘’మంజు నాథ్ పాత్రను తీర్చిన తీరు అతని నటనను వెలికి తీసిన విధానం ఈర్ష్య ఎంతపని చేయిస్తుందో చెప్పిన పధ్ధతి చిరస్మరణీయం .శిష్యుడి ఉన్నతిని సహించలేక ఈర్ష్య కు లోనై ముమ్మట్టి గురువు తీసుకున్న నిర్ణయం ఆబాల మేధావి గంగాధరం మరణానికి కారణమవుతుంది .ముమ్మట్టి ‘’అనంత రామ శర్మ ‘’అనే గొప్ప సంగీత విద్వాంసుడు .లోకమంతా నీరాజనాలు పట్టినాగంగాధారం లోని సృజనాత్మక సంగీత కళను గుర్తి౦చినా అహం అడ్డు వచ్చి ఏమీ నేర్పకుండా ఉంటాడు .అనంతరామ శర్మకు కుదరని స్వరాలను గంగాధరం స్వర పరచటం గురువు ఈర్ష్యను తార స్థాయికి తీసుకు వెడుతుంది .సంగీతం నేర్వటానికి అబాలుడు పెట్టిన దరఖాస్తు కూడా తిరస్కరిస్తాడు .ఆమోదించకుండానే మనసులో అవి గొప్ప స్వర రచనలని భద్రం గా ఉంచుతాడు లోకానికి తెలియకుండా .అభద్రతా భావం అతడిని అణువణువునా దహిస్తుంది .బాలమేధావి గంగాధరం మరణానికి అనంతరామ శర్మఅసూయ తో కారకుడు అయ్యాడని పోలీస్ ఇన్స్పెక్టర్ గ్రహిస్తాడు .ఇది తెలిసిన శర్మభార్య రాధిక మతి చలిస్తుంది .దేశాలు తిరుగుతూ ,మనో వ్యధతో కాలిపోతూ భార్య కొడుకు లాంటి బాలమేధావి గందాధారం పేర ఒక సంగీత ఎకాడమి స్థాపి౦చి సంగీతం నేర్పుతుంటే ,శర్మ అందులో విద్యార్ధిగా మిగిలిన శిష్యులతో పాటు కూర్చుంటాడు .పాఠం సాధన చేస్తున్న ఆమహా విద్వాంసుని శృతి సరి చేసుకోమని అందులోని ఒక బాలిక చెప్పటం తో ,తన తప్పులను తానూ తెలుసుకోవటం తో చిత్రం ముగుస్తుంది .గుండెలను పిండేసే సన్ని వేశాలతో భావం పుష్కలంగా ఉన్న గీతాలతో కమ్మని స్వరాలతో ప్రకృతి అందచందాలకు స్వర నీరాజనం పట్టే సంగీతంతో సినిమా స్థాయిని విశ్వ నాథ్ రమణీయంగా ,కమనీయంగా ఎలివేట్ చేశాడు . .నిన్న నే మరణించిన పద్మభూషణ్ శ్రీమతి వాణీ జయరాం అత్యద్భుతంగా పాడిన ‘’ఆనతి నీయరా ప్రభూ ‘’కొండా కోనల్లో లోయల్లో ‘’,జాలిగా జాబిలమ్మ ,తెలిమంచు కురిసింది ‘,ప్రణతి ప్రణతి ప్రణతి ,వైష్ణవి భార్గవి ,శివానీ భవానీ, శృతి నీవు గతినీవు ఈనా ఆకృతి నీవు ‘’పాటలు మాదుర్యానికే మాధుర్యాలు .రసాల ఊటలు, భావాల తేనెలు ,అమృతపు జాలులు .సంగీతసాహిత్య నటనా త్రివేణీ సంగమం ఈ చిత్రం .మనో నేత్రంతో అలోచించి చూసి గుండెలు పిండేట్లు రసరంజనం చేశాడు కళా స్రష్ట ద్రష్ట తపస్వి విశ్వ నాథ్. పక్షితీర్ధం మామ్మగా జయంతి ,గంగాధరం తండ్రిగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గొప్ప నటన ప్రదర్శించారు . సంగీత సామ్రాట్ గా పేరు పొందిన అనంత శర్మ ,తానూ చేసిన తప్పుకు కుమిలిపోతూ దేశ ద్రిమ్మరిగా తిరుగుతూ ,చివరికి చేరాల్సిన చోటుకే చేరి పశ్చాత్తాపంతో పాప దగ్దు డౌతాడు .ఏ సినిమాలో అయినా విశ్వనాథ్ ఇలాంటి మార్పే కోరతాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-23-ఉయ్యూరు